రుక్మిణి వసంత్‌కి మరో సూపర్ ఛాన్స్! | Rukmini Vasanth Acts Dhanush New Movie | Sakshi
Sakshi News home page

Rukmini Vasanth: తమిళ స్టార్ హీరో ధనుష్‌కి జోడీగా రుక్మిణి!

Apr 15 2026 7:57 AM | Updated on Apr 15 2026 8:41 AM

Rukmini Vasanth Acts Dhanush New Movie

కన్నడ భామ రుక్మిణి వసంత్‌కి తమిళంలో అవకాశాలు క్యూ కడుతున్నాయి. నటుడు విజయ్ సేతుపతికి జంటగా 'ఏస్' మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకు ఇది హిట్ అవ్వకపోయినా ఛాన్సులు వరిస్తున్నాయి. శివకార్తీకేయన్‌కి జంటగా గతేడాది 'మదరాసి' చిత్రంలో నటించింది. ఇది కూడా జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత సొంత భాషలో చేసిన 'కాంతార' ప్రీక్వెల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ధనుష్‌కు జంటగా నటించే అవకాశం వరించిందని సమాచారం.

ధనుష్ ప్రస్తుతం విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో చేసిన 'కర' మూవీ విడుదలకు సిద్ధమైంది. దీని తర్వాత 'అమరన్' ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో నటిస్తాడు. ఇది ధనుష్ 55వ చిత్రం. దీని తర్వాత మారి సెల్వరాజ్ దర్శకత్వంలో చేయనున్నాడు. 'లబ్బర్ పందు' ఫేమ్ తమిళరస పద్యముత్తు దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి కమిట్ అయ్యాడ. ఇందులోనే ఈయనకు జంటగా రుక్మిణి వసంత్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమచారం.

రుక్మిణి.. కన్నడ, తమిళంతో పాటు తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌కు జంటగా 'డ్రాగన్' చేస్తున్నారు. కన్నడంలో చేసిన 'టాక్సిక్' చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఇకపోతే ధనుష్ తో నటి రుక్మిణి తొలిసారిగా జోడీ కట్టబోతోందన్న మాట. ఇందులో విజయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించనున్నారనీ టాక్. త్వరలోనే ఈ విషయాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

Advertisement
 
Advertisement
Advertisement