నిమ్స్‌ అధికారిపై.. అక్రమ ఆస్తుల ఆరోపణలు | Massive assets involved in the case of a NIMS officials illicit wealth | Sakshi
Sakshi News home page

నిమ్స్‌ అధికారిపై.. అక్రమ ఆస్తుల ఆరోపణలు

Sep 22 2026 5:34 PM | Updated on Sep 22 2026 5:40 PM

Massive assets involved in the case of a NIMS officials illicit wealth

సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌ అడిషనల్‌ సూపరిండెంట్ డాక్టర్‌ లక్ష్మీ భాస్కర్‌ అక్రమ ఆస్తుల సోదాలలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పోలీసుల సోదాలలో పెద్ద మెుత్తంలో  అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. లక్కీ భాస్కర్‌కు  భారీగా స్థలాలతో పాటు నియో పోలీస్‌ పరిధిలో అధికసంఖ్యలో ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ. 70 కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

కాగా నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ అడిషనల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీ భాస్కర్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దృష్టి సారించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఆయన కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఈ రోజు (మంగళవారం) ఉదయం ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. నిమ్స్‌ సహా.. మూడు జిల్లాల్లో మొత్తం 12 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద మెుత్తంలో ఆస్తులున్నట్లు గుర్తించారు.

ఇది చదవండి: నిమ్స్‌ అధికారికి ఏసీబీ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement