మణిరత్నం తన కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారన్నది ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా కమలహాసన్, శింబు, త్రిష మల్టీస్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించిన థగ్‌లైఫ్ చిత్రాన్ని తెరకెక్కించిన మణిరత్నం అనుకున్నంత రేంజ్‌లో విజయాన్ని అందుకోలేదు. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న మణిరత్నం తాజాగా ఒక ప్రేమ కథను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేకాదు ఇందులో నటుడు దృవ్ విక్రమ్ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ కాంబినేషన్‌కు బ్రేక్ పడింది.
దీంతో శింబుతో తెరకెక్కబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు కథను కూడా వినిపించినట్లు ప్రచారం వైరల్ అవుతోంది. అయితే శింబు ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో నటిస్తున్న అరసన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉండడంతో ఆయనకు బదులుగా నటుడు విజయ్‌సేతుపతి ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌సేతుపతి ఇంతకు ముందు నవాబ్ అనే చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. తాజాగా రెండోసారి మణిరత్నం, విజయ్‌సేతుపతి కాంబో రిపీట్ కానుందన్నమాట.

ఇకపోతే ఇందులో ప్రస్తుతం పుల్ ఫామ్‌లో ఉన్న నటి రుక్మిణి వసంత్‌ను నాయకిగా ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా రుక్మిణి వసంత్ కోలీవుడ్‌కు పరిచయమైంది విజయ్‌సేతుపతి హీరోగా నటించిన ఏస్ ద్వారా అన్నది గమనార్హం. దీంతో ఈ కాంబో మరోసారి రిపీట్ కానుందన్నమాట. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా విజయ్‌సేతుపతి ప్రస్తుతం బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించడంతోపాటు, తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.


