బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన మరో యాక్షన్ చిత్రం అఖండ-2. మైథలాజికల్ టచ్‌తో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేసింది. వారం రోజులు ఆలస్యంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అయితే అఖండ మూవీ థియేట్రికల్ రన్‌టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా ఉంది. కానీ ఓటీటీ విషయానికొస్తే రన్ టైమ్ భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. ఓటీటీలో కేవలం రెండు గంటల 20 నిమిషాలు ఉండనున్నట్లు సమాచారం. దాదాపు 25 నిమిషాల సీన్స్ కోత పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఏయే సీన్స్ కట్ చేశారనేది ఓటీటీలో చూశాకే క్లారిటీ రానుంది. దీనిపై వచ్చే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. కాగా.. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, పూర్ణ, సాయి కుమార్, రచ్చ రవి కీలక పాత్రల్లో నటించారు.
ఈ మూవీ కథేంటంటే..
చైనా ఆర్మీ జనరల్ తన కొడుకు చావుకు కారణమైన భారత్‌పై పగ తీర్చుకునేందుకు భారీ కుట్ర చేస్తాడు. మాజీ జనరల్ సహాయంతో బయోవార్ ద్వారా భారత్‌ను దొంగదెబ్బ తీయాలనుకుంటాడు. ఇందుకుగాను భారత్‌లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న ఠాకూర్(కబీర్ దుల్షన్ సింగ్) ని పావుగా వాడుతాడు. అతని సహాయంతో భారతీయులు బలంగా నమ్మే దేవుడు లేడని నిరూపించి..వారిమధ్య చిచ్చు పెట్టాలనుకుంటాడు. అందులో భాగంగా మహా కుంభమేళకు వచ్చిన భక్తులు స్నానం చేసే నదిలో డేంజర్ కెమికల్ కలిపిస్తాడు. దీంతో నదిలో స్నానం చేసినవారందరూ క్షణాల్లో కుప్పకూలిపోతారు. ప్రతిపక్ష నేత ఠాకూర్ ఈ ఘటనను రాద్ధాంతం చేసి దేవుడే ఉంటే ఇలా జరిగేకాదు..అసలు దేవుడు అనేవాడే లేడంటూ సామాన్యులను నమ్మిస్తాడు. జనాలు కూడా దేవుళ్లకు పూజలు చేయడం ఆపేస్తారు. మరోవైపు భక్తులకు వచ్చిన కొత్త రోగానికి వాక్సిన్ కనిపెట్టే పనిలో ట్రైనీ సైంటిస్ట్, ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ(బాలకృష్ణ) కూతురు జనని(హర్షాలి మల్హోత్రా) సక్సెస్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఠాకూర్ తన మనషులతో ఆ సైంటిస్టులను చంపేయిస్తాడు. జనని తప్పించుకొని పారిపోగా..ఠాకూర్ మనషులు ఆమెను వెతుకుతుంటారు. అదే సమయంలో రంగంలోకి దిగుతాడు అఖండ(బాలకృష్ణ). ఆ తర్వాత ఏం జరిగింది? ఠాకూర్ మనషుల నుంచి జననిని ఎలా కాపాడాడు? దేవుడే లేడని నమ్మిన జనాలకు.. ఆయన ఉన్నాడు? ఆపద వస్తే వస్తాడు? అని ఎలా నిరూపించాడు? సనాతనధర్మం పాటించే భారతీయులను దొంగదెబ్బ కొట్టాలనుకున్న చైనా ఆర్మీకి ఎలాంటి గుణపాఠం నేర్పించాడు? ఇందులో నేత్ర(ఆదిపినిశెట్టి), అర్చనగోస్వామి(సంయుక్త) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
📢 Streaming Date 🔒#Akhanda2 🔱 (Telugu) streaming from January 9 on Netflix in Telugu , Tamil, Kannada, Malayalam & Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/UQ6Ldm3DA8
— OTT Trackers (@OTT_Trackers) January 4, 2026


