
మెగాహీరో రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' చేస్తున్నాడు. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం వచ్చిన గ్లింప్స్ చూసి అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. చాన్నాళ్ల క్రితమే ఇది ఓకే అయింది. తాజాగా ఈ సినిమా పనులు కూడా షురూ అయ్యాయి. అయితే హీరోయిన్ గురించి వినిపిస్తున్న రూమర్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తుంది.
చరణ్-సుకుమార్ గతంలో 'రంగస్థలం' చేశారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో మరోసారి ఈ కాంబో అనేసరికి అంచనాలు గట్టిగానే ఏర్పడుతున్నాయి. మరోవైపు 'పుష్ప' ఫ్రాంచైజీ తర్వాత సుకుమార్ తీస్తున్న ప్రాజెక్ట్ కావడం కూడా హైప్‌కి కారణం. ఈ మూవీలో హీరోయిన్‌గా పలువురు పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఫైనల్‌గా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ని లాక్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం డిస్కషన్స్ నడుస్తున్నాయని, త్వరలోనే క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ప్రియుడి వల్ల ప్రతిరోజూ శారీరకంగా టార్చర్: ఆర్జీవీ హీరోయిన్)
కృతి సనన్ విషయానికొస్తే సుకుమార్ తీసిన 'వన్ నేనొక్కడినే' సినిమాతోనే హీరోయిన్ అయింది. తర్వాత తెలుగులో 'దోచెయ్' చేసింది గానీ ఈ రెండూ ఫెయిలయ్యాయి. దీంతో పూర్తిగా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. మధ్యలో కొన్ని హిట్స్ కొట్టినప్పటికీ.. గత రెండు మూడేళ్లలో మాత్రం ఈమె చేసిన సినిమాలు చేసినట్లు ఫ్లాప్ అవుతున్నాయి. మరి ఇలాంటి ఈమెని ఇప్పుడు చరణ్ సరసన హీరోయిన్‌గా తీసుకుంటున్నారనేసరికి అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
అయితే సుకుమార్ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడ ఇంపార్టెన్స్ కచ్చితంగా ఉంటుంది. బహుశా పాన్ ఇండియా ఇమేజ్ దృష్ట్యా కృతి సనన్ పేరు పరిశీలిస్తున్నారా అనే సందేహం కూడా వస్తోంది. చూడాల మరి ఎవరిని ఫైనల్ చేస్తారో? ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశాలున్నాయి. 2027లో రిలీజ్ కావొచ్చని టాక్.
(ఇదీ చదవండి: 'ఓజీ' సినిమా ట్రైలర్ రిలీజ్)
