
మిరాయ్ (Mirai Movie) మూవీ టీమ్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు. తేజ సజ్జా హార్డ్ వర్క్, డెడికేషన్ అద్భుతమని కొనియాడారు. మై బ్రదర్ మంచు మనోజ్ తన ప్రదర్శనతో అదరగొట్టేశాడని అన్నారు. రితికా నాయక్ తన ఫర్మామెన్స్తో అదరగొట్టేసిందని.. శ్రియా, జగపతి బాబు పవర్ఫుల్ రోల్స్‌లో మెప్పించారని ప్రశంసించారు. మిరాయ్ మూవీ టెక్నికల్గా అద్భుతంగా ఉందన్నారు. ముఖ్యంగా సీజీ, ఆర్ట్, మిక్సింగ్ టీమ్ వర్క్ గొప్పగా ఉందన్నారు.
డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటిక్ విజన్.. కొత్త కమర్షియల్ డైరెక్టర్ను అందించిందని అల్లు అర్జున్ ప్రస్తావించారు. అలాగే ఈ సినిమా నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్కు అభినందనలు తెలిపారు. గ్రేట్ సక్సెస్ సాధించినందుకు మిరాయ్ టీమ్‌ను ఐకాన్ స్టార్ అభినందించారు.
కాగా.. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తొలి రోజు నుంచే హిట్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Congratulations to the #MIRAI team! Brilliantly crafted with passion and conviction.
Brother @tejasajja123, respect for your hard work and dedication. Huge credit for mounting a film like this.
My brother @HeroManoj1, you killed it! Sweet presence by @RitikaNayak_ & powerful… pic.twitter.com/Pt1v02be6r— Allu Arjun (@alluarjun) September 23, 2025