శింబుతో జోడీ కట్టనున్న కాంతార హీరోయిన్‌! | Buzz: Rukmini Vasanth Opposite with Simbu Next Movie | Sakshi
Sakshi News home page

డ్రాగన్‌ డైరెక్టర్‌తో శింబు మూవీ.. హీరోయిన్‌గా కాంతార బ్యూటీ?

Apr 3 2026 8:48 AM | Updated on Apr 3 2026 10:37 AM

Buzz: Rukmini Vasanth Opposite with Simbu Next Movie

హిట్‌ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు తమిళ హీరో శింబు. నిజానికి ఆయన సరైన హిట్‌ చూసి చాలాకాలమే అయింది. అదే విధంగా సినిమాలు చేయడంలో కాస్త వెనకబడ్డ శింబు ఆ మధ్య మణిరత్నం డైరెక్షన్‌లో థగ్‌లైఫ్‌లో నటించగా అది పూర్తిగా నిరాశపర్చింది. ప్రస్తుతం ఇతడు వెట్రిమారన్‌ దర్శకత్వంలో అరసన్‌ మూవీ చేస్తున్నాడు. 

డ్రాగన్‌ డైరెక్టర్‌తో..
విజయ్‌ సేతుపతి పోలీస్‌ అధికారికగా కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీ ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్స్‌ కథాంశంతో రూపొందుతోంది. ఇప్పుడు శింబు మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఓమై కడవులే మూవీతో దర్శకుడిగా పరిచయమైన అశ్వద్‌ మారిముత్తు డ్రాగన్‌తో సంచలన సక్సెస్‌ అందుకున్నాడు. ఇప్పుడు శింబును డైరెక్ట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాడట! ఈ మూవీని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించనుందని తెలుస్తోంది. 

కాంతార బ్యూటీ
సంతానం ముఖ్య పాత్ర పోషించనున్నాడు. చాలా గ్యాప్‌ తర్వాత శింబు, సంతానం కలిసి నటించనున్న చిత్రం ఇదే! ఈ మూవీలో శింబుకు జంటగా కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాకు గాడ్‌ లవ్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement