
‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్ సినిమాల తర్వాత హీరో బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’.

ఈ మూవీలో హీరోయిన్‌గా సంయుక్తా మీనన్(Samyuktha Menon) ఎంపికయ్యారు.

ఈ విషయాన్ని చిత్రయూనిట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.

ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మహా కుంభమేళాలో జరుగుతోంది.

సినిమాలోని కీలక సీన్స్ షూట్ చేస్తు న్నారు.

అయితే ఇప్పటివరకూ హీరోయిన్ ఎవరు? అనే విషయంపై చిత్రబృందం ప్రకటించలేదు.

తాజాగా సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా ఎంపిక అయినట్లు మేకర్స్ ప్రకటించారు.

సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: సి. రాంప్రసాద్, సంతోష్ డి.














