హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆకాశం మోత్తం మేఘావృతమయ్యింది. పెద్దఎత్తున ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైంది. దీంతో వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు రాష్టంపై వాయుగుండం ప్రభావం పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు అర్థరాత్రి నుంచి అత్యంత భారీ వర్షం పడుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో మధ్యతెలంగాణకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీవ్రగాలులతో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.


