ఈ చిన్నారిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్.. ఎవరో తెలుసా? | The Star Actress Shares Her Chilldhood Pic with Her Mother goes viral | Sakshi
Sakshi News home page

Star Actress: ఈ ఫోటోలోని చిన్నారి ఎన్టీఆర్‌ మూవీలో హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

May 10 2026 2:42 PM | Updated on May 10 2026 4:07 PM

The Star Actress Shares Her Chilldhood Pic with Her Mother goes viral

చిన్నప్పటి జ్ఞాపకాలే మన జీవితంలో వెలకట్టలేనివి. అలాంటి మధుర జ్ఞాపకాలు ఒక్కటున్నా సరే చూసుకుని తరించిపోతాం. మన చిన్నప్పటి ఫోటోలను చూస్తే అసలు నేనేనా అక్కడ అన్నంతలా ఫీలైపోతాం. మన జీవితంలో ఎప్పుడైనా బాల్యం నాటి ఫోటోలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే షేర్ చేసేస్తుంటాం. తాజాగా స్టార్ హీరోయిన్ ఇవాళ తన చిన్నప్పటి క్యూట్ పిక్‌ను షేర్ చేసింది. మాతృ దినోత్సవం సందర్భంగా అరుదైన ఫోటోలు పంచుకుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ చూసేద్దాం పదండి.

గతేడాది రిలీజైన కాంతార మూవీతో ఒక్కసారిగా అందిరినీ తనవైపు తిప్పుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. తన అందం, నటనతో కాంతార చిత్రంలో అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఏడాది యశ్ హీరోగా వస్తోన్న టాక్సిక్‌లో కనిపించనుంది. అంతేకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన డ్రాగన్‌లో కనిపించనుంది. ఇవాళ మదర్స్ డే కావడంతో అమ్మతో ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement