
2022లో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ వసూళ్లు అందుకున్న సినిమా 'కాంతార'. దీని ప్రీక్వెల్‌ని 'కాంతార ఛాప్టర్ 1' పేరుతో తీశారు. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించగా.. హొంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అక్టోబరు 02న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: 'చిన్నారి పెళ్లికూతురు'కి ఇప్పుడు నిజంగానే పెళ్లి)
ట్రైలర్ చూస్తుంటే ఈసారి భారీతనం కనిపిస్తోంది కానీ ఓకే ఓకే అనిపించింది. రిషభ్ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్.. రుక్మిణి వసంత్ అందం ఎలివేట్ అయ్యాయి. విలన్ పాత్రలో గుల్షన్ దేవయ్య ఆకట్టుకునేలా కనిపించాడు. 'కాంతార' తొలి భాగంలో ప్రస్తుతం ఏం జరిగిందా అనే డ్రామాని సింపుల్‌గా చూపించారు. ఈసారి మాత్రం రాజులు, యుద్ధాలు, రాజకుమారితో హీరో ప్రేమలో పడటం ఇలా అన్ని కూడా భారీగానే సెటప్ చేశారు. మరి 'కాంతార' ఈసారి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు)