ఎన్టీఆర్-నీల్ మూవీ కోసం 'సాగరాలు' బ్యూటీ? | Rukmini Vasanth Talks For Ntr Neel Movie | Sakshi
Sakshi News home page

Ntr Neel: తారక్-నీల్ సినిమా గురించి క్రేజీ రూమర్స్

Oct 1 2024 5:00 PM | Updated on Oct 1 2024 5:23 PM

Rukmini Vasanth Talks For Ntr Neel Movie

'దేవర' హిట్‌తో ఎన్టీఆర్ మంచి జోష్‌లో ఉన్నాడు. త్వరలోనే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్‌గా కన్నడ బ్యూటీని పరిశీలిస్తున్నారని, స్టోరీ కూడా ఇదేనని తెగ మాట్లాడేసుకుంటున్నారు.

(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్)

ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమాని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ ఇద్దరూ ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల ఇన్నాళ్లు పట్టింది. నవంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. డిసెంబరు నుంచి తారక్ సెట్స్‌లోకి వస్తాడని తెలుస్తోంది. ఇకపోతే 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్.. హీరోయిన్‌గా అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది.

2019 నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది రుక్మిణి. ప్రస్తుతానికి తమిళంలో ఒకటి, కన్నడలో రెండు చిత్రాలు చేస్తోంది. ఇప్పుడు తారక్ సరసన అనేసరికి ఈమె ఫ్యాన్స్ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇకపోతే ఈ సినిమా స్టోరీ బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని తెలుస్తోంది. పూర్తిస్థాయి యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement