Mahesh Babu Appreciates Mem Famous Movie Team, Tweet Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Mahesh Babu On Mem Famous Movie: ఇంతమంచి సినిమాను కొత్తవాళ్లు చేశారా? నమ్మలేకపోతున్నా

May 25 2023 4:58 PM | Updated on May 25 2023 5:35 PM

Mahesh Babu Appreciates Mem Famous Movie Team, Tweet Goes Viral - Sakshi

సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. అనురాగ్‌ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఇప్పటికే వినూత్నమైన ప్రచారంతో ఈ సినిమాకు భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. టాలీవుడ్‌ యంగ్‌ హీరోలందరూ ఈ సినిమా ప్రచారంలో పాలుపంచుకున్నారు.

తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించింది చిత్రబృందం. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ మహేశ్‌బాబు ట్వీట్‌ చేశాడు. 

(చదవండి: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!)

‘మేమ్‌ ఫేమస్‌ చిత్రం అద్భుతంగా ఉంది. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు వాళ్ల పాత్రకు న్యాయం చేశారు. ముఖ్యంగా సుమంత్‌ ప్రభాస్‌ తన మల్టీ టాలెంట్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. విజువల్స్‌, మ్యూజిక్‌ ఆకట్టుకున్నాయి. ఈ మంచి చిత్రాన్ని తెరకెక్కించిన వారంతా కొత్తవాళ్లు అంటే నమ్మలేకపోతున్నాను’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు.

తమ సినిమాను మహేశ్‌బాబు ప్రశంసించడం పట్ల మేమ్‌ ఫేమస్‌ టీమ్‌ సంతోషం వ్యక్తం చేసింది. చిత్ర నిర్మాతలు మహేశ్‌బాబుకు థ్యాంక్స్‌ చెబుతూ ట్వీట్‌ చేశారు. అంతేకాదు ‘థ్యాంక్యూ మహేశ్‌బాబు అంటూ ఆ ట్వీట్‌ని పోస్టర్‌పై వేసి ప్రచారం చేసుకుంటుంది. మొత్తంగా మహేశ్‌ ట్వీట్‌తో ‘మేమ్‌ ఫేమస్‌’ చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement