దసరాపై మాతో మాట్లాడరా? | Royal Family vs Congress Party | Sakshi
Sakshi News home page

దసరాపై మాతో మాట్లాడరా?

Sep 22 2026 2:12 PM | Updated on Sep 22 2026 2:18 PM

Royal Family vs Congress Party

కర్ణాటక: ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలపై రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, మైసూరు రాజ కుటుంబానికి మధ్య యుద్ధం మొదలైంది. దసరా సంబరాల గురించి ప్రభుత్వం తమకేమీ చెప్పడం లేదని రాజ వంశీకురాలు ప్రమోదాదేవి ఒడెయార్‌ ఆరోపించారు. ఆమె  సోమవారం మైసూరు ప్యాలెస్‌ రాజభవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. 

కరువు పరిస్థితుల్లో కూడా మైసూరు దసరాను ఘనంగా నిర్వహించాలని, మంచి వర్షాలు కురుస్తాయని, దేశానికి మేలు జరుగుతుందని ఆశిస్తూ దసరాను జరుపుకుందామని అన్నారు. మంగళూరుకు చెందిన కంబళ పోటీలను మైసూరు ఉత్సవాలలో ప్రత్యేకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం సంప్రదించి ఉంటే, నేను నా అభిప్రాయాన్ని తెలియజేసేదాన్ని అని ఆమె అన్నారు. 

బంగారు గిడ్డంగి చోరీ కాలేదు  
రాజ కుటుంబం బంగారు గిడ్డంగిలో చోరీ జరిగిందన్నది అబద్ధం, బంగారు గిడ్డంగి సురక్షితంగా ఉంది అని ప్రమోదాదేవి తెలిపారు. బంగారు గిడ్డంగిని నేనే స్వయంగా  మూసివేశానని, కొందరు వదంతులను వ్యాప్తి చేయడంతో తానే ఇలా చేశానని చెప్పారు. మైసూరు ప్యాలెస్‌లో ఘనంగా దసరా వేడుకలు జరుగుతాయన్నారు. అక్టోబర్‌ 5న రత్నఖచిత సింహాసన ప్రతిష్ఠాపన జరుగుతుందని వివరాలను తెలిపారు. చాముండి కొండపై భవనాలు పెరిగి ఆ కొండ ఒక పట్టణంలా మారుతోందని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement