
హీరోయిన్ తమన్నాది డిఫరెంట్ స్టైల్. ఒకవైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే, మరోవైపు వీలు కుదిరినప్పుడల్లా ఇతర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో సూపర్బ్‌గా డ్యాన్స్ చేస్తూ, అందుకు తగ్గట్టుగా భారీ పారితోషికం అందుకుంటుంటారు. ఇప్పటికే తమన్నా పదికి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు. 2023లో వచ్చిన రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో ‘నువ్.. కావాలయ్యా..’, 2024లో శ్రద్ధా కపూర్–రాజ్‌కుమార్ రావుల ‘స్త్రీ 2’ చిత్రంలో ‘ఆజ్ కీ రాత్’ సాంగ్స్‌లో తమన్నా అదిరిపోయే స్టెప్పులు ప్రేక్షకులను అలరించాయి.
ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఈ పాటలు బాగా ఉపయోగపడ్డాయి. తాజాగా తమన్నా మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ అండ్ ఫ్యాంటసీ సినిమా ‘ది రాజా సాబ్’. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో ప్రభాస్‌తో కలిసి తమన్నా డ్యాన్స్ చేయనున్నారట. ఈ చిత్రానికి తమన్ సంగీతదర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కానుంది.