'Mem Famous' Movie Completed Its Censor, Gets U/A Certificate - Sakshi
Sakshi News home page

Mem Famous: ‘మేమ్‌ ఫేమస్‌’పై సెన్సార్‌ ప్రశంసలు!

Published Mon, May 22 2023 11:54 AM | Last Updated on Mon, May 22 2023 12:28 PM

Mem Famous Movie Censor Completed - Sakshi

కొన్ని సినిమాలు విడుదలకు ముందే పాజిటివ్‌ బజ్‌ని క్రియేట్‌ చేసుకుంటాయి. అలాంటి వాటిలో ‘మేమ్‌ ఫేమస్‌’ చిత్రం ఒకటి.  సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. శరత్‌, అనురాగ్‌ రెడ్డి, చంద్రు మనోహరన్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కాబోతుంది. చిన్న సినిమానే అయినా..  వినూత్నమైన ప్రచారంతో భారీ హైప్‌ని క్రియేట్‌ చేసుకుంది.

(చదవండి: బ్రహ్మానందం ఇంట పెళ్లిసందడి.. ఘనంగా కొడుకు నిశ్చితార్థం)

తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ని పూర్తి చేసుకుంది. సెన్సార్‌ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ జారీ చేస్తూ ప్రశంసలు కురిపించారు. సినిమా బాగుందని కితాబు ఇచ్చారు. ‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి. ఎమోషనల్‌ సీన్స్‌ అందరిని ఆకట్టుకుంటాయి. ప్రతి ఒక్కరికి ఈ చిత్రం నచ్చుతుంది’అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement