-
నచ్చినావురో ఫోక్ సాంగ్‌తో ఫేమస్.. అలా హీరోయిన్గా..
సోషల్ మీడియా వేదికగా ప్రతిభావంతులైన అమ్మాయిలు ఎంతోమంది పాపులర్ అవుతున్నారు. ఆ పాపులారిటీతో సినీ అవకాశాలనూ అందుకుని రంగుల ప్రపంచంలోనూ రాణిస్తున్నారు. ఆ జాబితాలో సార్య కూడా చేరుతుంది. సార్య స్వస్థలం గుంటూరులోని పల్నాడు. కానీ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఢిల్లీ యూనివర్సిటిలో డిగ్రీ చేసింది. ► కరోనా కాలంలో చాలామందిలాగే.. ఖాళీగా కూర్చోవటం ఇష్టం లేక కాలక్షేపం కోసం సోషల్ మీడియాలో హనీ సార్యగా రీల్స్ చేసేది. ఆ వీడియోలే ఆమెకు యూట్యూబ్ కవర్ సాంగ్స్‌లో నటించే అవకాశాలను తెచ్చిపెట్టాయి. ► అలా పలు ఫోక్, కవర్ సాంగ్స్‌తో పాటు, షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించింది సార్య. ► యూట్యూబ్‌లో ‘నచ్చినావురో’ ఫోక్ సాంగ్‌తో పాపులరై యూత్‌లో మంచి క్రేజ్ సాధించింది. అందులోని సార్య క్యూట్ హావభావాలకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. దీంతో తను చేసే ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోలకు లైకుల వర్షం కురవడం మొదలైంది. ► ఆ ఫేమ్తోనే సిల్వర్ స్క్రీన్ అవకాశాన్ని అందుకుంది. తొలిసారి ‘మేమ్ ఫేమస్’ సినిమాతో హీరోయిన్గా వెండితెరపై మెరిసింది సార్య. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోది. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఆయన సినిమాలో ఏ చిన్న రోల్ ఇచ్చినా చేస్తా. ఎప్పటికైనా ఆయనతో కలసి నటించాలన్నదే నా లక్ష్యం! – సార్య View this post on Instagram A post shared by Saarya Laxman (@saarya_laxman) చదవండి: ధ్రువనక్షత్రం సినిమాలో ఐశ్వర్య రాజేశ్ సీన్స్ కట్ -
ఓటీటీలోకి వచ్చేసిన మేమ్ ఫేమస్ సినిమా, ఎక్కడంటే?
షార్ట్ ఫిలింస్‌తో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం మేమ్ ఫేమస్. ఊర్లో బలాదూర్‌గా తిరిగే ముగ్గురి యువకులు ఎలా ఫేమస్ అయ్యారనేదే కథ. కామెడీ పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. మే 26న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ నెల రోజుల తర్వాత నేటి(జూన్ 30) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.. మేమ్ ఫేమస్ విషయానికి వస్తే.. 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత చాయ్ బిస్కెట్ అధినేతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర.. లహరి ఫిల్మ్స్ చంద్రు మనోహర్ నిర్మాణ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్యామ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. కథేంటంటే.. బండనర్సంపల్లి గ్రామానికి చెందిన మహేశ్ అలియాస్ ముగ్గురు కుర్రాళ్లు ప్రాణ స్నేహితులు. వీరు ఊర్లో అల్లరిచిల్లరగా తిరుగుతూ అందరితో తిట్లు తిట్టించుకుంటారు. ఈ ముగ్గురికీ చెరో లవ్‌స్టోరీ ఉంది. అయితే గ్రామంలో జరిగిన ఓ సంఘటన వల్ల తాము కూడా పని చేసి శభాష్ అనిపించుకోవాలనుకుంటారు. అందుకోసం ఓ టెంట్‌హౌస్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత వీళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి? ఫేమస్ యూట్యూబ్ చానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ చానల్ ద్వారా ఊరికి ఎలాంటి మేలు జరిగింది? ఆవారాగా తిరిగే ఆ ముగ్గురు ఎలా ఫేమస్ అయ్యారు? అనేదే మిగతా కథ. View this post on Instagram A post shared by Lahari Music (@laharimusic) చదవండి: ఇంట్లో జరిగిన పెళ్లికి భార్యాపిల్లలు డుమ్మా.. చేతులు జోడించి క్షమాపణలు కోరిన నటుడు! -
‘మేమ్ ఫేమస్' నటుడిగా మంచి గుర్తింపుని ఇచ్చింది: కిరణ్ మచ్చ
సోషల్ మీడియాలో పాపులర్ అయిన కిరణ్ మచ్చ ఈ మధ్యనే మేం ఫేమస్ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో అల్లరి చిల్లరగా తిరిగే ముగ్గురు కుర్ర కారుకి అండగా నిలుస్తూ మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని వారికి వెన్నుతట్టే ఆ ఊరి సర్పంచ్ వేణు జింక అనే పాత్రలో నటించి అందరిని మెప్పించాడు. ఊరంతా ఆ కుర్రాళ్ళకి యాంటీ అయినా సరే వేణు మాత్రం వారి వెంట నిలబడి వారికి అండగా నిలబడటం ఆసక్తికరంగా ఉంటుంది. అలా సర్పంచ్ పాత్రలో కిరణ్ మచ్చ అద్భుతంగా నటించి అందరి దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అథర్వ, శ్రీరంగనీతులు, ఇంకా టైటిల్స్ ఖరారు కానీ మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకప్పుడు యూట్యూబర్‌గా ఫేమస్ అయిన కిరణ్ మచ్చ.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద వరుస ఆఫర్లు సంపాదించుకుంటున్నాడు. ‘‘మేమ్ ఫేమస్' నటుడిగా నాకు మంచి గుర్తింపును ఇచ్చింది. ఆ సినిమా కారణంగానే ఇప్పుడు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అన్ని రకాల పాత్రలు పోషించి నటుడిగా మంచి పేరు సంపాదించుకోవాలనేదే నా కోరిక’ అని కిరణ్ మచ్చ అంటున్నాడు. -
చాలా రోజుల తర్వాత అలాంటి చిత్రాన్ని చూశా: రాజమౌళి ప్రశంసలు
సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రల్లో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 26న విడుదల విడుదల కాగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రంపై దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. చాలా కాలం తర్వాత పూర్తిస్థాయిలో ఓ వినోదాత్మక చిత్రాన్ని చూశానంటూ ప్రశంసించారు. (ఇది చదవండి: విజయ్ దేవరకొండ స్టైల్లో 'మేమ్ ఫేమస్' రిలీజ్ డేట్) రాజమౌళి ట్వీట్ రాస్తూ..'చాలా కాలం తర్వాత థియేటర్లో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాన్ని చూశా. దర్శకుడు, నటుడు సుమంత్ కు మంచి భవిష్యత్ ఉంది. మేమ్ ఫేమస్‌లో నటించిన వారంతా ఎంతో సహజంగా నటించారు. ముఖ్యంగా అంజిమామ అదరగొట్టేశాడు. ఈ మూవీ చూడాల్సిందిగా ప్రతి ఒక్కరికీ రెకమెండ్ చేస్తున్నా. యూత్‌ను ఎంకరేజ్ చేయాలి.. దమ్ దమ్ చేయొద్దు' అని పోస్ట్ చేశారు. (ఇది చదవండి: Mem Famous Review: ‘మేమ్ ఫేమస్’ మూవీ రివ్యూ) After a long time thoroughly enjoyed a film in the theatre. Watch out for this guy Sumanth. He has a bright future both as an actor and director. All the characters were nicely etched and actors performed naturally. Especially Anji mama. Highly recommend it to everyone. Youth… — rajamouli ss (@ssrajamouli) May 29, 2023 -
ఈ వారం రిలీజైన సినిమాలు ఎలా ఉన్నాయంటే..
మళ్లీ పెళ్లి వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరేశ్ నిజజీవితంలోకి పవిత్రా లోకేష్ వచ్చాక జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎమ్మెస్ రాజు. ఈ విషయాన్ని ప్రమోషన్స్‌లో ఎక్కడా చెప్పకపోయినా.. సినిమా చూస్తే అందరికి అర్థమైపోతుంది. మరి సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 2018 కేరళ రాష్ట్రంలో 2018 వ సంవత్సరంలో సంభవించిన ప్రకృతి విపత్తు ( వరదలు ) వల్ల కేరళ రాష్ట్రము మొత్తం అతలా కుతలం అయ్యిందన్న విషయం తెలిసిందే . ఈ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మలయాళ చిత్రం 2018. మే 5న అక్కడ విడుదలైన ఈ చిత్రానికి కేరళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మలయాళంలో అఖండ విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు లో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు విడుదల చేశారు. మరి ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మేమ్ ఫేమస్ షార్ట్ ఫిల్మ్, మ్యూజిక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత చాయ్ బిస్కెట్ అధినేతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రమిది. లహరి ఫిల్మ్స్ చంద్రు మనోహర్ నిర్మాణ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వినూత్నమైన ప్రచారంతో ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరోలందరూ ఈ సినిమా ప్రచారంలో పాలుపంచుకున్నారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) గ్రే మూవీ ఈ మధ్యకాలంలో విడుదలకు ముందే సినిమాలను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి పంపిస్తున్నారు. అలా వెళ్లి 2022 నుంచి దాదాపుగా అనేక ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు అందుకున్న గ్రే సినిమా మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ది బుడాపెస్ట్ ఫిలిం ఫెస్టివల్, జైపూర్ ఫిలిం ఫెస్టివల్, ఠాగూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, సింగపూర్ వరల్డ్ ఫిలిం కార్నివాల్, యూరోపియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన గ్రే సినిమా ఎలా సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 'సత్తిగాని రెండెకరాలు' పుష్ప సినిమాలో చిత్తూరు కుర్రాడిగా నటించిన జగదీష్ ప్రతాప్ బండారికి మంచి మార్కులు పడ్డాయి. అల్లు అర్జున్ స్నేహితుడు కేశవగా కామెడీ పండించిన ఆయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే సత్తిగాని రెండెకరాలు చిత్రంతో హీరోగా మారాడు జగదీష్. పుష్ప సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్సే ఈ చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఓటీటీ వేదిక ఆహాలో రిలీజైన సత్తిగాని రెండెకరాలు సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్‌కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్‌కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement