ప్రభాస్ 'ఫౌజీ' సినిమా షూటింగ్ కోసం వెళ్తున్న ప్రొడక్షన్ యూనియన్ సభ్యుల కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపుర్‌మెట్ దగ్గర డివైడర్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1940ల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్. ఈ ఏడాది దసరాకు థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ చేస్తున్నారు. ఇంతలోనే ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం.
(ఇదీ చదవండి: విజయ్ విజయం.. పవన్ కల్యాణ్‌కు కొత్త చిక్కులు..!)



