'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరో నేనే.. ఎందుకు వదిలేశానంటే? | Sumanth Prabhas Reacts Missed Raju Weds Rambai Movie | Sakshi
Sakshi News home page

Sumanth Prabhas: బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పా.. నేను కరెక్ట్ కాదేమోనని

May 5 2026 10:53 AM | Updated on May 5 2026 11:22 AM

Sumanth Prabhas Reacts Missed Raju Weds Rambai Movie

చిన్న సినిమాలు అప్పుడప్పుడు సూపర్ హిట్ అయిపోతుంటాయి. మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటాయి. అలా గతేడాది వచ్చిన వాటిలో 'రాజు వెడ్స్ రాంబాయి' ఒకటి. తెలంగాణలో జరిగిన ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా తీసిన ఈ చిత్రంతో సాయిలు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలో మెప్పించాడు. ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన అఖిల్ రాజ్, తేజస్వి కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే ఈ మూవీలో తానే హీరోగా చేయాలని, కానీ కొన్ని కారణాల వల్ల వదిలేశానని 'మేమ్ ఫేమస్' సుమంత్ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

'రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో నేనే చేయాలి. సుమంత్.. ఇది నువ్వే చేస్తే బాగుంటుంది అని సాయిలు(దర్శకుడు) అన్న చెప్పాడు. నేను కథ విన్నా. స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత.. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని అన్నతో చెప్పా. పదిమంది మాట్లాడుకునే సినిమా ఇది అని చెప్పాను. అప్పుడే ప్యూర్ పల్లెటూరి తెలంగాణ కథ చేశా. మళ్లీ తెలంగాణ కథ చేశానంటే.. అయ్యో నేను ఇటు వెళ్లిపోతానేమో అనిపించింది. ఆ సినిమా నేను చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది కానీ సినిమా అయితే తప్పకుండా రావాలన్నా. మీది 100 శాతం వర్కౌట్ అవుతుందని ఎప్పుడు అంటుండేవాడిని. చెప్పాలంటే నాకు నెరేట్ చేసిన దానికంటే చాలా అద్భుతంగా తీశాడు. ఫస్టాప్ అయితే ఇంకా బ్యూటిఫుల్‌గా తీశాడు. నేను అనుకున్న దానికంటే చాలా బాగా ప్రెజెంట్ చేశాడు'

యూట్యూబ్‌లో ఆల్బమ్ సాంగ్స్‌తో నటుడిగా మారిన సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో దర్శకుడు, నటుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత 'గోదారి గట్టుపైన' మూవీ చేశాడు. ఇది ఈ శుక్రవారం(మే 08) ప్రేక్షకుల ముందుకు రానుంది. పేరుకి తగ్గట్లే గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు. దీని ప్రమోషన్లలో భాగంగానే సుమంత్ ప్రభాస్.. 'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరో అవకాశం వదులుకున్న సంగతి బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్‌కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి)

Advertisement
 
Advertisement
Advertisement