
‘‘నా సినిమాలు ‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజ్ డాన్’, ‘మహావీరుడు’, ‘అమరన్’ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ‘మదరాసి’(Madharaasi ) సినిమాను కూడా ఆదరించాలి. విజయం కంటే మీరు (ప్రేక్షకులు) చూపించే ప్రేమే నాకు చాలా ప్రత్యేకం’’ అని శివ కార్తికేయన్ చెప్పారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ , రుక్మిణీ వసంత్ జోడీగా నటించిన చిత్రం ‘మదరాసి’. శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది.
(చదవండి: ఈ వ్యక్తిత్వం మీరు.. తండ్రిని గుర్తు చేసుకుని ఎన్టీఆర్ పోస్ట్)
హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మదరాసి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివ కార్తికేయన్(Sivakarthikeyan) మాట్లాడుతూ– ‘‘చిరంజీవి, మహేశ్‌బాబుగార్లను డైరెక్ట్ చేసిన మురుగదాస్‌గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మా నిర్మాత తిరుపతి ప్రసాద్‌గారు మంచి కంటెంట్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. నిర్మాతగా ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం.. అందుకే తెలుగులో తరచుగా వెయ్యికోట్ల కలెక్షన్స్ రాబడుతున్న చిత్రాలు వస్తున్నాయి’’ అని చెప్పారు.
(చదవండి: ఐఐటీ సీటు వదులుకున్న హీరోయిన్.. ఇప్పుడు ఏకంగా ఐటీ కంపెనీ సీఈఓ)
‘‘మా సినిమా ఆరంభంలో రుక్మిణి అప్‌కమింగ్ హీరోయిన్ . కానీ, ఇప్పుడు ఎన్టీఆర్– ప్రశాంత్‌నీల్ సినిమా, యశ్ ‘టాక్సిక్’, రిషబ్ శెట్టి ‘కాంతార’ ప్రీక్వెల్ వంటి చిత్రాలు చేస్తున్నారు’’ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ‘‘మదరాసి’ నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు రుక్మిణీ వసంత్.