యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షురూ | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షురూ

Published Fri, Feb 16 2024 12:54 AM

Rukmini Vasanth pairs up with Sivakarthikeyan in SK23 - Sakshi

శివ కార్తికేయన్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయింది. శ్రీ లక్ష్మీ మూవీస్‌ బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషల్లో రూపొం దుతున్న ఈ చిత్రం షూటింగ్‌ప్రారంభమైంది. ఈ మూవీలో కన్నడ నటి రుక్మిణీ వసంత్‌  కథానాయిక. ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొం దుతోన్న చిత్రమిది. మురుగదాస్‌గారు తన పాపులర్‌ స్టోరీ టెల్లింగ్‌ స్టయిల్‌లో ఈ చిత్రాన్ని రూపొం దించనున్నారు.

వరుస బ్లాక్‌బస్టర్‌లను అందుకుంటున్న శివకార్తికేయన్‌ కెరీర్‌లో ఈ మూవీ బిగ్గెస్ట్, గ్రాండియస్ట్‌ చిత్రం కానుంది. గత సినిమాల్లో చూసినట్లు కాకుండా ఈ సినిమాలో పూర్తిగా ప్రత్యేకమైన, స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తారు శివ కార్తికేయన్‌. ఈ చిత్రం ప్రేక్షకులకు హై యాక్షన్‌–ప్యాక్డ్‌ అనుభూతిని అందిస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: సుదీప్‌ ఎలామన్‌.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement