పాన్‌ ఇండియా ఫ్రాంచైజీ సినిమాలో 'రుక్మిణి వసంత్' | Sakshi
Sakshi News home page

పాన్‌ ఇండియా ఫ్రాంచైజీ సినిమాలో 'రుక్మిణి వసంత్'

Published Sat, Mar 23 2024 7:02 AM

Actress Rukmini Vasanth Get Pan India Movie Chance - Sakshi

'సప్త సాగరాలు దాటి' సినిమాతో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన బ్యూటీ రుక్మిణి వసంత్.. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన విషయం తెలిసిందే. ఆమెకు టాలీవుడ్‌లో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఎమోషనల్ పాత్రలో అందర్నీ ఆకర్షించింది. ఇప్పటికే కోలీవుడ్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ను ఫైనల్‌ చేసుకున్న ఈ బ్యూటీ తెలుగులో కూడా నటించేందుకు పలు ప్రాజెక్ట్‌ల స్టోరీలను వింటుంది. 

తాజాగా ఆమెకు ఓ భారీ పాన్‌ ఇండియా సినిమాలో ఛాన్స్‌ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాంతార: చాప్టర్‌ 1 సినిమాలో రుక్మిణి వసంత్ ఫైనల్‌ అయినట్లు ఇండిస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూనే.. మరోవైపు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌కు రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ వారు చర్చలు కూడా జరిపారట. కాంతార కోసం రిషబ్‌ సొంత గ్రామం అయిన కెరడిలో ఒక భారీ సెట్‌ను కూడా క్రియేట్‌ చేశారట. అందులో రుక్మిణికి తాజాగా లుక్‌ టెస్ట్‌ కూడా జరిపారట మేకర్స్‌.. అందులో ఆమె సక్సెస్‌ అయినట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన కూడా వస్తుందని టాక్‌.

'సప్త సాగరాలు దాటి' సినిమా తర్వాత టాలీవుడ్ లో రుక్మిణి పేరు మరింత పాపులర్ అయ్యింది. సినిమా ఛాన్సులు క్యూ కట్టాయి. ఆ మధ్య విజయ్ దేవరకొండ లేటెస్ట్​ మూవీ కోసం ఈ ముద్దుగుమ్మ పేరును పరిశీలించారట. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ సినిమా విషయంలో కూడా రుక్మిణి వసంత్ పేరు వినిపించింది. ఓ వైపు తెలుగులో ఇలా రుక్మిణి పేరు పాపులర్ అవుతుండగానే మరోవైపు కోలీవుడ్ నుంచి ఆమెకు మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. స్టార్ డైరెక్షర్ మురుగుదాస్- శివకార్తికేయన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో రుక్మిణి వసంత్ ఛాన్స్​ పట్టేసింది. కథల ఎంపిక విషయంలో ఆమె చాలా తెలివిగా అడుగులేస్తుందని సమాచారం. 

Advertisement
 
Advertisement