
రిలీజ్‌కి రెండు రోజుల ముందు ఓవర్సీస్ మార్కెట్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) నటించిన ఓజీ (OG) మూవీకి భారీ దెబ్బ తగిలింది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీ షోలు అన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఓజీ షోలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశంలో అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ అధికారిక ప్రకటన వెల్లడించింది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వ్యక్తుల అరాచకాలు, అనైతిక చర్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యార్క్ సినిమాస్ పేర్కొంది.
‘సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామాజిక, రాజకీయ విభేదాలు సృష్టించి ప్రజల భద్రతకు ముప్పు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. ప్రీబుకింగ్ చేసుకున్నవారికి రిఫండ్ చేస్తాం.పబ్లిక్ సెక్యూరిటే మా టాప్ ప్రయారిటీ’ అని యార్క్ సినిమాస్ ఓ సుధీర్గమైన లేఖను ఎక్స్ లో పోస్ట్ చేసింది.
‘నార్త్ అమెరికాలో ఓజీ సినిమాను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్ తరపున యార్క్ సినిమాస్‌కు కొన్ని రిక్వెస్టులు వచ్చాయి. ఈ సినిమా సేల్స్ గణాంకాలను పెంచమని ఫోర్స్ చేశారు. తద్వారా భవిష్యత్‌లో రిలీజ్ అయ్యే దక్షిణాసియా సినిమాల వాల్యూ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశారు. గత కొద్దికాలంగా నార్త్ అమెరికాలో సౌత్ ఏషియా ఫిల్మ్ ఇండస్ట్రీపై కంట్రోల్ పెంచుకోవడానికి ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. సామాజిక, రాజకీయ వర్గాలతో సంబంధాలు పెంచుకొని ఇలాంటి వ్యక్తులు నార్త్ అమెరికాలో కల్చరల్‌గా విభేదాలు సృష్టించి విడగొట్టడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి అనైతిక చర్యలు, విధానాలను యార్క్ సినిమాస్ వ్యతిరేకిస్తుంది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామరస్యతను పెంచేందుకు.. వారిని ప్రోత్సహించేందుకు యార్క్ సినిమాస్ ప్రయత్నిస్తుంది’ అని యార్క్ సినిమాస్ లేఖలో పేర్కొంది.
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, ప్రియాంకా మోహన్ జోడీగా నటించిన చిత్రం ‘ఓజీ’. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.
⚠️ Press Release (Safety)#YorkCinemas #TheyCallHimOG#OGMovie #Update pic.twitter.com/xoLCVV5oEU
— York Cinemas (@yorkcinemas) September 22, 2025