
'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్.. ఇప్పుడు నిజంగానే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానితో ఒక్కటి కానుంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీళ్లిద్దరూ ఇప్పుడు శుభవార్త చెప్పేశారు. ఓ రియాలిటీ షోలో జంటగా పాల్గొన్న వీళ్లిద్దరూ ఈ సంగతి బయటపెట్టారు. ఇంతకీ పెళ్లెప్పుడు?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు)
సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన అవికా.. తెలుగులోనూ పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. 'ఉయ్యాలా జంపాలా' మూవీతో పరిచయంలోనే హిట్ కొట్టిన ఈమె.. తర్వాత సినిమా చూపిస్త మావ, లక్ష‍్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, రాజుగారి గది 3, థ్యాంక్యూ తదితర తెలుగు మూవీస్ చేసింది, ప్రస్తుత 'షణ్ముఖ' సినిమాలో చేస్తోంది.
అసలు విషయానికొస్తే.. 2019లో సామాజిక కార్యకర్త అయిన మిలింద్‌ని ఓ సందర్భంలో అవికా కలిసింది. అలా ఏడాది పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ 2020 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు సెప్టెంబరు 30న పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని అవికా.. ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఈ క్రమంలోనే కాబోయే వధూవరులకు అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు.
(ఇదీ చదవండి: మనీష్ ఎలిమినేట్.. రెండువారాల సంపాదన ఎంతంటే?)