
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్ జంటగా నటించిన తాజా చిత్రం మదరాసి. ఈ మూవీకి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆడియన్స్ను అలరించేందుకు వచ్చేస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు.. సెప్టెంబర్ 5న మదరాసి థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ కథలో హీరో పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఈ కథ చెప్పిన వెంటనే శివ కార్తికేయన్‌కు నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారుని మురుగదాస్ వెల్లడించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ పాత్ర కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటుందని పేర్కొన్నారు.
అయితే గత ఐదేళ్లలో నేనెప్పుడూ ఖాళీగా ఉండలేదని ఏఆర్ మురుగదాస్ తెలిపారు. కానీ మధ్యలో ఓ యానిమేషన్ ప్రాజెక్ట్ కోసం చాలా పని చేసినట్లు వెల్లడించారు. దాని వల్లే చాలా సమయం వృథా అయిందని.. అందువల్లే ఐదేళ్ల గ్యాప్ వచ్చిందన్నారు.