సాయి పల్లవి చాన్స్‌ కొట్టేసిన రుక్మిణీ వసంత్‌! | Rukmini Vasanth Replaced Sai Pallavi In MS Subbulakshmi Biopic, Check Out Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

సాయి పల్లవి చాన్స్‌ కొట్టేసిన రుక్మిణీ వసంత్‌!

Apr 27 2026 8:40 AM | Updated on Apr 27 2026 10:15 AM

Rukmini Vasanth Replaced Sai Pallavi In MS Subbulakshmi Biopic

దివంగత ప్రఖ్యాత గాయని, భారతరత్న అవార్డుగ్రహీత ఎంఎస్‌ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బయోపిక్‌కు ‘జెర్సీ’ సినిమా ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారని, గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మాణంలో భాగస్వామిగా ఉంటుందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే ఎంఎస్‌ సుబ్బులక్ష్మి పాత్రలో సాయి పల్లవి నటిస్తారనే టాక్‌ తొలుత వినిపించింది. కానీ ఇప్పుడు ఈ చాన్స్‌ కన్నడ నటి, ‘కాంతార’ ఫేమ్‌ రుక్మిణీ వసంత్‌ను వరించిందని టాక్‌. 

‘రామాయణ’  (రెండు భాగాలుగా రానున్న సినిమా), ధనుష్‌ కొత్త చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీంతో కాల్షీట్స్‌ సర్దుబాటు చేయలేక ఎంఎస్‌ సుబ్బులక్ష్మి సినిమా నుంచి సాయి పల్లవి తప్పుకోవాల్సి వచ్చిందట. ఆ చాన్స్‌ రుక్మిణీ వసంత్‌కి వెళ్లిందని సమాచారం. మరి... ఎంఎస్‌ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రుక్మిణీ వసంత్‌ ఫైనలైజ్‌ అవుతారా? వేచి చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement