కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రేమలో ఉన్నట్లు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ఈమేరకు పలు వెబ్‌సైట్లు కూడా నిజమేనంటూ పలు ఫోటోలను షేర్ చేస్తున్నాయి. అయితే, ఇందులో ఎంతమాత్రం నిజమనేది తెలియాలంటే ఈ బ్యూటీ వివరణ ఇస్తే తేలుతుంది. నెట్టింట ఇలాంటి వార్తలు సహజంగానే కనిపిస్తూ ఉంటాయి. అయితే, ఫైనల్‌గా వాటిలో కొన్ని నిజం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే రుక్మిణి వసంత్ లవ్ ట్రాక్ గురించి ట్రెండ్ అవుతుంది.
కాంతార సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కు రుక్మిణి చేరుకుంది. దీంతో యశ్ భారీ బడ్జెట్ మూవీ టాక్సిక్‌లో కూడా ఆమె భాగమైంది. ఆపై ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీతో పాటు పలు ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో రుక్మిణి తన ప్రాణ స్నేహితుడు సిద్ధాంత్‌తో డేటింగ్ చేస్తోందని సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. అతనొక పాపులర్ ఫోటోగ్రాఫర్ అని కూడా ప్రచారంలో ఉంది. వారిద్దరి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
కానీ, ఈ అంశం గురించి వారిలో ఎవరూ స్పందించలేదు. సోషల్ మీడియాలో ధృవీకరించని ఇలాంటి పుకార్లు వైరల్ అవుతూనే ఉంటాయి. చాలా సార్లు, అవి నిజమవుతున్నాయి. కొన్నిసార్లు, అవి అబద్ధాలుగా మిగిలిపోవచ్చు కూడా.. ప్రస్తుతానికి, కొనసాగుతున్న ఈ రూమర్ నిజమో కాదో స్పష్టత లేదు.


