
కాంతార చాప్టర్-1 విడుదల తర్వాత రుక్మిణీ వసంత్(Rukmini Vasanth) పేరు పాన్ ఇండియా రేంజ్‌లో ట్రెండ్ అవుతుంది. అందుకు ప్రధాన కారణం ఆమె అందంగా ఉండటమే కాకుండా తన నటన, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఏకంగా శాండల్‌వుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేసింది. కాంతార సినిమా చూసిన వాళ్లు అందరూ ఆమెనే నేషనల్ క్రష్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పుష్ప సినిమా తర్వతా రష్మిక మందన్నకు దక్కిన గుర్తింపే రుక్మిణీకి దక్కుతుంది. ఆపై వీరిద్దరూ కూడా కన్నడ నుంచే రావడం విశేషం. తనను నేషనల్ క్రష్ అని పిలువడంపై రుక్మిణీ వసంత్ రియాక్ట్ అయింది.

ఇటీవల శివకార్తికేయన్ సరసన ‘మదరాసీ’లో మెప్పించిన రుక్మిణీ.. ‘కాంతార చాప్టర్-1’తో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం తన చేతిలో యశ్ టాక్సిక్, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే.. ఇందులో ఆమె పాత్ర కూడా బలంగా ఉండబోతుందని తెలుస్తోంది.

నేషనల్ క్రష్ గురించి
నేషనల్ క్రష్ ట్యాగ్‌లైన్ గురించి రుక్మిణీ ఇలా చెప్పింది. 'కొద్దిరోజుల నుంచి చాలా మంది నేషనల్ క్రష్ అంటూన్నారు. ఈ విషయం నా వరకు కూడా వచ్చింది. ఇలాంటివి వినడానికి మాత్రమే చాలా బాగుంటాయి. సంతోషాన్ని కూడా ఇస్తాయి. కానీ, ఇలాంటి ప్రశంసల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. ఇలాంటివి ఏమైనా సరే తాత్కాలికంగానే ఉంటాయి. కాలంతో పాటు ఎందరో వస్తుంటారు.. అవి కూడా మారిపోతుంటాయని నేను నమ్ముతాను. కానీ, ప్రేక్షకులకు దగ్గరగా ఉంటే చాలనుకుంటాను. ‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో చాలామంది నన్ను ప్రియ పాత్రతో పిలుస్తుంటారు. ఇలా ప్రేక్షకులకు చేరువయ్యితే చాలనుకుంటాను. చాలా సింప్లిసిటీతో కూడిన ఆ పాత్రను కూడా సినీప్రియులు ఆదరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.'అని ఆమె అన్నారు.