
కాంతార ప్రపంచంలోకి వెళ్లేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇదే క్రమంలో ఈ సినిమా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. 2022లో విడుదలైన 'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్1' తెరకెక్కింది. ఇందులో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూనే దర్శకుడిగా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
కాంతార చాప్టర్1 చిత్రానికి U/A 16+సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. 2 గంటల 48 నిమిషాల రన్ టైమ్‌తో ఉన్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. అయితే, సెన్సార్‌లో 16 ప్లస్ మాత్రమే అని మెన్షన్ చేయడంతో చిన్నపిల్లలకు ఈ సినిమా చూసే అవకాశం లేదని చెప్పవచ్చు. ఐనాక్స్, పీవీఆర్ వంటి మల్టిఫ్లెక్స్‌లలో చిన్నపిల్లలకు ఎంట్రీ కాస్త కష్టంగానే ఉంటుందని చెప్పవచ్చు.తాజాగా విడుదలైన ట్రైలర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌తో ‘సలార్’ మూవీ చేసిన ప్రభాస్ ఇప్పుడు కాంతార కోసం తనవంతుగా చేతులు కలిపారు. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను డార్లింగ్ విడుదల చేశారు. తమిళ్ శివ కార్తికేయన్, హిందీలో హృతిక్ రోషన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో ట్రైలర్ లాంచ్ చేయించి పాన్ ఇండియా మార్కెట్‌ను ఆకర్షించారు. ‘కాంతార’ సినిమా లాగే ఈ కథ కూడా అడవిని నమ్ముకుని జీవించే గిరిజన తెగ చుట్టూ తిరుగుతుంది. మట్టిపై వాళ్లకున్న మమకారంతో పాటు వాళ్ల సంప్రదాయాలు కనిపించనున్నాయి. అక్కడి తెగను అణగదొక్కి వాళ్ల సంపదను దోచుకోవాలనుకునే దురాశపరుడైన రాజును ఎలా ఎదొర్కొన్నారనే అంశాలు ట్రైలర్‌లో కనిపించాయి.