'కాంతార' షూట్‌లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి | Rishab Shetty Reveals Shocking Thing During Kantara Chapter 1 Shooting In Trailer Launch Event, Video Went Viral | Sakshi
Sakshi News home page

Rishab Shetty: 3 నెలలుగా నిద్రలేదు.. భార్య, పిల్లల్ని సరిగా చూసుకోలేకపోయా

Sep 23 2025 10:06 AM | Updated on Sep 23 2025 10:42 AM

Rishab Shetty Speech Kantara Chapter 1 Trailer Launch

కన్నడ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కాంతార ఛాప్టర్ 1'. 2022లో వచ్చిన తొలి భాగానికి ప్రీక్వెల్ ఇది. అక్టోబరు 02న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సోమవారం అన్ని భాషల ట్రైలర్స్ లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇందులో టీమ్ అంతా పాల్గొని మూవీ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి.. సినిమా గురించి మాట్లాడాడు. అలానే 'కాంతార 1' చూడాలంటే మందు, సిగరెట్, మద్యం సేవించకుండా రావాలని చెప్పి వైరల్ అవుతున్న పోస్టర్‌పైన స్పందించాడు.

'కాంతార అనేది ఐదేళ్ల ఎమోషనల్ జర్నీ. తొలి భాగానికి రెండేళ్లు, ప్రీక్వెల్ కోసం మూడేళ్లు. ఈ ఐదేళ్లలో నా కుటుంబాన్ని కూడా సరిగా చూసుకోలేకపోయాను. అయితే సినిమాని పూర్తి చేసిన అనుభూతి కలిగింది. మా టీమ్‌కి గత మూడు నెలలుగా సరైన నిద్ర లేదు. ఎందుకంటే పని జరుగుతూనే ఉంది. ప్రతిఒక్కరూ ఇది తమ మూవీ అన్నట్లు కష్టపడ్డారు. చెప్పాలంటే షూటింగ్‌లో నేను కూడా 4-5 సార్లు చనిపోవాల్సిన వాడిని. కానీ ఆ దైవమే నన్ను రక్షించింది' అని రిషభ్ శెట్టి చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: నామినేషన్స్‌లో ఆరుగురు.. రీతూని మోసం చేసిన పవన్)

'కాంతార' తొలి భాగం ఓ పల్లెటూరిలో జరిగే డ్రామా కాగా ఈసారి సినిమాని భారీగానే తెరకెక్కించారు. స్టోరీ సెటప్ అంతా అడవికి మారింది. అలానే శివ(రిషభ్) తండ్రి కాంతార, అడవిలో తప్పిపోవడానికి కంటే ముందు ఏం జరిగింది అనే బ్యాక్ డ్రాప్‌తో ప్రీక్వెల్ తీశారు. ఈసారి స్నేహం, నమ్మకద్రోహం, యుద్ధాలు తదితర అంశాల్ని ట్రైలర్‌లో చూపించారు. బ్యౌక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈసారి రిషభ్ శెట్టి జంటగా రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య విలన్‌గా చేశాడు.

ఇకపోతే 'కాంతార 1' సరికొత్త రికార్డ్ సృష్టించింది. 12 గంటల్లోపే అన్ని భాషాలు కలిపి 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. మంగళవారం మధ్యాహ్నం వస్తే 24 గంటలు  పూర్తవుతుంది. అప్పటికీ మరిన్ని మిలియన్స్ వ్యూస్‌తో పాటు సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారంటీ అనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమా చూడాలంటే మందు, సిగరెట్, మద్యం తాగకుండా రావాలని వైరల్ అవుతున్న పోస్టర్ ఫేక్ అని రిషభ్ శెట్టి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చాడు. తొలుత ఇది చూసి షాకయ్యానని, నిర్మాణ సంస్థని అడిగితే అది ఫేక్ పోస్టర్ అని క్లారిటీ ఇచ్చారని, దాని గురించి మాట్లాడలనుకోవట్లేదని అన్నాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement