
మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలోకి వచ్చిన నెలరోజుల్లోనే స్ట్రీమింగ్ కానుంది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?
మత్తు వదలరా, పంచతంత్రం, పరువు, వికటకవి లాంటి సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నరేశ్ అగస్త్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మేఘాలు చెప్పిన ప్రేమకథ'. ఆగస్టు 22న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల్లో పెద్దగా రిజిస్టర్ కాకుండానే మాయమైపోయింది. ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ నెల 26 నుంచి అంటే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: రామ్ చరణ్ కోసం ఫ్లాప్ హీరోయిన్?)
'మేఘాలు చెప్పిన ప్రేమకథ' విషయానికొస్తే.. వరుణ్ (నరేశ్ అగస్త్య) విదేశాల్లో చదువుకుని తిరిగి ఇండియాకు వచ్చేస్తాడు. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనేద ఇతడి కోరిక. దీని గురించి తండ్రికి(సుమన్) చెబితే కోప్పడతాడు. దీంతో వరుణ్ ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు. తమిళనాడులోని వాల్పరై అనే ఊరికి వెళ్తాడు. ఇక్కడ చిన్నప్పుడు నాయినమ్మ కాంచీపురం కామాక్షి శంకరమూర్తి(రాధిక శరత్ కుమార్)తో గడిపిన బంగ్లా, ఎస్టేట్ ఉంటాయి. మరోవైపు మేఘన(రబియా ఖాతూన్) కూడా ఈ ఊరికి వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో వరుణ్-మేఘన ప్రేమలో పడతారు. మరి వీరిద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగింది? గాయకుడు, సంగీత దర్శకుడిగా వరుణ్ సక్సెస్ అయ్యాడా లేదా అనేది మిగతా స్టోరీ.
ఈ వారం ఓటీటీల్లో 'మేఘాలు చెప్పన ప్రేమకథ' కాకుండా జూనియర్, సుందరకాండ లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. అలానే హృదయపూర్వం, ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా, సుమతి వళవు తదితర డబ్బింగ్ సినిమాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు సడన్ సర్‌ప్రైజులు లాంటి కొత్త చిత్రాలు కూడా ఏమైనా రావొచ్చు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు)
Two worlds, one bond.
Together, they find something greater 💖💫
Meghalu Cheppina Prema Katha premieres 26th September on SunNXT.
Watch the journey unfold!#MeghaluCheppinaPremaKatha #Premieres26thSeptemberOnSunNXT #LoveStory #MusicalRomance pic.twitter.com/qbHwqVq0ZX— SUN NXT (@sunnxt) September 22, 2025