అందుకే సుమంత్‌ ప్రభాస్‌ అని పేరు పెట్టుకున్నా : ‘మేమ్‌ ఫేమస్‌’ హీరో

Sumanth Prabhas Talk About Mem Famous Movie - Sakshi

‘‘తప్పు, ఒప్పు.. ఇలా ఏం చేసినా ఊర్లో ఫోకస్, ఫేమస్‌ కావాలనే ఆలోచన ఉన్న యువకుల కథే ‘మేమ్‌ ఫేమస్‌’. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేసే యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది’’ అని సుమంత్‌ ప్రభాస్‌ అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. అనురాగ్‌ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది.

(చదవండి: నేను బయటికి వచ్చానంటే కారణం నరేశ్‌: పవిత్రా లోకేష్‌ )

ఈ సందర్భంగా సుమంత్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ– ‘‘నా పేరు సుమంత్‌ రెడ్డి. ప్రభాస్‌గారికి ఫ్యాన్‌ని. అందుకే సుమంత్‌ ప్రభాస్‌ అని పెట్టుకున్నాను. డిగ్రీ పాసయ్యాక ఎస్‌ఐ ఉద్యోగానికి ప్రిపేర్‌ కావాలనుకున్నాను. డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజీలో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీశాం.. అది నచ్చడంతో ఒక ఫిల్మ్‌ స్కూల్‌ వాళ్లు మాకు కంటెంట్‌ క్రియేట్‌ చేయమని కెమెరాలు స్పాన్సర్‌ చేయడంతో ‘పిల్ల పిల్లగాడు’ అనే వెబ్‌ సిరీస్‌ చేశాం.

అది నచ్చడంతో అనురాగ్, శరత్‌ అన్న పిలిచి, వెబ్‌ సిరీస్‌ చేద్దామన్నారు. నేను సినిమా చేద్దామన్నాను. కథ రెడీ చేయమన్నారు. ఆ తర్వాత ‘మేమ్‌ ఫేమస్‌’ కథని వారికి చెప్పాను.. నచ్చడంతో నన్నే డైరెక్షన్‌ చేయమన్నారు. లీడ్‌ రోల్‌కి తగ్గ యువకుడు కుదరకపోవడంతో నేనే నటించాను. నా తర్వాతి సినిమా కూడా చాయ్‌ బిస్కెట్‌ బ్యానర్‌లోనే ఉంటుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top