
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన తాజా చిత్రం ఓజీ. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. మాఫియా నేపథ్యంలోన తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆడియన్స్‌ను బ్యాడ్‌న్యూస్. ఓవర్సీస్ అభిమానులకు ప్రత్యంగిరా సినిమాస్ ఊహించని ఝలక్ ఇచ్చింది. ఓజీ తమిళ వర్షన్ నార్త్ అమెరికాలో రిలీజ్ చేయడం లేదని వెల్లడించింది. కేవలం తెలుగు, హిందీ వర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుందని ట్వీట్ చేసింది. తమిళంలో రిలీజ్ కాకపోవడానికి గల కారణాన్ని వివరించింది.
కంటెంట్ ఆలస్యం కారణంగానే ఓజీ తమిళ వెర్షన్ ఉత్తర అమెరికాలో విడుదల కావడం లేదని తెలిపింది. అయితే తెలుగు, హిందీ వర్షన్లు ముందు అనుకున్న ప్రకారమే నార్త్ అమెరికా అంతటా ప్రదర్శిస్తామని పోస్ట్ చేసింది. మీకు కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నామని ప్రత్యంగిరా సినిమాస్ ట్వీట్ చేసింది.
కాగా.. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ ట్రైలర్ అనుకున్న టైమ్‌కు రిలీజ్ కాలేదు. టైమ్, డేట్ ప్రకటించినా అనుకున్నట్లు విడుదల చేయలేకపోయారు. దీంతో ఓజీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా ఉత్తర అమెరికాలో తమిళ వర్షన్ రిలీజ్ చేయకపోవడంతో కోలీవుడ్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పేలా లేదు. సకాలంలో కంటెంట్ అందించలేకపోయినా ఓజీ మేకర్స్ ఈ విషయంలో పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది.
Due to unavoidable content delays, the Tamil version of #TheyCallHimOG will not be releasing in North America. However, the Telugu and Hindi versions will be screened across the region as planned. We sincerely regret the inconvenience and thank you for your understanding and…
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 23, 2025