
2022లో రికార్డు సృష్టించిన ‘కాంతర’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రాబోతున్న చిత్రం కాంతార: చాప్టర్ 1(Kantara Chapter 1 ). తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులో ప్రభాస్, హిందీలో హృతిక్, మలయాళంతో పృ థ్విరాజ్, తమిళ్‌లో శివకార్తికేయన్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ట్రైలర్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ ప్రేక్షకులుని కాంతారా ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. ఇక ఈ ట్రైలర్ అనేక రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో ఈ ట్రైలర్ అన్ని భాషలు కలిపి 107 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో పాటు 3.4 మిలియన్ లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ మూవీలొ రిషబ్ శెట్టి సరసన యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడిగా రిషబ్ శెట్టి ఒక దృశ్య కావ్యంలా తీర్చిదిద్దుతున్నారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అక్టోబర్ 2న కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
𝟏𝟎𝟕𝐌+ 𝐕𝐢𝐞𝐰𝐬 & 𝟑.𝟒𝐌+ 𝐋𝐢𝐤𝐞𝐬 𝐢𝐧 𝟐𝟒 𝐡𝐨𝐮𝐫𝐬…🔥
The Trailer of #KantaraChapter1 takes the internet by storm, igniting massive excitement everywhere.
Watch #KantaraChapter1Trailer now – https://t.co/YVnJsmn7Vx
In cinemas #KantaraChapter1onOct2 ✨#Kantara… pic.twitter.com/WyjLETiGsX— Hombale Films (@hombalefilms) September 23, 2025