
రామ్ గోపాల్ వర్మ తీసిన 'వంగవీటి' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నైనా గంగూలీ.. తర్వాత కూడా ఆర్జీవీ తీసిన 'డేంజరస్' అనే మూవీలో నటించింది. వీటితో పాటు జోహార్, మళ్లీ మొదలైంది, తగ్గేదే లే తదితర చిత్రాలతోనూ అలరించింది. గతేడాది ఈమె కన్నడలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే తన బాయ్ ఫ్రెండ్ తనని వేధిస్తున్నాడని చెప్పి ఇన్ స్టాలో ఈమె పోస్ట్ పెట్టింది. అయితే ఎవరు ఏంటి అనేది మాత్రం బయటపెట్టలేదు.
(ఇదీ చదవండి: 'ఓజీ' సినిమా ట్రైలర్ రిలీజ్)
'నా వ్యక్తిగత విషయాలు కొన్ని మీకు చెప్పే టైమ్ వచ్చింది. గత మూడేళ్లుగా నేను ఎక్కడా పనిచేయలేదు. దానికి ఓ కారణముంది. కానీ ఇప్పుడు అదెందుకో చెప్పేందుకు మీ ముందుకొచ్చాను. కోల్‌కతాకి చెందిన కొరియోగ్రాఫర్‌తో గత కొన్నేళ్ల నుంచి నేను రిలేషన్‌లో ఉన్నాను. కానీ ప్రేమలో ఉన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ప్రతిరోజూ శారీరకంగా, మానసికంగా టార్చర్ అనుభవిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టాయి. అతడి ప్రియుడు త్వరలోనే బయటపెడతాను' అని నైనా గంగూలీ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.
కోల్‌కతాలో పుట్టిన నైనా.. మోడలింగ్ చేసింది. అలా రాంగోపాల్ వర్మ దృష్టిలో పడింది. హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది. మరి రిలేషన్‍లో ఉండటం వల్ల మూవీస్ చేయకపోవడం, ప్రియుడు వేధింపులు చూస్తుంటే విషయం ఏదో పెద్దగానే ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఆ కొరియోగ్రాఫర్ ఎవరో ఏంటో నైనా చెప్తే అసలు విషయం ఏంటనేది క్లారిటీ రావొచ్చు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు)