
కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కాంతార ఛాప్టర్ 1'. అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే టికెట్ రేట్ల విషయమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చిత్ర నిర్మాతలు హైకోర్టుని ఆశ్రయించారు. గత కొన్నిరోజులుగా ఈ కేసు విషయమై వాదనలు నడిచాయి. ఇప్పుడు నిర్మాతలకు అనుకూలంగా తీర్పు వెలువడింది.
కర్ణాటకలోని టికెట్ రేట్లని ప్రభుత్వం నిర్ణయిస్తూ కొన్నిరోజుల క్రితం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఏ థియేటర్‌లోనైనా సరే రూ.200 కంటే ఎక్కువ ధరకు టికెట్ అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు. 'కాంతార'కి ఇదే అమలు చేస్తే పెట్టిన బడ్జెట్ తిరిగి రావడం కష్టమవుతుంది. దీంతో నిర్మాతలు హైకోర్ట్‌కు వెళ్లారు. టికెట్ ధరల్లో వెసులుబాటు కల్పించాలని పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వ రూల్‌ని తాత్కాలికంగా హోల్ట్‌లో పెట్టింది. టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు నిర్మాతలకు కల్పించింది.
(ఇదీ చదవండి: 'కాంతార' షూట్‌లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి)
ఈ క్రమంలోనే 'కాంతార' టికెట్ రేట్ల విషయంలో లైన్ క్లియర్ అయింది. ఫలితంగా కర్ణాటకలో భారీ రేట్లు ఉండబోతున్నాయి. తమిళనాడులో ఎలానూ రూ.200 లోపే టికెట్ ధర ఉంటుంది. మరి తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీకి పెంపు ఏమైనా తీసుకొస్తారా? లేదంటే ఉన్న రేట్లకు టికెట్స్ అమ్ముతారా అనేది చూడాలి?
'కాంతార' తొలి భాగానికి ప్రీక్వెల్‌గా ఈ సినిమాని తీశారు. ఈసారి భారీ ఎత్తున మూవీని తెరకెక్కించారు. ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం, భక్తి, యుద్ధాలు తదితర అంశాలు ఉన్నాయి. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించగా.. ఇతడికి జోడీగా రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య విలన్‌గా చేశాడు.
(ఇదీ చదవండి: ఈ హీరోలు అసలెక్కడున్నారు? సినిమాలు ఎందుకు చేయట్లేదు?)