కేజీఎఫ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది | Director Suri Talks Over Sri Murali Starrer Bagheera Movie | Sakshi
Sakshi News home page

కేజీఎఫ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది

Oct 27 2024 6:09 AM | Updated on Oct 27 2024 9:33 AM

Director Suri Talks Over Sri Murali Starrer Bagheera Movie

– దర్శకుడు సూరి 

శ్రీ మురళి హీరోగా డా. సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బఘీర’. ఇందులో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటించారు. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31 విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు డా. సూరి మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్‌ నీల్‌గారి ‘కేజీఎఫ్, సలార్‌’ చిత్రాల రైటింగ్‌ విభాగంలో నేనూ ఉన్నాను. శ్రీ మురళిగారితో నేను ఒక సినిమా చేద్దామనుకున్నప్పుడు కథ కుదర్లేదు. అప్పుడు తన దగ్గర కథ ఉందని ప్రశాంత్‌ నీల్‌గారు చెప్పడంతో ‘బఘీర’ చిత్రం ప్రారంభమైంది. సూపర్‌ హీరో అవ్వాలనుకున్న ఓ కుర్రాడి కథే ఈ చిత్రం. 

ఈ సినిమా అవుట్‌పుట్‌ చూసి ప్రశాంత్‌ నీల్‌గారు హ్యాపీ ఫీలయ్యారు. శ్రీ మురళి బాగా నటించారు. ‘బఘీర’ను ‘కేజీఎఫ్‌’తో ΄ోల్చి మాట్లాడుతున్నారు. ‘బఘీర’ సినిమా ‘కేజీఎఫ్‌’ టోన్‌లో ఉండదు. ‘కేజీఎఫ్‌’ చరిత్రలాంటి సినిమా. ఈ సినిమాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘పన్నెండేళ్ల  క్రితం యశ్‌తో ఓ సినిమా చేశాను (‘లక్కీ’). ఆ తర్వాత యశ్‌తో ట్రావెల్‌ అయ్యాను. యశ్‌ కథలను నేనే వినేవాడిని. అయితే యశ్‌తో నేను అనుకున్న సినిమా వర్కౌట్‌ కాలేదు. ఆ తర్వాత ‘కేజీఎఫ్‌’ వల్ల యశ్‌కు చాలా సమయం పట్టింది. దీంతో నేను శ్రీ మురళితో ‘బఘీర’ చేశాను’’ అని తెలి΄ారు. 

Advertisement
 
Advertisement
Advertisement