గవర్నర్‌ను కలిసిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Meet AP Governor Abdul Nazeer Over Attack On YSRCP Leaders | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలిసిన వైఎస్‌ జగన్‌

Sep 23 2026 4:57 PM | Updated on Sep 23 2026 5:32 PM

YS Jagan Meet AP Governor Abdul Nazeer Over Attack On YSRCP Leaders

ఫైల్ ఫొటో

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ (బుధవారం) విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిశారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. డీఎస్సీ–­2025­లో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్‌ జగన్‌ కోరారు.

కాగా, డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన శాంతియుత ర్యాలీపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడిన ఘటనపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. డీఎస్సీ–2025 నియామక వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని ఆయన తేల్చి చెప్పారు.

అది యువగళం టీమ్‌ కాదని, రౌడీ దళమని మండిపడ్డారు. డీఎస్సీ స్కాంలో చంద్రబాబు, లోకేశ్‌లు అడ్డంగా దొరికిపోయారన్న వైఎస్‌ జగన్‌.. సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారంటూ ప్రశ్నించారు. స్కామ్‌లను బయట పెడుతుంటే దాడులకు దిగుతున్నారంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

LIVE : గవర్నర్ తో జగన్ భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement