
‘డ్రాగన్’ రేంజ్ గ్లోబల్ లెవల్లో ఉంటుందట. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
అక్టోబరులో ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ విదేశాల్లోప్రారంభం అవుతుందని, ఈ దిశగా చిత్రయూనిట్ ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెట్టిందని ఫిల్మ్‌నగర్ టాక్. అంతేకాదు... తన గత చిత్రాలు ‘కేజీఎఫ్’లో ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్’, ‘సలార్’లో ఖాన్సార్‌ప్రాంతాలు ఉన్నట్లే ‘డ్రాగన్’ సినిమాలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారట ప్రశాంత్ నీల్.
‘కోలార్ గోల్డ్ ఫీల్డ్, ఖాన్సార్’ల ప్రస్తావన ఇండియా వైడ్‌గా ఉంటే, ‘డ్రాగన్’ చిత్రం కోసం ప్రశాంత్ నీల్ సృష్టిస్తున్న ప్రపంచానికి ఇంటర్ నేషనల్ టచ్ ఉంటుందట. ఇందుకోసమే ఈ సినిమాను పలు విదేశీ లొకేషన్స్‌లో షూట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోందని భోగట్టా. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది.