ఏఆర్‌ రెహమాన్‌ నిర్మాణంలో సుశీల బయోపిక్‌ | AR Rahman produce a biopic on legendary singer P Susheela with Rukmini Vasanth | Sakshi
Sakshi News home page

ఏఆర్‌ రెహమాన్‌ నిర్మాణంలో సుశీల బయోపిక్‌

Oct 20 2026 4:43 AM | Updated on Oct 20 2026 4:43 AM

AR Rahman produce a biopic on legendary singer P Susheela with Rukmini Vasanth

– సుశీలగా రుక్మిణీ వసంత్‌ 

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తన మధుర గాత్రంతో గానకోకిలగా ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సొంతం చేసుకున్న పి.సుశీల బయోపిక్‌ వెండితెరపైకి రానుందట. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలతో కోట్ల మంది మనసులను గెలుచుకున్న ఈ దిగ్గజ గాయని బయోపిక్‌ని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ స్వయంగా నిర్మించనున్నారట. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

సుశీల వంటి గొప్ప గాయని కథను ఏఆర్‌ రెహమాన్‌ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సుశీల పాత్రను ఎవరు పోషిస్తారు? అనే విషయంపై క్రేజీ రూమర్‌ వినిపిస్తోంది. తనదైన నటనతో దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణీ వసంత్‌ను ఈ పాత్ర కోసం ఎంపిక చేశారనే ప్రచారం జోరందుకుంది. సుశీల ఆహార్యం, అమాయకత్వంతో కూడిన సహజమైన రూపాన్ని తెరపై పండించేందుకు రుక్మిణీ వసంత్‌ సరిగ్గా సరిపోతారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అన్నది ఆసక్తిగా మారింది. అయితే సుశీల బయోపిక్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement