 
													హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా, సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యం ఉన్న పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, ఆల్రెడీ ‘అఖండ 2: తాండవం’ సినిమాకు చెందిన కొంత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని రికార్డు చేశారు తమన్.
ఇదే సినిమాతో సర్వేపల్లి సిస్టర్స్‌ను పరిచయం చేస్తున్నారు తమన్. సర్వేపల్లి సిస్టర్స్ ఎనర్జిటిక్ వోకల్స్‌తో ఈ సినిమా మ్యూజిక్ స్కోర్ రెడీ అవుతోంది. ఈ విషయాలను గురువారం మేకర్స్ అధికారికంగా వెల్లడించి, సర్వేపల్లి సిస్టర్స్‌తో తమన్ ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ఇక బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ 2: తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
