ఈ ఫోన్‌ నంబర్‌ నాది కాదు: రుక్మిణి వసంత్‌ | Rukmini Vasanth Clarified To Cyber Phone Calls With Her use Name | Sakshi
Sakshi News home page

ఈ ఫోన్‌ నంబర్‌ నాది కాదు: రుక్మిణి వసంత్‌

Nov 8 2025 8:25 AM | Updated on Nov 8 2025 9:18 AM

Rukmini Vasanth Clarified To Cyber Phone Calls With Her use Name

కాంతార చాప్టర్‌-1 విడుదల తర్వాత రుక్మిణి వసంత్‌ పేరు పాన్‌ ఇండియా రేంజ్‌లో పాపులర్‌  అయిపోయింది. దీంతో కొందురు కేటుగాళ్ళు తన పేరు చెప్పుకుని మోసాలు చేసేందుకు రెడీ అయిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) తాజాగా తన సోషల్‌మీడియా ఖాతాలో ఒక పోస్ట్‌ షేర్‌ చేసింది. తన పేరు మీద జరుగుతున్న మోసాల గురించి ఆమె పేర్కొంది.

నా పేరు చెబుతూ ఒక వ్యక్తి 9445893273 ఈ నంబర్‌తో వివిధ వ్యక్తులకు కాల్స్‌ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నాలాగే మాట్లాడుతూ ఇతరులను సంప్రదించి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెంబర్ నాది కాదు. ఈ విషయాన్ని అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ నంబర్‌ నుంచి వచ్చే  మెసేజ్‌లు, కాల్స్‌ పూర్తిగా నకిలీవని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. దయచేసి అలాంటి కాల్స్‌కు ఎవరూ స్పందించకండి. ఇలా ఒకరి పేరును ఉపయోగించుకుని మోసాలకు పాల్పడటం సైబర్ నేరం అవుతుందని గుర్తుచేస్తున్నాను. ఈ నెంబర్ నుంచి ఎవరికైనా ఫోన్  వస్తే.. డైరెక్ట్‌గా నన్ను లేదా నా టీమ్‌ను సంప్రదించండి. ఇలాంటి మోసపూరిత, తప్పుదారి పట్టించే కార్యకలాపాలలో పాల్గొన్న వారి పట్ల తప్పనిసరిగా  చర్యలు ఉంటాయి. ఆన్‌లైన్‌లో ఇలాంటి వారితో ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. 'అని ఆమె పేర్కొన్నారు.

కాంతార చాప్టర్ 1 విజయం తర్వాత రుక్మిణి వసంత్‌ చేతిలో భారీగా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం  ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో ఆమె బిజీగా ఉంది. ఈ సినిమాతో పాటు మణిరత్నం- విజయ్ సేతుపతి ప్రాజెక్ట్‌ చేయబోతుంది. కన్నడ హీరో యశ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రంలో కూడా రుక్మిణి నటిస్తుంది. ఈ మూవీని గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement