
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల జాబితాలో ఈ మూవీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం మొదటి వారంలోనే రూ. 509 కోట్లు రాబట్టినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. కేవలం ఒక వారంలోనే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం.
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 509 కోట్లు రాబట్టడంతో అభిమానులో పోస్టులు పెడుతున్నారు. రీసెంట్‌గా విడుదలైన రజనీకాంత్ కూలీ సినిమా జీవితకాల కలెక్షన్స్‌ను కూడా కాంతార చాప్టర్1 అధిగమించింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రలు పోషించారు. 2022లో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీనికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాలలో రోండో స్థానంలో కాంతార చాప్టర్ 1 ఉంది. అయితే, మొదటి స్థానంలో యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 (రూ. 1,215 కోట్లు) ఉంది. కానీ, కేజీఎఫ్ రికార్డ్‌ను కాంతార చేరుకోవడం అంత సులువైన విషయం కాదని చెప్పవచ్చు. సుమారు రూ. 800 కోట్ల ఫైనల్ కలెక్షన్స్‌తో ఈ మూవీ సత్తా చాటే ఛాన్స్ ఉంది. అయితే, కన్నడలో అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన టాప్ ఫైవ్ చిత్రాలు ఇలా ఉన్నాయి. మొదటి స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 2 (రూ. 1,215 కోట్లు), కాంతార చాప్టర్-1 (రూ. 509 కోట్లు), కాంతార (రూ. 450 కోట్లు), కేజీఎఫ్ చాప్టర్-1 (రూ. 250 కోట్లు), విక్రాంత్ రోణా (రూ. 210 కోట్లు) వరుసగా ఉన్నాయి.