విజయ్‌కి జోడీగా 'యానిమల్‌' బ్యూటీ | Sakshi
Sakshi News home page

విజయ్‌కి జోడీగా 'యానిమల్‌' బ్యూటీ

Published Sun, Jan 21 2024 3:45 AM

Animal Beauty Tripti Dimri in Talks for Vijay Deverakonda Film: tollywood - Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌ ‘యానిమల్‌’ చిత్రంలోని జోయా పాత్రతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు హీరోయిన్‌ త్రిప్తి దిమ్రి. ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైందని ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు.

కాగా ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు ముందు శ్రీలీలను తీసుకున్నారు. కొన్ని కారణాలతో శ్రీలీల ఈప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో, ఈ స్థానంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తారనే టాక్‌ వినిపించింది. తాజాగా త్రిప్తి దిమ్రి, రుక్మిణీ వసంత్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి.. ఈ ఇద్దర్లో ఎవరు విజయ్‌ దేవరకొండతో జోడీ కడతారు? లేక మరో హీరోయిన్‌ ఎవరైనా ఈ అవకాశాన్ని దక్కించుకుంటారా? అనేది చూడాలి. ఈ సినిమా షూటింగ్‌ను మార్చిలోప్రారంభించాలనుకుంటున్నారు. సో.. రెండు నెలల్లో కథానాయిక విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.

Advertisement
 
Advertisement