
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఓజీ'. సుజీత్ దర్శకత్వం వహించిన చిత్రం ఈ గురువారమే(సెప్టెంబర్ 25) థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్ల రూపంలో పాటలు, స్టిల్స్ వదిలారు. హైదరాబాద్‌లో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. ఆ కార్యక్రమంలో ట్రైలర్ ప్లే చేశారు గానీ బయటకు మాత్రం వదల్లేదు. ఇప్పుడు పనంతా పూర్తవడంతో ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు)
ట్రైలర్ చూస్తుంటే ముందునుంచి చెప్పినట్లే యాక్షన్ కనిపిస్తోంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. ఇమ్రాన్ హష్మీ ప్రెజెన్స్ బాగుంది. ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ తదితరుల సీన్స్ కూడా ట్రైలర్లో చూపించారు.
(ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' ట్రైలర్ రిలీజ్)