రెండోసారి జాంబియా అధ్యక్షుడిగా హిచిలెమా ప్రమాణం | Hakainde Hichilema returns as Zambia president following disputed vote | Sakshi
Sakshi News home page

రెండోసారి జాంబియా అధ్యక్షుడిగా హిచిలెమా ప్రమాణం

Sep 2 2026 4:00 AM | Updated on Sep 2 2026 4:02 AM

Hakainde Hichilema returns as Zambia president following disputed vote

source: X

జాంబియా అధ్యక్షుడిగా హకైండే హిచిలెమా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం రాజధాని లుసాకాలోని నేషనల్ హీరోస్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఆగస్టు 13న జరిగిన ఎన్నికల్లో హిచిలెమా (60 శాతం ఓట్లు) తన సమీప ప్రత్యర్ది బ్రయాన్‌ ముండుబిలేపై (38 శాతం ఓట్లు) విజయం సాధించాడు. అయితే ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ముండుబిలే ఆరోపించారు.

ముండుబిలే ప్రస్తుతం దేశద్రోహం ఆరోపణలపై జైలులో ఉన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించడంతో పాటు, ఫలితాలను కోర్టులో సవాలు చేయాలని ఆయన ప్రయత్నించారు. ఎన్నికల ఫలితాలను ప్రశ్నించిన సుమారు డజను మంది ప్రతిపక్ష నేతలను కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

కాగా, జాంబియా కోర్టులను అధికారులు గత వారం అకస్మాత్తుగా మూసివేశారు. దీనిపై అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాలను సవాలు చేసేందుకు ప్రతిపక్షానికి న్యాయపరమైన మార్గాలను అడ్డుకున్నారని విమర్శించింది.

చదవండి: ఇమ్రాన్ ఖాన్ దంపతులకు భారీ ఊరట

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement