స్టార్‌ హీరోయిన్‌ను అన్‌ఫాలో చేసిన రిష‌బ్ శెట్టి | Kannada Star Rishab Shetty Unfollows Rukmini Vasanth In Instagram Account Amid Rumours Of Rift | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరోయిన్‌ను అన్‌ఫాలో చేసిన రిష‌బ్ శెట్టి

Mar 28 2026 10:14 AM | Updated on Mar 28 2026 12:13 PM

Rishab Shetty Unfollow rukmini vasanth in instagram account

కాంతార సినిమాతో కన్నడ హీరో రిష‌బ్ శెట్టికి గుర్తింపు దక్కింది. అయితే, ఈ చిత్రాన్ని నిర్మించిన హోంబ‌లే ఫిలిమ్స్‌తో బంధం తెంచుకున్నారని వార్తలు వచ్చాయి. సోషల్‌మీడియా చిత్ర నిర్మాణ సంస్థ అధికార ఖాతాను అన్‌ఫాలో చేయడంతో ఈ వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే, తాజాగా తనతో పాటు నటించిన  వారిని కూడా తన ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడం కన్నడ పరిశ్రమలో వైరల్‌ అవుతుంది.

కాంతార మూవీలో తనతో పాటు నటించిన రుక్మిణి వసంత్‌ను కూడా రి‌ష‌బ్ శెట్టి అన్‌ఫాలో చేశారు. ఆపై త‌న‌ ఆప్త మిత్రుడైన రాజ్.బి.శెట్టిల‌ను కూడా సోష‌ల్ మీడియాలో ఫాల్‌ కావడం ఆపేశాడు. రెండురోజుల క్రితం హోంబలే ఫిల్మ్స్‌ ఖాతాను అన్‌ ఫాలో చేసిన రిషబ్‌.. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేయడంతో కాంతార టీమ్‌తో ఏమైనా గొడవలు ఉన్నాయా అనే అనుమానం మొదలైంది.  అయితే, హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్‌ను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. 

అయితే, రోజుల వ్య‌వ‌ధిలోనే ఇలా మూడు ముఖ్య‌మైన‌ అకౌంట్ల‌ను రిష‌బ్ అన్ ఫాలో చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశం గురించి రిషబ్ శెట్టితో పాటు నిర్మాణసంస్థ నుంచి ఎలాంటి  వివరణ రాలేదు. ప్రస్తుతం  రిషబ్ తన తదుపరి మూవీ జై హనుమాన్ పనిలో ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో  హనుమంతుడి పాత్రలో రిషబ్‌ కనిపించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement