సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ఆ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Sakshi
Sakshi News home page

SSE-SideB OTT Release: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన సైడ్‌-బి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Thu, Jan 25 2024 9:52 PM

Sapta Saagaradaache Ello Side B Streaming On This Ott Platform - Sakshi

కన్నడ స్టార్ రక్షిత్‌ శెట్టి, రుక్మిణీ వసంత్‌ జంటగా నటించిన ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి - సైడ్‌ ఎ’. హేమంత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ సూపర్‌ హిట్ రావడంతో సీక్వెల్‌గా సప్త సాగరాలు దాటి - సైడ్‌ బి తెరకెక్కించారు. గతేడాది నవంబర్ 17న రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై రక్షిత్‌ శెట్టి తాజాగా ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

కథేంటంటే..?
డబ్బుకి ఆశపడి జైలుకి వెళ్ళిన మను(రక్షిత్ శెట్టి) పదేళ్ల తర్వాత బయటకు రావడంతో స్టోరీ మొదలవుతుంది. తన ప్రేయసి ప్రియ(రుక్మిణి వసంత్)కి అప్పటికే పెళ్ళి అయిపోయి ఉంటుంది. దీంతో ఆమెని మర్చిపోలేక మను సతమతం అవుతుంటాడు. ప్రియని దూరం నుంచి ఫాలో అవుతూ.. ఆమె కొడుకు, భర్తతో.. తన గురించి ఏం చెప్పకుండా స్నేహం చేస్తాడు. అన్ని విధాలా ఆమెకి సహాయం చేస్తాడు. మరి చివరకు ప్రియని మను కలిశాడా? ఈ స్టోరీలో సురభి(చైత్ర జే ఆచార్) ఎవరు? తను జైలుకి వెళ్ళడానికి కారణమైన వాళ్లపై మను పగ తీర్చుకున్నాడా? అనేది స్టోరీ.

Advertisement
 
Advertisement
 
Advertisement