emergency landing
-
ఎయిర్ ఇండియా ఎఐ 379 విమానానికి బాంబు బెదిరింపు
-
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, ఢిల్లీ: అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలో మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఎయిర్ ఇండియా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా AI-379 విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్‌లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. బెదిరింపు కాల్ అనంతరం, ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపేసి.. విమానంలో తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.BIG BREAKING NEWS 🚨 Air India flight AI 379 makes emergency landing in Thailand after bomb threat. Thailand Official said "Passengers being escorted from the plane, flight AI 379, in line with emergency plans"There were 156 passengers on the flight, and the bomb threat was… pic.twitter.com/ollnR7ltxa— Times Algebra (@TimesAlgebraIND) June 13, 2025 -
కారుపై పడ్డ హెలికాఫ్టర్.. ఉత్తరాఖండ్‌లో తప్పిన పెను ప్రమాదం
ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం తప్పింది. అత్యవసరంగా రోడ్డుపై హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ వెనుక భాగం కారుపై పడింది. హెలికాఫ్టర్లోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హెలికాఫ్టర్, కారు స్వల్పంగా ధ్వంసమయ్యాయి.కేదార్నాథ్ ధామ్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ శనివారం సాంకేతిక లోపం కారణంగా రుద్రప్రయాగ జిల్లాలోని గుప్త్ కాశిలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని.. అదృష్టవశాత్తూ, విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఏడీజీ వి.మురుగేషన్ తెలిపారు.క్రెస్టెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నడిపే హెలికాప్టర్ సిర్సి నుండి కేదార్నాథ్ వైపు ప్రయాణీకులతో వెళ్తుండగా.. సాంకేతిక సమస్య ఏర్పడటంతో ముందుగానే అప్రమత్తమైన పైలట్.. హెలిప్యాడ్‌కు చేరుకోకుండా.. సమీపంలోని రహదారిపై ల్యాండ్ చేశారు.#WATCH | Uttarakhand | A private helicopter en route to Kedarnath Dham made an emergency landing in Guptkashi of Rudraprayag district due to a technical fault. All the people on board the helicopter are safe: Uttarakhand ADG Law and Order Dr V MurugeshanCEO of UCADA has… pic.twitter.com/Zj1SLluZ7N— ANI (@ANI) June 7, 2025ఎవరికి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేదార్‌నాథ్‌కు షటిల్ కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నాయని.. ఆ ప్రాంతంలోని ఇతర హెలికాప్టర్ సేవలకు ఎటువంటి అంతరాయం లేదని అధికారులు వెల్లడించారు. -
మేము చనిపోయామని అనుకున్నాం.. ఇండిగో బాధితుల ఆవేదన
శ్రీనగర్: దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. ఢిల్లీ నుంచి ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని తీవ్ర కుదుపులకు గురైంది. వడగండ్ల కారణంగా విమానం ముందుభాగం దెబ్బతిని పెద్ద రంధ్రమే ఏర్పడింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై హాహాకారాలు చేశారు. ఇదే విమానంలో ప్రయాణించిన తృణముల్ కాంగ్రెస్ నేతలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఐదుగురు సభ్యుల తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం డెరెక్ ఓ'బ్రియన్, నదిముల్ హక్, సాగరికా ఘోష్, మనస్ భూనియా, మమతా ఠాకూర్‌తో కూడిన బృందం బుధవారం శ్రీనగర్‌కు వెళ్తున్న 6E2142 విమానంలో ప్రయాణించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత సాగరిక ఘోష్ మాట్లాడుతూ.. విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో మేమంతా ఇక చనిపోయామని అనుకున్నాం. చావు దగ్గర వరకు వెళ్లి వచ్చినట్టుగా ఉంది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు.I had a narrow escape while flying from Delhi to Srinagar. Flight number #6E2142. Hats off to the captain for the safe landing.@IndiGo6E pic.twitter.com/tNEKwGOT4q— Sheikh Samiullah (@_iamsamiullah) May 21, 2025విమానంలో ఉన్న వారంతా భయంతో కేకలు వేస్తున్నారు. కొందరు ప్రార్థనలు చేశారు. మమ్మల్ని సురక్షితంగా తీసుకువచ్చిన పైలట్‌కు కృతజ్ఞతలు. విమానం దిగిపోయిన తర్వాత మేమంతా విమానం దెబ్బతిన్న భాగాన్ని చూసి ఖంగుతిన్నాం’ అని చెప్పుకొచ్చారు. భారత్, పాక్ మధ్య దాడుల వల్ల సరిహద్దుల్లో ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వీరంతా శ్రీనగర్ వెళ్లినట్టు తెలిపారు. టీఎంసీ ప్రతినిధి బృందం మే 23 వరకు జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. శ్రీనగర్‌తో పాటు పూంచ్, రాజౌరిలో వీరు పర్యటించనున్నారు.Delhi–Srinagar IndiGo flight hit by severe turbulenceFlight 6E-2142 was caught in a terrifying hailstorm just before landing in Srinagar, forcing an emergency landing around 6:30pm. Damage to plane's nose cone, cabin luggage tumbling. #6E2142 #indigo6e pic.twitter.com/gHKFxpn7SI— Lucifer (@krishnakamal077) May 21, 2025ఇదిలా ఉండగా.. 227 మంది ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని బుధవారం తీవ్ర కుదుపులకు గురైంది. అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షిత ల్యాండింగ్‌కు చర్యలు చేపట్టారు. చివరకు సాయంత్రం 6.30గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. విమానం ముందు భాగం దెబ్బతిన్న, ప్రయాణికులు కేకలు వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాంకేతిక సమస్యలతో విమానం శ్రీనగర్‌లోనే నిలిచిపోయింది. -
మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రమాదం తప్పింది. ఉత్తమ్ హెలికాప్టర్ కోదాడలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు అత్యవసరంగా ల్యాండ్ అయినట్టు తెలిసింది.వివరాల ప్రకారం.. మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. హుజూర్నగర్ మండలం మేళ్లచెరువులో హెలికాఫ్టర్ ల్యాండ్ కావాల్సి ఉండగా.. వాతావరణశాఖ అధికారుల సూచన మేరకు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపథ్యంలో పైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో, అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం, మంత్రి ఉత్తమ్ కుమార్.. కోదాడ నుంచి హుజూర్ నగర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు. -
విమానంలో వృద్దురాలు మృతి.. అత్యవసర ల్యాండింగ్
ఔరంగాబాద్: విమానంలో ప్రయాణిస్తున్న ఒక వృద్దురాలు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానాన్ని అత్యవసర పరిస్థితుల్లో లాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి ముంబై నుండి వారణాసికి బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్(Indigo Airlines) విమానంలో ఇటువంటి పరిస్థితి తలెత్తింది. విమానంలో ప్రయాణిస్తున్న వృద్దురాలు సుశీలా దేవి(89) అస్వస్థతకు గురయ్యింది. ఈమె ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందినది. కొద్దిసేపటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, విమాన సిబ్బంది వెంటనే స్పందించారు. అక్కడికి సమీపంలోని చత్రపతి సంభాజీనగర్‌లోని చికల్థానా విమానాశ్రయం(ఔరంగాబాద్ విమానాశ్రయం, మహారాష్ట్ర)లో అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించారు. దీంతో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో విమానం ల్యాండ్ అయింది.అక్కడికి చేరుకున్న వైద్య బృందం సుశీలా దేవిని పరీక్షించింది. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వారు నిర్ధారించారు. విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం ఆమె అస్వస్థతకు గురైనప్పుడు విమానం గాలిలో ఉంది. సిబ్బంది ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది. అత్యవసర ల్యాండింగ్(Emergency landing) తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు అవసరమైన చట్టపర ప్రక్రియలను పూర్తి చేశారు. అనంతరం ఆ ఇండిగో విమానం వారణాసి వైపు ప్రయాణాన్ని కొనసాగించింది.కాగా సుశీలా దేవి మృతదేహాన్ని చత్రపతి సంభాజీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే సంబంధిత అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. గత నెలలో జైపూర్ నుండి చెన్నైకి వెళుతున్న విమానానికి సంబంధించిన టైర్ పేలిన ఘటన జరిగింది. అయితే ఈ ఉదంతంలో ఎవరూ గాయపడలేదు. ఈ రెండు సంఘటనలు విమాన ప్రయాణంలో భద్రత, అత్యవసర చర్యల ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ఇది కూడా చదవండి: ‘అసమానతలను అర్థం చేసుకోండి’: బిల్‌గేట్స్ -
భారతీయుల ఆవేదన.. 30 గంటలుగా ఎయిర్‌పోర్టులోనే.. ఒకటే టాయిలెట్..
అంకారా: తుర్కియే విమానాశ్రయంలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 30 గంటలుగా 250 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే ఉన్నారు. తమకు సరైన భోజనం లేదని, టాయిలెట్ కూడా ఒకటే ఉందని ప్రయాణికుల ఆందోళన చెందుతున్నారు. మారుమూల ప్రాంతం కావడంతో అరకొరగా సౌకర్యాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. లండన్ నుండి ముంబై ప్రయాణిస్తున్న విమానం తుర్కియేలో అత్యవసరంగా ల్యాండ్ కావడంతో 250 మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయారు. వర్జిన్ అట్లాంటిక్ విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా తుర్కియేలోని మారుమూల దియార్బాకిర్ విమానాశ్రయం (డిఐవై)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఒక ప్రయాణికుడు తీవ్ర భయాందోళనకు గురికావడంతో అతనికి వైద్య చికిత్స అనివార్యమైంది. అయితే ల్యాండింగ్ సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం అక్కడే నిలిచిపోయినట్లు ఓ అధికారి తెలిపారు.My family along with 250+ passengers have been inhumanely treated by @virginatlantic . Why is this chaos not being covered in the @BBCWorld or global media?? Over 30 hours confined at a military airport in Turkey.In contact with the @ukinturkiye to please more pressure needed pic.twitter.com/TIIHgE07bb— Hanuman Dass (@HanumanDassGD) April 3, 2025అయితే, విమానం ల్యాండ్ అయిన తర్వాత 30 గంటలుగా తాము ఎయిర్‌పోర్టులోనే ఉన్నామని ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. విమానయాన సంస్థ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు తెలిపారు. తమకు వసతి సౌకర్యం కూడా కల్పించలేదని, మారుమూల ప్రాంతం కావడంతో చిమ్మచీకటిగా ఉందని, బేస్ క్యాంప్ (సైనిక స్థావరం) కావడంతో బయటకు వెళ్లేందుకు కూడా అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన భోజనం లేదని, టాయిలెట్ కూడా ఒకటే ఉందని ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “Mother of the youngest child on board requesting for baby food. It’s been almost 24 hours - Passengers of @VirginAtlantic flight VS358 share their plight in the video below. @virginmedia confirms that the flight landed due to medical emergency at Diyarbakır Airport in Turkey… pic.twitter.com/zUKuNNpVBX— loveena tandon (@loveenatandon) April 3, 2025 Received a distress call from a passenger on @VirginAtlantic flight VS358 from #London to #Mumbai , now stranded in #DiyarbakirAirport in #Turkey - apparently a military facility - emergency landing . It’s been 20hours without any concrete communication from airline or food or… pic.twitter.com/RE4h2JiHYe— loveena tandon (@loveenatandon) April 3, 2025 -
విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తుర్కియేలో చిక్కుకున్న భారతీయులు
లండన్ నుంచి ముంబై వెళ్తున్న ‘వర్జిన్ అట్లాంటిక్’ విమానం తుర్కియేలోని దియార్బాకిర్ ఎయిర్పోర్ట్ (డీఐవై)లో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ల్యాండ్ అయ్యే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.తుర్కియేలో ఒక మారుమూల విమానాశ్రయంలో బుధవారం రాత్రి నుంచి 200 మందికి పైగా భారత ప్రయాణికులు 16 గంటలకుపైగా చిక్కుకుపోయినట్లు సమాచారం. ప్రయాణికులు తిరిగి వారు ఎప్పుడు గమ్యస్థానం చేరతారనే దానిపై విమానయాన సంస్థ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు గురవుతున్నారు. వీలైనంత త్వరగా రవాణా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ప్రయాణికులు కోరారు. -
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఏసియా విమానం అత్యవసర లాండింగ్
-
శంషాబాద్‌లో చెన్నై-పూణే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో Air India విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వాతావరణం అనుకూలించని కారణంగా విమానం శంషాబాద్‌లో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. చెన్నై-పూణే ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం శంషాబాద్‌లో అత్యవసరంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం దాదాపు మూడు గంటల పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. అనంతరం, పైలట్ విమానాన్ని శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు సమాచారం. ఇక, ఎయిర్ ఇండియా విమానంలో 180 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.An Air India exp flight from Chennai to Pune has diverted to Hyd. Nearly 3 hrs in the air. pic.twitter.com/ywnbnMtG50— Mahesh (@Hanumanbhakt000) December 21, 2024 -
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
కొచ్చి:బెంగళూరు నుంచి మాల్దీవుల రాజధాని మాలేకు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని కేరళలోని కొచ్చికి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం సురక్షితంగా దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 140మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ అంశంపై ఇండిగో స్పందించింది. సాంకేతిక సమస్య తలెత్తిన విమానానికి అవసరమైన మరమ్మతులు చేసిన తర్వాత తిరిగి వినియోగంలోకి తెస్తామని ఇండిగో తెలిపింది.ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.సాంకేతిక లోపంతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది.విమానంలో ప్రయాణిస్తున్నవారిలో 91మంది భారతీయ పౌరులు కాగా 49మంది విదేశీయులు ఉన్నారని అధికారులు తెలిపారు. -
విమానాలకు బాంబు బెదిరింపు
శంషాబాద్ రూరల్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఆదివారం పలు విమానాలకు బెదిరింపు ఫోన్ కాల్ రావటంతో ఓ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. గోవా నుండి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానానికి బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో దింపారు.ఇందులో 180 మంది ప్రయాణికులు ఉన్నా రు. మరో గంటకు బెంగళూరు–హైదరాబాద్ ఇండిగో విమానానికి, మళ్లీ గంట తర్వాత హైదరాబాద్–పుణే ఇండిగో విమానానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీటితో పాటు ఎయిర్ఇండియా విమానానికి ఇదే తరహా కాల్ వచి్చనట్లు విమానాశ్రయం వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
విమానాలకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: విమానాలకు ఉత్తుత్తి బాంబు బెదిరింపుల బెడద ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. గురువారం ముంబై నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ఇండియా విమానం ఏఐసీ129కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. లండన్ గగనతలంపై ప్రయాణిస్తుండగా ‘స్క్వాకింగ్ 7700’ సంకేతాలు అందాయి. ఇదొక అత్యవసర సంకేతామని అధికారులు దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇటీవల 14 భారత విమానాలను వేర్వేరు దేశాల్లో ఇలాంటి కారణంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, విమానాల్లో బాంబులు అమర్చామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న 10 సోషల్ మీడియా ఖాతాలను సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు రద్దు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఎక్కువ ఖాతాలు ‘ఎక్స్’కు సంబంధించినవేనని తెలిపాయి. ముంబై నుంచి బయలుదేరే మూడు విమానాల్లో బాంబులు పెట్టానని ఎక్స్‌లో పోస్టు చేసిన 17 ఏళ్ల బాలుడిని ముంబై పోలీసులు చత్తీస్‌గఢ్‌లో ఇటీవల అరెస్టు చేశారు. -
మరో 2 విమానాలకు బాంబు బెదిరింపులు.. 3 రోజుల్లో 12 ఘటనలు
దేశంలో పలు విమానాలకు బాంబు బెదిరింపు ఘటనలు ఎక్కువయ్యాయి. గత మూడు రోజుల్లో అనేక విమానాలకు బాంబు బెదరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం ఏకంగా పలు సంస్థలకు చెందిన ఏడు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినన విషయం తెలిసిందే. మొత్తం గత 72 గంటల్లో 12 విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి.తాజాగా బెంగళూరు వెళ్తున్న అకాశా ఎయిర్ ఫ్లైట్, ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.ఆకాశా ఎయిర్‌లైన్ సంస్థకు చెందిన QP 1335 విమానం 184 మంది ప్రయాణికులు, సిబ్బందితో బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 2 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.అదే విధంగా ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. 6E 651 విమానం దాదాపు 200 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబై నుంచి బయల్దేరగా.. సోషల్ మీడియా ద్వారా బెదిరింపు అలర్ట్ వచ్చింది. దీంతో పైలట్ విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. అక్కడ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. అనంతరం విమానంలో తనిఖీలు చేపట్టగా బెదిరింపు కాల్స్ బూటకమని తేలింది.48 గంటల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపులుమంగళవారం ఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానం, జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో విమానం, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్ విమానం, సిలిగురి-బెంగళూరు అకాశ ఎయిర్ విమానం, అలయన్స్ ఎయిర్ అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానం, మధురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సహా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.సోమవారం రెండు ఇండిగో, ఎయిరిండియా విమానాలకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు పోలీసులతో కలిసి బెదిరింపుల వెనుక ఉన్న నిందితులను కనిపెట్టడానికి పని చేస్తోంది. -
ఎయిర్ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని షికాగో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఏఐ-127 విమానానికి ముప్పు ఉందని మంగళవారం(అక్టోబర్ 15) బెదిరింపు మెయిల్ అందింది.దీంతో అప్రమత్తమైన ఎయిర్ ఇండియా సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని కెనడాలోని ఇకాల్యూట్ ఎయిర్‌పోర్టుకు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్(ట్విటర్)లో తెలిపింది. ఇకాల్యూట్ ఎయిర్‌పోర్టులో ప్రోాటోకాల్ ప్రకారం విమానంలోని ప్రయాణికులను,సిబ్బందిని తనిఖీ చేసిన తర్వాత విమానం తిరిగి బయలుదేరేందుకు అనుమతిస్తారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో తమ విమానాలకు తరచుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది. -
Kolkata: విమానం ప్రయాణంలో విషాదం
ఇరాక్ నుంచి చైనా వెళ్తున్న విమానంలో విషాదం చోటు చేసుకుంది. ఓ టీనేజీ ప్రయాణికురాలు అస్వస్థతకు గురై సీటులోనే కుప్పకూలిపోగా.. విమానాన్ని కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే.. ఆస్పత్రికి తరలించేలోపు ఆ బాలిక కన్నుమూసింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతురాలు బాగ్దాద్ సర్ చినార్ ప్రాంతానికి చెందిన డెరన్ సమీర్ అహ్మద్(16). మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఏఐ 473 విమానంలో చైనా గువాంగ్జౌకు వెళ్తోంది. అయితే బుధవారం అర్ధరాత్రి దాటాక.. హఠాత్తుగా ఆమె అస్వస్థతకు గురైంది.దీంతో విమానాన్ని దారి మళ్లించి అరగంటకు కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్ట్‌లో దించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆమెను ఏఏఐ ఆంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత గురువారం అర్ధరాత్రి మిగతా ప్రయాణికులతో విమానం తిరిగి బయల్దేరింది. ఈ ఘటనపై అసహజ మరణంగా కోల్‌కతా బాగౌతి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం పూర్తి అయ్యాక.. మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. -
అరేబియా సముద్రంలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు
గుజరాత్‌లోని పోరుబందర్ తీరం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్ హెచ్) కూలిపోయింది. రెస్క్యూ ఆపరేషన్‌కు వెళ్తుండగా అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్న సమయంలో సముద్రంలో హెలికాప్టర్ కూలడంతో.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు.గుజరాత్‌లోని పోర్బందర్ తీరం నుంచి అరేబియా సముద్రంలోకి 45 కిలోమీటర్ల దూరంలో మోటార్ ట్యాంకర్ హరిలీలాలో గాయపడిన సిబ్బందిని రక్షించడానికి సెప్టెంబర్ 2 రాత్రి 11 గంటలకు అధునాతన తేలికపాటి హెలికాప్టర్‌ను మోహరించినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా హెలికాప్టర్లో సమస్య తలెత్తి సముంద్రంపై అత్యవసర హార్డ్ ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ఈ క్రమంలో అరేబియా సముద్రంలో హెలికాప్టర్ ప్రమాదవశాత్తు పడిపోయిందని పేర్కొంది. ఆ సమయంలో హెలికాప్టర్లో నలుగురు సిబ్బంది ఉండగా అప్రమత్తమైన కోస్ట్‌గార్డ్ దళాలు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాయి.వెంటనే ఒకరిని రక్షించగా. మిగతా ముగ్గురు అదృశ్యమయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు నౌకలు, రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు కోస్ట్‌గార్డ్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఇటీవల గుజరాత్ వర్షాల సమయంలో 67 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
-
సెక్యూరిటీ అలర్ట్.. అహ్మదాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఢిల్లీ: ఢిల్లీ నుంచి ముంబై బయలుదేరిన అకాసా ఎయిర్ విమానానికి సెక్యూరిటీ అలెర్ట్ రావటం కలకలం రేపింది. దీంతో ఆ విమానాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మళ్లించారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ముంబైకి 186 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానానికి సెక్యూరిటీ హెచ్చరిక వచ్చింది.Akasa Air flight diverted to Ahmedabad airport after security alert https://t.co/BMWokfVVF9 pic.twitter.com/itUSAtj16s— DeshGujarat (@DeshGujarat) June 3, 2024 దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది 10.13 గంటలకు దారి మళ్లించి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరినీ ఫ్లైట్ నుంచి దించివేశారు.‘ఫైట్ కెప్టెన్ అన్ని అత్యవసర సూచనలు పాటించారు. సురక్షింతంగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అకాశ్ ఫ్లైట్.. సెఫ్టీ, సెక్యూరిటీ ప్రొటోకాల్స్ పాటించింది’ అని అకాసా ఎయిర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. -
గిరికీలు కొట్టిన హెలికాప్టర్
కేదార్నాథ్: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో శుక్రవారం ఉదయం పెనుప్రమాదం తప్పింది. హెలికాప్టర్ హైడ్రాలిక్ వ్యవస్థ విఫలం కావడంతో అత్యవసర ల్యాండయ్యింది. కెస్ట్రెల్ ఏవియేషన్‌కు చెందిన ఈ హెలికాప్టర్ సిర్సి నుంచి ఆరుగురు భక్తులతో కేదార్‌నాథ్‌కు చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్ వేగంగా గిరికీలు కొట్టింది. హెలిప్యాడ్ వద్ద ఉన్న వాళ్లంతా భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. పైలట్ కల్పేశ్ చాకచక్యంగా వ్యవహరించి, హెలిప్యాడ్ పక్కనే 100 మీటర్ల దూరంలోని ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అందరూ సురక్షితంగా కిందికి దిగారు. -
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్‌కు తప్పిన ప్రమాదం
భువనేశ్వర్: దేశంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో అక్కడక్కడా వర్షం కురుస్తూ బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో గాలివాన తీవ్రతరమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఒడిశా ముఖ్యమంత్రి 'నవీన్ పట్నాయక్' హెలికాప్టర్ భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కాలేదు.ఎన్నికల ప్రచారం ముగించుకుని ఖరియార్ నుంచి తిరిగి వస్తుండగా.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సీనియర్ బీజేడీ నాయకుడు కార్తిక్ పాండియన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడానికి సాధ్యపడలేదు. దీంతో హెలికాప్టర్ 30 నిమిషాల పాటు భువనేశ్వర్ విమానాశ్రయంపై తిరుగుతూ ఝర్సుగూడకు బయలుదేరింది.జరిగిన సంఘటన పార్టీ నేతలను ఒక్కసారిగా భయానికి గురిచేసింది. ఝర్సుగూడలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నవీన్ పట్నాయక్, బీజేడీ సీనియర్ నేత కార్తిక్ పాండియన్ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.#WATCH | Odisha: While returning from Khariar, the helicopter carrying CM Naveen Patnaik and 5T Chairman and BJD leader VK Pandian couldn't land at Bhubaneswar airport due to wind and rain. After hovering over the airport for nearly 30 minutes, the helicopter headed to… pic.twitter.com/B0lyEMQYN4— ANI (@ANI) May 6, 2024 -
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
భువనేశ్వర్: విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా వడగళ్ల వాన వల్ల దెబ్బతింది. విమానం విండ్‌షీల్డ్ పగుళ్లిచ్చింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.భువనేశ్వర్తోపాటు పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వడగండ్ల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ నుంచి ఢిల్లీ విమానం టేకాఫ్ అయిన కేవలం పది నిమిషాల్లో తిరిగి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానంలో ప్రయాణిస్తున్న ఉన్న 169 మంది ప్రయాణికులు, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.వడగళ్ల వాన వల్ల విస్తారా విమానం దెబ్బతిన్నట్లు బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. వడగళ్ల వల్ల విమానం విండ్‌షీల్డ్ పగుళ్లిచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలిపారు. విమానంలోని 169 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. -
విమానంలో మంటలు.. అత్యవసర ల్యాండింగ్
అట్లాస్ ఎయిర్ బోయింగ్ కార్గో విమానం ఆకాశంలో ఉండగానే మంటలు చెలరేగాయి. దీంతో అమెరికాకు చెందిన ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అట్లాస్ ఎయిర్ బోయింగ్ 747-8 కార్గో విమానం టేకాఫ్ అయి ఫ్యూక్టోరికాకు బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే ఆకాశంలో ఉండగా ఇంజన్లో లోపం కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని తిరిగి మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. 💥#BREAKING: Atlas Air Boeing 747-8 catches fire with sparks shooting out during mid flight.#Miami | #Florida #boeing7478 #atlasair pic.twitter.com/3IO5xFvMr6 — Noorie (@Im_Noorie) January 19, 2024 విమానంలో మంటలో చెలరేగటంతో ఆ విమానాన్ని వెంటనే సురక్షింగా మియామి ఎయిర్ట్లోనే ల్యాడింగ్ చేయించామని అట్లాస్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కారణంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఘటనలో సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదని మియామి ఎయిర్ పోర్టు ఫైర్ సిబ్బంది వెల్లడించింది. ఆకాశంలో ఉన్న విమానం మంటల్లో చిక్కుకున్నట్లు తెలిపే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: Israel Hamas War: గాజాలో పేలిన యూనివర్సిటీ భవనం -
త్రుటిలో తప్పిన మరో విమాన ప్రమాదం
టోక్యో: అమెరికాలో విమానం మార్గమధ్యంలో కిటికీ ఊడిపడి ప్రయాణికులు నరకం చూసిన ఘటన మరువకముందే దాదాపు అలాంటి ఘటనే జపాన్‌లో జరిగింది. కాక్‌పిట్ కిటికీకి పగుళ్లు రావడంతో అప్రమత్తమైన విమాన పైలెట్లు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్చేశారు. జపాన్‌లోని సప్పోరో నగరంలోని న్యూ చిటోసే ఎయిర్‌పోర్ట్‌లో శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచి్చంది. 59 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ఆల్ నిప్పన్ ఎయిర్వేస్కు చెందిన దేశీయ బోయింగ్ 737–800 రకం విమానం సప్పోరో నుంచి టొయామాకు బయల్దేరింది. మార్గమధ్యంలో కాక్‌పిట్ కిటికీలో పగుళ్లను గుర్తించారు. పైలెట్లు వెంటనే అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. వారి అనుమతితో మళ్లీ అదే ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. -
విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన డోర్.. వీడియో వైరల్
అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా.. ఎయిర్‌క్రాఫ్ట్ డోర్ ఒక్కసారిగా ఊడిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9(1282) విమానం పోర్టులాండ్ నుంచి ఒంటారియాకు(కెనడా) గురువారం సాయంత్రం బయలు దేరింది. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్ అయిన కొంత సమయానికే మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుంచి పూర్తిగా విడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. వెంటనే గమనించిన పైలెట్.. విమానాన్ని తిరిగి పోర్ట్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. 🚨#BREAKING: Alaska Airlines Forced to Make an Emergency Landing After Large Aircraft Window Blows Out Mid-Air ⁰⁰📌#Portland | #Oregon ⁰A Forced emergency landing was made of Alaska Airlines Flight 1282 at Portland International Airport on Friday night. The flight, traveling… pic.twitter.com/nt0FwmPALE — R A W S A L E R T S (@rawsalerts) January 6, 2024 విమానం ఆకాశంలో ఉండగా డోర్ ఊడిపోయి సమయం దృశ్యాలను ప్రయాణికులు వీడియో తీయగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై అలస్కా ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఈ ఘటనతో ప్రభావితులైన ప్రయాణికులు, సిబ్బంది పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. AS1282 from Portland to Ontario, CA experienced an incident this evening soon after departure. The aircraft landed safely back at Portland International Airport with 171 guests and 6 crew members. We are investigating what happened and will share more as it becomes available. — Alaska Airlines (@AlaskaAir) January 6, 2024 ఇక ఈ సంఘటన అనంతరం అలాస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ‘ఫ్లైట్ 1282లో గురువారం రాత్రి జరిగిన పరిణామంతో మా బోయింగ్ 737-9కు సంబంధించిన 65 విమానాలను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తాత్కాలికంగా నేలకు పరిమితం చేస్తున్నాం’ అని ఎయిర్లైన్సన్ సీఈవో బెన్స్ మినికుచి పేర్కొన్నారు. పూర్తి మెయింటెనెన్స్, సేఫ్టీ తనిఖీల తర్వాత ప్రతి విమానం తిరిగి సేవలందించనున్నట్లు ఆయన తెలిపారు. -
గన్నవరంలో విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారణం ఇదే..
గన్నవరం: పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవటంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో మూడు విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. చత్తీస్గడ్ నుంచి హైదరాబాద్, గోవా నుంచి హైదరాబాద్, తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌కు రావల్సిన విమానాలను అత్యవసరంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. ఒక్కో విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢిల్లీ, హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులను పొగమంచు కమ్మెసింది. దీంతో పలు విమానాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. పొగమంచు వల్ల వాతావరణం అనుకూలించికపోవడంతో పలు విమానాలను దారి మళ్లించారు. ఉదయం 07:35 గంటలకు మస్కట్ నుంచి శంషాబాద్ రావాల్సిన ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. ఉదయం 8:05 గంటలకు రియాద్ నుంచి రావలసిన విమానం, ఉదయం 9:10 గంటలకు జెడ్డా నుండి రావాల్సిన విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. పలు విమానాలు బెంగళూరు, నాగపూర్‌కు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 200 మంది అయ్యప్ప భక్తుల ఆందోళన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కొచ్చి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం రద్దు కావడంతో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఉదయం 9:40కి కొచ్చి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం పొగ మంచు కారణంగా 11 గంటలకు వెళ్లనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. 11 గంటలు దాటిన విమానాన్ని కొచ్చికి వెళ్లేందుకు సుముఖత చూపకపోవడంతో ఎయిర్‌పోర్టులో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. రాత్రి 10:40కి భక్తులకు దర్శనం ఉండడంతో అయ్యప్ప భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఢిల్లీ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ముంబై: పుణె నుంచి ఢిల్లీ వెళ్తున్న అకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాలు.. ఆకాశ ఎయిర్ సంస్థకు విమానం(QP 1148) 185 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో శుక్రవారం అర్థరాత్రి 12 గంటలకు తెల్లవారుజామున పుణె నుంచి బయల్దేరింది. టేకాఫ్ అయిన 40 నిమిషాలల తర్వాత ఓ ప్రయాణికుడు తన వద్దనున్న బ్యాగ్‌లో బాంబ్ ఉందని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ముంబైకి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ బృందం, పోలీసులు విమానం అంతా తనిఖీలు చేపట్టారు. అయితే తమ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదని అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపు చేసిన ప్రయాణికుడు ఛాతీలో నొప్పి వస్తుందని కూడా చెప్పడంతో విమానం ల్యాండైన వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతనికి వైద్యం అందించి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు లేదని తేలడంతో శనివారం ఉదయం 6 గంటలకు విమానం మళ్లీ ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. చదవండి: ఘోర ప్రమాదం.. చిన్నారి సహా అయిదుగురు మృత్యువాత -
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో కుప్పకూలి చనిపోయిన పైలట్
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో పైలట్ కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన కో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే అప్పటికే పైలట్ మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీకి వెళుతున్న లాటామ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య విమానంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఆదివారం రాత్రి మియామీ ఎయిర్‌పోర్టు నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు బయల్దేరింది. విమానంలో 271 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత 56 ఏళ్ల కెప్టెన్ ఇవాన్ అందౌర్ అస్వస్థతకు గురయ్యారు. బాత్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన ఎంతకూ తిరిగి రాకపోడంతో సిబ్బంది వెళ్లి చూడగా కిందపడిపోయి ఉన్నారు. సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. వెంటనే కో పైలట్ విమానాన్ని పనామా సిటీలోని టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ల బృందం ఇవాన్‌ను పరిశీలించగా.. అప్పటికీ పైలట్ చనిపోయినట్లు ప్రకటించారు. మంగళవారం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. అప్పటి వరకు ప్రయాణికులకు పనామాలోని హోటల్లో వసతి కల్పించారు. ఈదురదృష్టకర సంఘటనపై ఎయిర్‌లైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ ఇవాన్ అందూర్ తమ ఎయిర్‌లైన్స్‌లో వెటరన్ పైలట్ అని.. అతడికి 25 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొంది. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని తెలిపింది. కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఈ 25 ఏళ్ల కెరీర్లో తమ ఎయిర్‌లైన్స్‌కు ఎంతో సేవలు అందించారని పేర్కొంది. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ ఇవాన్ అందూర్‌ను కాపాడుకోలేకపోయామని వెల్లడించింది. చదవండి: వర్షం ఇంక లేదు.. వరదైంది..! -
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
తిరువనంతపురం: తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి షార్జాకు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, విమానాన్ని ముందు జాగ్రత్తగా కేరళలో తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. 154 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో సోమవారం ఉదయం 10.45 గంటలకు తిరుచిరాపల్లి నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ తీసుకుంది. కొద్దిసేపటికే ఇంజిన్‌లో సమస్యలు తలెత్తినట్లు గుర్తించిన పైలట్ అధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరకు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితి ప్రకటించి, మధ్యాహ్నం 12.01 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. తిరువనంతపురం–బహ్రెయిన్ ఎక్స్‌ప్రెస్ సాంకేతిక లోపంతో నిలిచిపోయిందని ఎయిరిండియా పేర్కొంది. -
నేరుగా సముద్రంలోనే విమానం ల్యాండింగ్.. తర్వాత ఏం జరిగిందంటే
మార్సెయిల్(ఫ్రాన్స్): ఇంజిన్ వైఫల్యం చెందడంతో ఓ పైలట్ విమానాన్ని సముద్రంలోనే అర్ధాంతరంగా దించేశాడు. విమానం మునిగిపోయినా అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఫ్రాన్సులోని మధ్యధరా సముద్ర తీరం ఫ్రెజుస్ వద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. తీరానికి మరో 600 మీటర్ల దూరం ఉందనంగా సెస్నా 177 రకం చిన్నపాటి పర్యాటక విమానం ఇంజిన్‌లో లోపం ఏర్పడింది. దీంతో, పైలట్ సముద్ర జలాల్లోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అత్యవసర విభాగం సిబ్బంది అక్కడికి చేరుకునే అందులోని ముగ్గురినీ రక్షించారు. ‘ఫ్రెజుస్ బీచ్‌లో జనం రద్దీ ఎక్కువగా ఉంది. బీచ్‌లో అత్యవసర ల్యాండింగ్ వారికి అపాయం కలుగుతుందని పైలట్ భావించాడు. దీంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి బీచ్‌లో కాకుండా దగ్గర్లోని∙సముద్ర జలాల్లో ల్యాండ్ చేశాడు. ఇందుకు ఎంతో నైపుణ్యం కావాలి. అదృష్టమూ కలిసి రావాలి’ అని సహాయక సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో విమానం సముద్రంలో మునిగిపోయింది. -
ఆక్సిజన్ మాస్క్‌తో విమానంలో సోనియా గాంధీ.. రాహుల్ భావోద్వేగ పోస్టు..
భోపాల్: బెంగళూరులో విపక్ష భేటీ అనంతరం ఢిల్లీకి వెళుతుండగా.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో విమానంలో ఆక్సిజన్ తక్కువ అయింది. ఈ కారణంగా సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించారు. ఈ ఫొటోను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ షేర్ చేశారు. 'ఆపదలోనూ దయకు అమ్మే ఉదాహారణ' అని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. పోస్టు చేసిన మొదటి గంటలోనే 1.8 లక్షల లైకులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. సాంకేతిక లోపం కారణంగా విమానం భోపాల్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్ చారీ మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలియజేశారు. View this post on Instagram A post shared by Rahul Gandhi (@rahulgandhi) సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బెంగళూరులో జరిగిన విపక్ష నేతల సమావేశంలో పాల్గొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దాదాపు గంటన్నర సేపు ఎయిర్ పోర్టులో బస చేసిన తర్వాత మంగళవారం రాత్రి 9.35కి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇదీ చదవండి: దంచికొట్టిన వానలు.. నీటమునిగిన కార్లు.. ఒక్క రోజులోనే.. -
సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వారి విమానం భోపాల్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్ చారీ మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలియజేశారు. అయితే ఎయిర్‌ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రతికూల వాతావరణమే కారణంగా తెలుస్తోంది. కాగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బెంగళూరులో జరిగిన విపక్ష నేతల సమావేశంలో పాల్గొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు తెలిసింది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ విషయమై వివరాలు తెలుసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శోభ ఓజా తెలిపారు. -
తప్పిన ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై దొర్లిన విమానం!
బెంగళూరు: బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఓ విమానం సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా వెనక్కి మళ్లింది. అంతేకాకుండా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా.. రన్‌వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. వివరాల్లోకి వెళితే.. హాల్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతున్న ప్రీమియర్ 1ఏ విమానం వీటీ-కేబీఎన్‌లో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విమానం టేకాఫ్ అయిన తర్వాత నోస్ ల్యాండింగ్ గేర్‌ను వెనక్కి తీసుకోలేనందున ఎయిర్‌టర్న్‌బ్యాక్‌లో చిక్కుకుంది. దీంతో విమానాన్ని తక్షణమే వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో రన్‌వేపై నీరు నిలిచింది. ఆ నీటిలోనే విమానం ముందుకుసాగింది. అయితే విమానపు నోస్ ల్యాండింగ్ గేర్ సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా ముందుకు దొర్లింది. అయితే అదృష్టవశాత్తు చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నారు. ప్రయాణికులెవరూ లేరని డీజీసీఏ తెలిపింది. Bengaluru | A Fly By wire Premier 1A aircraft VT-KBN operating flight on sector 'HAL Airport Bangalore to BIAL' was involved in Airturnback as the nose landing gear couldn't be retracted after take off. The aircraft safely landed with the nose gear in Up position. There were two… pic.twitter.com/53zmaaKKEn — ANI (@ANI) July 11, 2023 చదవండి: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే.. -
మమతా బెనర్జీకి తప్పిన పెను ప్రమాదం
బెంగాల్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ ఉదయం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టరును అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జల్పాయిపూర్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు మమతా బెనర్జీ. అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని బాగ్డోగ్రా ఎయిర్ పోర్టుకు వెళ్తూ బైకుంఠాపూర్ అడవులు దాటుతుండగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. దీంతో సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్ వద్ద హెలికాప్టరును ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు సిబ్బంది. ఒక్కసారిగా వర్షం ఉధృతం కావడంతో మార్గం స్పష్టంగా లేక ముందుకు వెళ్లడం ప్రమాదకరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఈ ఘటనలో మమతా బెనర్జీ స్వల్ప గాయాలతో బయటపడినట్లు చెప్పారు అధికారులు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బాగ్డోగ్రా ఎయిర్ పోర్టుకు చేరుకొని మమతా బెనర్జీ కోల్‌కతా పయనమైనట్లు తెలిపారు అధికారులు. Due to low visibility, West Bengal CM Mamata Banerjee's helicopter made an emergency landing at Sevoke Airbase. She was going to Bagdogra after addressing a public gathering at Krinti, Jalpaiguri. She is safe, says TMC leader Rajib Banerjee (file pic) pic.twitter.com/IVNIPV3oJD — ANI (@ANI) June 27, 2023 ఇది కూడా చదవండి: సెంచరీ దాటిన కిలో టమాట ధరలు.. కారణమిదే! -
విశాఖలో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవితకు తప్పిన ప్రమాదం
సాక్షి, యాదాద్రి: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు ప్రమాదం తప్పింది. వీరిద్దరూ మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అవడంతో పెద్దగుట్టపై అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలట్. వివరాల ప్రకారం.. మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ మాలోతు కవిత ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అయ్యింది. ఈ విషయం గుర్తించిన పైలట్ యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్‌ను అత్యవసరం ల్యాండ్ చేశాడు. ఈ క్రమంలో హెలికాప్టర్ పెద్దగుట్టపై దాదాపు 20 నిమిషాల పాటు ఆగింది. అనంతరం, అక్కడ ఉన్న సిబ్బంది వ్యాన్‌లో ఇంధనం తీసుకురావడంతో హెలికాప్టర్లో ఇంధనం నింపారు. దీంతో, తిరిగి హెలికాప్టర్ హైదరాబాద్‌కు పయనమైంది. ఇక, ఎర్రబెల్లి, కవితకు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి -
రష్యాలో ఎయిరిండియా ప్రయాణికుల అగచాట్లు!
ఎయిర్ ఇండియా విమానం రష్యాలోని మగడాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ప్రయాణికులు భాషా సమస్య, విబిన్న ఆహారం, అరకొర వసతి వంటి వాటితో నానా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఢిల్లీకి నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 777లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. చాలా మంది పిల్లలు, వృద్ధులు ఉన్నారు. వారిని బస్సుల్లో వివిధ ప్రాంతాలకు పంపించారని ప్రయాణికులు చెబుతున్నారు. కొంతమందికి పాఠశాలల్లో వసతి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అక్కడ లభించే విభిన్న ఆహారం తినలేక ఇబ్బంది పడుతుంటే..దీనికి తోడు అక్కడ భాష అస్సలు అర్థం గాక మరింత గందగోళంగా ఉన్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. పిల్లలతో ఉన్న ప్రయాణికులు అరకొర వసతులతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు ఎయిర్ ఇండియా ప్రయాణికుడు మాట్లాడుతూ..తమకు ఓ కళాశాల హాస్టల్లో వసతి కలప్పించారని, లక్కీగా తమకు ఇక్కడ వైఫై అందుబాటులో ఉండటంతో తమ కుటుంబాలతో టచ్‌లో ఉండగలిగామని చెప్పుకొచ్చారు. మరికొంతమంది ఇతర ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఒకే గదిలో 20 మంది నిద్రించాల్సిన దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చిక్కుకుపోయిన ప్రయాణికులను మగడాన్ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు తరలించడానికి ముంబై నుంచి ప్రత్యామ్నాయ విమానాన్ని పంపనున్నట్లు ఎయిర్ ఇండియా బుధవారం ప్రకటించింది. విమానాయన సంస్థ ప్రయాణికులకు కావాల్సిన అన్ని రకాల సహాయసహకారాలను అందిస్తున్నామని, వారందరికీ హాస్టళ్లు, హోటళ్లలో వసతి కల్పించామని పేర్కొంది. కాగా, ఎయిర్ ఇండియా మగడాన్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆ విమానంలో తలెత్తిన సాంకేతిక పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు రష్యా ఏవియేషన్ అథారిటీ ధృవీకరించింది. (చదవండి: ఎయిరిండియా విమానం రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్) -
కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
గువాహటి: కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన అస్సాంలోని గువాహటిలో చోటు చేసుకొంది. ఆదివారం ఉదయం దిబ్రూఘఢ్ వెళ్లాల్సిన ఇండిగో విమాన ఇంజన్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని గువాహటిలోని లోక్‌ప్రియ గోపినాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. లాగే కేంద్ర పెట్రోలియం, సహజవాయుశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలితోపాటు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశాంత్ ఫుకాన్, తెరష్ గోవాలా ఉన్నారు ప్రమాద సమయంలో విమానంలో 150కి పైగా ప్రయాణికులు ఉండగా వారంతా సురక్షింగా ఉన్నట్లు సమాచారం. కాగా విమాన ఘటనపై ఐ కేంద్ర మంత్రి స్పందించారు. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి విమానంలో బల్దేరానని తెలిపారు. విమానం టేకాఫ్ అయ్యాక 15 నుంచి 20 నిమిషాల తర్వాత దిబ్రూగఢ్‌లో దిగాల్సి ఉందన్నారు. కానీ సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి గువాహాటిలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని, తాము సురక్షితంగా ఉన్నామని తెలిపారు. చదవండి:Odisha Train Accident: వామ్మో రైలా..! రైల్వే ఆడిట్ రిపోర్ట్‌లో ఏముంది? A Dibrugarh-bound IndiGo flight was diverted to Guwahati’s Lokpriya Gopinath Bordoloi International after the pilot of the plane announced snag in engine of the aircraft. Over 150 passengers were travelling on the flight, including Union Minister of State for Petroleum and… pic.twitter.com/umZb0sm75V — ANI (@ANI) June 4, 2023 -
అర్ధంతరంగా అపాచీ ల్యాండింగ్
భిండ్/న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన అపాచీ ఎటాక్ హెలికాప్టర్ సోమవారం మధ్యప్రదేశ్‌లోని భిండ్ సమీపంలో అర్ధంతరంగా ల్యాండయింది. రోజువారీ శిక్షణ సమయంలో హెలికాప్టర్లో కొన్ని అవాంతరాలు తలెత్తడంతో పైలట్ ముందు జాగ్రత్తగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిపుణుల బృందం హెలికాప్టర్‌ను పరిశీలిస్తోందని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. ఉదయం 8.45 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో ఎవరికీ ఏవిధమైన హాని కలగలేదని, అందులోని సిబ్బంది క్షేమంగా ఉన్నారని పేర్కొంది. కాగా, హెలికాప్టర్ ల్యాండయిన ప్రాంతంలో జనం గుమికూడిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. -
పీసీసీ చీఫ్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి..
బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెచ్ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో హెలికాప్టర్ అద్దం పగిలింది. శివకుమార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు బెంగళూరులోని జక్కూర్ ఎయిర్‌పోర్టు నుంచి కోలార్ జిల్లాలోని ముల్బాగల్ వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపరిపీల్చుకున్నాయి. ఘటన సమయంలో హెలికాప్టర్లో డీకే శివకుమార్‌ను ఓ కన్నడ టీవీ ఛానల్ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తున్నారు. పైలటతో కలిపి మొత్తం ముగ్గురు హెలికాప్టర్లో ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతల ో జరగనున్న విషయం తెలిసిందే. 13 న కౌంటింగ్ ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 స్థానాలున్నాయి. మెజార్టీకి 123 సీట్లు అవసరం. ఈ సారి కచ్చితంగా 150 స్థానాలకుపై కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చదవండి: లిక్కర్ స్కాం కేసు: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు షాక్! -
ఎంతపనైపాయే! వార్నింగ్ లైట్ వచ్చిందని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తే..
వార్నింగ్ లైట్ వెలిగిందని అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. తీరా అధికారులు విమానంలో సోదాలు నిర్వహించగా..అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విచిత్ర ఘటన ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలు దేరిన స్పైస్ జెట్ విమానం అనూహ్యంగా కొద్దిసేపటిలోనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి తిరిగి వచ్చింది. కాక్‌పిట్ నుంచి వార్నింగ్ లైట్ వెలగడంతో ఒక్కసారిగా అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. దీంతో వెంటనే ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పైలట్ చర్యతో ఒక్కసారిగా వార్నింగ్ లైట్ ఆగిపోయింది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ వద్ద ఆ విమానాన్ని తనిఖీ చేయగా తప్పుగా వార్నింగ్ లైట్‌ని చూపిందని తేలడంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు అధికారులు. కాక్‌పీట్‌లోని కార్గోలో ఎలాంటి పొగ, మంటలు వచ్చిన సంకేతాలు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఆ విమానం 140 మంది ప్రయాణికులతో మంగళవారం ఉదయం శ్రీనగర్‌కు బయలు దేరినట్లు తెలిపారు. తదనంతరం సాధారణ తనిఖీలను పూర్తి చేసి ఆ విమానం తిరుగు పయనమైనట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: మిస్ అయిన మాజీ రైల్వే మంత్రి..హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమై..) -
విమానం గాల్లో ఉండగా విండ్‌షీల్డ్‌కు పగుళ్లు..కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
కోల్‌కతా: సౌదీ అరేబియాకు చెందిన కార్గో విమానం కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా.. విండ్ షీల్డ్‌కు పగుళ్లు రావడంతో పైలట్ ఎమెర్జెన్సీ ల్యాండింగ్ కోసం విజ్ఞప్తి చేశాడు. దీంతో విమానాశ్రయంలో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఇటీవలే బెంగళూరు నుంచి అబుదాబి వెళ్తున్న ఎటిహాద్ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తి కాసేపటికే తిరిగి బెంగళూరు విమానాశ్రాయానికి వచ్చింది. ల్యాండింగ్ అనంతరం ఫ్లైట్‌ను పరిశీలించారు. ఆ తర్వాత విమానం తిరగి బయల్దేరి గమ్యస్థానాన్ని చేరుకుంది. ఏప్రిల్ 1న ఢిల్లీ ఇంధిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కూడా ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దుబాయ్‌కు చెందిన ఫెడ్ఎక్స్ విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో ఫ్లైట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ కేసు: సీబీఐ సమన్లపై సీఎం కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ -
శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: ఇండిగో విమానం ఒకటి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. బెంగళూరు నుంచి వారణాసి మధ్య 6E897 నెంబరు ఇండిగో విమానం మంగళవారం ఉదయం 5గం.10ని. టేకాఫ్ అయ్యింది. అయితే.. సాంకేతిక సమస్యల తలెత్తడంతో శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఉదయం 6గం. 16ని. హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం హఠాత్తుగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్యలు ఏర్పడటం వల్ల ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
ధ్రువ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. సిబ్బంది సేఫ్
సాక్షి, ముంబై: భారత నౌకా దళానికి చెందిన హెలికాప్టర్ ఒకటి.. ముంబై తీరంలో బుధవారం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ధ్రువ్ హెలికాఫ్టర్ రొటీన్ డ్యూటీలో ఉండగానే.. ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు నేవీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. అత్యాధునిక తేలికపాటి యుద్ధవిమానం అయిన ధృవ్.. ముంబై తీరంలో ఎమర్జెన్సీ ల్యాండ్ గురించి సమాచారం అందుకున్న వెంటనే నేవీ పెట్రోలింగ్ స్పందించింది. హెలికాఫ్టర్లోని ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు తెచ్చింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు నేవీ అధికారులు వెల్లడించారు. Indian Navy ALH on a routine sortie off Mumbai ditched close to the coast. Immediate Search and Rescue ensured safe recovery of crew of three by naval patrol craft. An inquiry to investigate the incident has been ordered. — SpokespersonNavy (@indiannavy) March 8, 2023 (చదవండి: మోదీ, షా, నడ్డా సమక్షంలో.. త్రిపుర సీఎంగా డాక్టర్ మాణిక్ సాహా ప్రమాణం) -
టేకాఫ్ సమయంలో ప్రమాదం.. విమానం వెనుకభాగం ధ్వంసం!
తిరువనంతపురం: కేరళ కాలికట్(కోజికోడ్) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియా దమ్మం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం తిరవనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అధికారులు విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకిటించారు. ఈ ఫ్లైట్‌లో మొత్తం 182 మంది ప్రయాణికులున్నారు. కాలికట్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో విమానం వెనుకభాగం నేలకు తాకి దెబ్బతిన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో ఫ్లైట్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు వీలుగా ఇంధనాన్ని మొత్తం అరేబియా సముద్రంలో డంప్ చేశాడు పైలట్. అనంతరం తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలుస్తోంది. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు అధికారికి వర్గాలు తెలిపాయి. వారిని దమ్మం తీసుకెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పాయి. చదవండి: ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంది: ప్రధాని మోదీ -
ఆయిల్ లీక్.. ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
న్యూఢిల్లీ: అమెరికా నెవార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం స్వీడన్ స్టాక్‌హోమ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపంతో ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ కావడం వల్ల విమానాన్ని స్వీడన్‌కు దారిమళ్లించాల్సి వచ్చింది. ఫ్లైట్‌లో మొత్తం 300 మంది ప్రయాణికులున్నారు. అయితే విమానంలో అందరూ సురక్షితంగానే ఉన్నారని, స్టాక్‌హోం విమానాశ్రయానికి ఫైర్ ఇంజిన్లకు కూడా తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయిల్ లీక్ కారణంగా విమానం రెండో ఇంజిన్ ఆగిపోయిందని, అందుకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని డీజీసీఏ సీనియర్ అధికారి చెప్పారు. సమస్యను గుర్తించామని, ఇన్స్పెక్షన్ జరుగుతోందని పేర్కొన్నారు. సోమవారం కూడా న్యూయార్క్ నుంచి ఢిల్లీ రావాల్సిన విమానం లండన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా దీన్ని దారిమళ్లించారు. చదవండి: స్నూపింగ్ కేసు: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్.. -
గగనతలంలో ఉన్న విమానంలో మంటలు.. 184 మంది ప్రయాణికులు..
గగనతలంలో ఉన్న ఎయిర్ ఇండియా విమానం ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రన్‌వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో మంటలను గుర్తించిన పైలట్ వెంటనే మళ్లీ విమానాన్ని విమానాశ్రయానికి మళ్లించి ల్యాండ్ చేశాడు. ఈ ఘటన అబుదాబిలో చోటుచేసుకుంది. కాగా, ఎయిర్ ఇండియా విమానం అబుదాబి నుంచి కాలికట్కు వస్తుండగా ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. 184 మంది ప్రయాణికులతో అబుదాబి నుంచి కాలికట్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ B737-800 విమాన ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. రన్‌వే నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే మంటలు కనిపించాయని డీజీసీఏ తెలిపింది. సుమారు 1000 అడుగుల ఎత్తులోకి వెళ్లగానే ఒకటో నెంబర్ ఇంజన్లో మంటలు రావడం గమనించిన పైలట్.. తిరిగి విమానాన్ని అబుదాబి విమానాశ్రయంలోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది. #BREAKING | Massive scare on an #AirIndia Express plane from Abu Dhabi to Calicut. The flight's engine caught fire during climb, forcing it to make landing. @Aruneel_S reports pic.twitter.com/IY8zYYZaV1 — Mirror Now (@MirrorNow) February 3, 2023 కాగా, ఈ ప్రమాదంపై ఎయిర్ ఇండియా అధికారులు స్పందించారు. విమాన ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగానే మంటలు వచ్చినట్టు తెలిపారు. విమానాన్ని పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పిందని స్పష్టం చేశారు. ఇక, విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. -
విమానం గాల్లో ఉండగా పురిటి నొప్పులు.. చివరికి..
దుబాయ్: విమానంలో ఉన్నట్లుండి ఆరోగ్య సమస్యలు తలెత్తితే.. అత్యవసర ల్యాండింగ్‌లు కావాల్సి ఉంటుంది. అది పురిటి నొప్పులకు కూడా వర్తిస్తుంది. సాధారణంగా డెలివరీ దగ్గర పడుతున్న గర్భిణిల విమాన ప్రయాణాలకు అనుమతి ఉండదు. కానీ, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే!. అలా ఎమిరేట్స్ విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలికి హఠాత్తుగా పురిటి నొప్పులు రాగా.. గగనతంలో ఉండగానే విమానంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. టోక్యో నరిటా నుంచి దుబాయ్(యూఏఈ)కి వెళ్తున్న ఎమిరేట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో జనవరి 19వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈకే 319 విమానంలో ప్రయాణికురాలికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో పైలట్ మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పటికీ షెడ్యూల్ ప్రకారమే ల్యాండ్ కావడం గమనార్హం. ప్రయాణికురాలు ప్రసవ వేదనకు గురవుతున్న క్రమంలో విమాన సిబ్బంది సమయస్ఫూర్తిగా, చాకచక్యంగా వ్యవహరించినట్లు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. విమానశ్రయంలో దిగేసరికి వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని ఎమిరేట్స్ ప్రకటించుకుంది. సాధారణంగా డెలివరీకి దగ్గరపడే సమయంలో మహిళలను ప్రయాణానికి అనుమతించరు. అయితే.. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలకు అనుమతిస్తారు. ఎమిరేట్స్ రూల్స్ ప్రకారం.. ఏడో నెల వరకు గర్భిణిలకు మాత్రమే విమాన ప్రయాణాలకు అనుమతి ఉంది. ఒకవేళ ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలు చెబితే మాత్రం నెలలు నిండిన గర్భిణులకు ప్రయాణాలకు అనుమతిస్తారు. ఇదిలా ఉంటే.. విమాన ప్రయాణాల్లో ఇలా డెలివరీ జరిగిన ఘటనలు కొత్తేం కాదు. కిందటి ఏడాది మే నెలలో.. డెన్వర్ నుంచి కొలరాడోకు వెళ్తున్న ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణికురాలు బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ నెలలోనే ఘనా నుంచి అమెరికా(వాషింగ్టన్) వెళ్తున్న ఓ విమానంలో ఆరు గంటల పాటు ప్రసవవేదన అనుభవించిన ఓ ప్రయాణికురాలు.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద ఉండే క్యాబిన్ ఫ్లోర్‌పై విమాన బృందం సాయంతో బిడ్డకు జన్మనిచ్చింది. -
మధ్యప్రదేశ్ సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక కారణాలతో పైలట్ ఇలా చేశారు. హెలికాప్టర్ మనావర్ నుంచి ధార్ వెళ్తుండగా సమస్య రావడంతో తిరిగి మనావర్కే వచ్చింది. ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈమేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. హెలికాప్టర్ నిలిచిపోవడంతో సీఎం రోడ్డు మార్గం ద్వారా బస్సులోనే ధార్‌కు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ ర్యాలీకి హాజరై ప్రసంగించారు. సాంకేతిక కారణాలు తలెత్తిన ఈ హెలికాప్టర్ ఓ ప్రైవేటు కంపెనీకి చెందింది. చదవండి: ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు.. వీడియో వైరల్.. -
ప్రయాణికుడి కోసం విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..అయినా దక్కని ప్రాణాలు
ఇండిగో విమానంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినప్పటికీ.. ప్రయాణికుడి ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన ఇండోర్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధురై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం 6E-2088లో ఒక ప్రయాణికుడి కారణంగా ఇండోర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అతుల్ గుప్తా అనే 60 ఏళ్ల వ్యక్తికిఅకస్మాత్తుగా నోటి నుంచి రక్తం వచ్చింది. ఆ తర్వాత కాసేపటికీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. క్రమంగా ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. దీంతో పైలట్ విమానాన్ని ఇండోర్‌లోని దేవి అహల్యబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశాడు. ఆ తర్వాత ఆ ప్రయాణికుడిని హుటాహుటినా ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. వైద్యులు అతడు చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ మేరకు ఇండిగో ఇన్చార్జ్ డైరెక్టర్ ప్రబోధ్ చంద్ర శర్మ మాట్లాడుతూ...మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానే.. విమానాన్ని దారి మళ్లించినట్లు ఇండిగో ఇన్చార్జ్ డైరెక్టర్ ప్రబోధ్ చంద్ర శర్మ చెప్పారు. వాస్తవానికి సదరు ప్రయాణికుడు గుప్తా అప్పటికే మధుమేహం, తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీంతో విమానం సాయంత్రం 6.40 నిమిషలకు న్యూఢిల్లీకి చేరుకున్నట్లు తెలిపారు. ఐతే మృతుడు గుప్తా నోయిడా నివాసి అని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం తదనంతరం బంధువులకు అతని మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు చెప్పారు. (చదవండి: ఇండయన్ ఆర్మీ డే! సెల్యూట్..సైనికుడా..!) -
244 మందితో వెళ్తున్న గోవా విమానంలో బాంబు కలకలం!
అహ్మదాబాద్: మాస్కో నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. విమానంలో బాంబు ఉన్నట్లు ఫోన్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోవాకు వెళ్లాల్సిన విమానాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో మొత్తం 244 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని, బాంబు లేదని తేల్చడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. జామ్‌నగర్ నుంచి గోవాకి 11 గంటలకు విమానం బయలుదేరి వెళ్లనుంది ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపులతో నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) సిబ్బంది విమానం, లగేజ్‌ని తనిఖీలు చేశారు.‘ ఎన్ఎస్జీకి ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. విమానం చాలా పెద్దతి, తనిఖీ చేసేందుకు ఎక్కువ సమయం పట్టింది. అన్ని రకాల అధికారిక కార్యక్రమాలు పూర్తయ్యాక ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్యలో జామ్‌నగర్ నుంచి గోవాకు విమానం బయలుదేరే అవకాశం ఉంది. క్యాబిన్‌లోని మొత్తం లగేజ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.’ అని జామ్‌నగర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. #WATCH | Visuals from Jamnagar Aiport where Moscow-Goa chartered flight passengers were deboarded after Goa ATC received a bomb threat. As per airport director, Nothing suspicious found. The flight is expected to leave for Goa probably b/w 10:30 am-11 am today.#Gujarat pic.twitter.com/dRBAEucYjy — ANI (@ANI) January 10, 2023 ఇదీ చదవండి: బ్రెజిల్ అల్లర్లు: మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక -
‘హై’.. రన్ వే!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని జాతీయ రహదారిపై గురువారం చేపట్టిన విమానాల తొలి ట్రయల్ రన్ వియవంతమైంది. పిచ్చకలగుడిపాడు–రేణింగవరం గ్రామాల వద్ద 16వ నంబర్ హైవేపై 4.1 కిలోమీటర్ల పొడవు, 33 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన రన్‌వే మీదుగా విమానాలు గాల్లోకి దూసుకువెళ్లాయి. నాలుగు ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఒక కార్గో విమానం ఐదు అడుగుల ఎత్తులో తిరుగుతుండగా.. రాడార్ సిగ్నల్స్‌తో పాటు రన్‌వే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనువుగా ఉందా.. లేదా.. అనే విషయాన్ని వైమానిక దళ అధికారులు పరిశీలించారు. సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి ఎప్పటికప్పుడు సూచనలందుకుంటూ ఈ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో రన్‌వే వద్దకు చేరుకున్నారు. విమానాల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. ఉదయం 10.51 గంటలకు ప్రారంభమైన ట్రయల్ రన్ ప్రక్రియ 45 నిమిషాలపాటు జరిగింది. బాపట్ల జిల్లా పిచ్చకలగుడిపాడు–రేణంగివరం మధ్య హైవేపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ దేశంలోనే మూడవది.. వైమానిక దళ అధికారి ఆర్ఎస్ చౌదరి మాట్లాడుతూ.. ట్రయల్ రన్లో ఎలాంటి సమస్య ఎదురుకాలేదని చెప్పారు. రన్‌వేకు ఇరువైపులా ఫెన్సింగ్, గేట్లు పెట్టిన తర్వాత విమానాల ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై బాపట్ల–నెల్లూరు జిల్లాల మధ్యలో రెండు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలు సిద్ధం చేస్తున్నామన్నారు. కొరిశపాడు మండలంలోని ఈ రన్‌వే.. దక్షిణ భారతదేశంలోనే మొదటిదని.. దేశంలోనే మూడవదని చెప్పారు. వచ్చే ఏడాది దీనిని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లో ఇప్పటికే రెండు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఏపీ, యూపీ, రాజస్తాన్‌తో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, జమ్మూ కశ్మీర్‌లలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ.. ట్రయల్ రన్లో ఎలాంటి లోపాలు కనిపించలేదని తెలిపారు. కార్యక్రమంలో వాయుసేన అధికారి వి.ఎం.రెడ్డి, ప్రకాశం జిల్లా కలెక్టర్ కె.ఎస్.దినేశ్‌కుమార్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, వాయుసేన అధికారులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ఎయిర్ ల్యాండింగ్ ట్రయల్ రన్ సక్సెస్
-
హైవేపై విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ట్రయల్ రన్ సక్సెస్
మేదరమెట్ల(బాపట్ల జిల్లా): కొరిశపాడులోని పి.గుడిపాడు సమీపంలో జాతీయ రహదారిపై విమాన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు. జె.పంగులూరు మండలంలోని రేణింగివరం నుంచి కొరిశపాడు వరకు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ కారణంగా గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు ఒంగోలు వైపు నుంచి వచ్చే వాహనాలు అద్దంకి వైపునకు.. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు రేణింగివరం వద్ద నుంచి అద్దంకి వైపునకు మళ్లించారు. ట్రయల్ రన్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సీఐ రోశయ్య, భారత వైమానికి దళం గ్రూప్ కెప్టెన్ ఆర్.ఎస్. చౌదరి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మేదరమెట్ల, కొరిశపాడు ఎస్ఐలు శివకుమార్, వెంకటేశ్వరరావు, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: గుడివాడపైనే గురెందుకు? రెచ్చగొడుతున్నదెవరు? -
16 జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ఎయిర్ ల్యాండింగ్ స్ట్రిప్
-
హైవేపై విమానాల ల్యాండింగ్ ట్రయల్ రన్
జే.పంగులూరు: విజయవాడ–ఒంగోలు మధ్యనున్న జాతీయ రహదారిపై గురువారం విమానాల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అత్యవసర సమయాల్లో విమానాలు దిగేందుకు వీలుగా.. ఇప్పటికే జాతీయ రహదారిపై రెండు ప్రాంతాల్లో రన్వేలు నిర్మించారు. వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు సైతం క్షేమంగా నేలపైకి దిగడానికి వీలుగా రన్‌వేలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయగా.. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ–కలికివాయి, బాపట్ల జిల్లా రేణింగవరం–కొరిశపాడు మధ్య హైవే మీద రన్వేలు సిద్ధం చేస్తున్నారు. రేణింగవరం–కొరిశపాడు మధ్య 4 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన రన్‌వేపై గురువారం ఉదయం 11 గంటలకు కార్గో, ఫైటర్ జెట్ విమానాలు దిగనున్నాయి. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైమానిక దళ సిబ్బంది విమానాలు దిగే ప్రాంతాన్ని పరిశీలించారు. అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. రన్‌వే కోసం తారు రోడ్డును నాలుగు కిలోమీటర్ల పరిధిలో 6 మీటర్ల మేర తవ్వి.. నాలుగు లేయర్లుగా సిమెంట్ రోడ్డు వేశారు. డివైడర్లను, చుట్టుపక్కల ఉన్న చెట్లను, విద్యుత్ తీగలను తొలగించారు. -
గాల్లో ఎగిరిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్..దెబ్బకు తలకిందులుగా..
ఇద్దరు వ్యక్తులతో వెళ్తున్న సింగిల్ ఇంజిన్ విమానం క్రాష్ అయ్యి కెమెరాకు చిక్కింది. ఈ ఘటన న్యయార్క్లోని లాస్ ఏంజింల్స్లోని శాంటా మోనికా బీచ్‌లో చోటు చేసుకుంది. ఆ విమానం మోనికా విమానాశ్రయం నుంచి బయలు దేరిన తొమ్మిది నిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే విమానం ఎయర్ పోర్టఖి కొద్ది దూరంలో ఉండటంతో.. బీచ్‌లోని ఇసుక మీద తలకిందులుగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వాస్తవానికి పైలెట్ మాలిబుకు వెళ్లాలనుకున్నాడు. ఐతే విమానం పసిఫిక్ పాలిసేడ్స్ సమీపంలో ఇంజన్లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పైలెట్ శాంటా మోనికా ఎయిర్‌పోర్ట్‌కి తిరిగి రావడానికి ప్రయత్నించాడు. కానీ పీర్ సమీపంలోని బీచ్ వద్ద అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ బీచ్‌లో ల్యాండ్ చేయడమనేది మీ స్వంత అవగాహనతో చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో పైలెట్‌కి బీచ్ తీరంలోవిమానాన్ని ల్యాండ్ చేయడం కష్టమై ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఈ అనుహ్య ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులు వారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి గురించి ఇంకా తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Frank Deville (@fthemagician) -
స్పైస్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఐతే ప్రయాణికులంతా..
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఐతే ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారు. హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా కోజికోడ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం ఎస్జీ 306ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. దీంతో శుక్రవారం సాయంత్రం 6.27 నిమిషాలకు కొచ్చి విమానశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీని ప్రకటించామని చెప్పారు. తదనంతరం విమానం రాత్రి 7.19 నిమిషాలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత విమానాన్ని రన్‌వేని తనిఖీ చేసే సాధారణ కార్యకలాపాలకు అప్పగించారు. విమానాశ్రయంలో అలర్ట్ స్ట్రక్చర్ పూర్తిగా యాక్టివేట్ అవ్వడంతో ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పూర్తిగా సన్నద్ధమైందని ఎయిర్పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సుహాస్ తెలిపారు. (చదవండి: సరదాగా అలా తిరిగొద్దాం అని చెప్పి..ప్రియురాలిని చంపి, నిప్పంటించాడు) -
దేవుడు చెప్పాడని విమానం డోర్ తీసే యత్నం.. ఆకాశంలో హల్చల్
వాషింగ్టన్: విమానం గాల్లోకి ఎగిరాక చిన్న పొరపాటు జరిగినా.. పెను ప్రమాదం జరుగుతుంది. అలాంటి 37వేల అడుగుల ఎత్తుకు ఎగిరిన తర్వాత ఓ మహిళ చేసిన పనికి ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. తనకు దేవుడు చేప్పాడంటూ విమానం డోర్ తీసేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్న తోటి ప్రయాణికుడిని గాయపర్చింది. మహిళ ప్రవర్తనతో తప్పనిసరి పరిస్థితుత్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అర్కన్సాస్ తూర్పు జిల్లా కోర్టు విడుదల చేసిన పత్రాల ప్రకారం.. టెక్సాస్‌కు చెందిన 34 ఏళ్ల ఎలోమ్ అగ్బెనినో ఇటీవల ఒహియోలోని కొలంబస్ వెళ్లేందుకు టెక్సాస్ నుంచి సౌత్‌వెస్ట్ విమానం 192 ఎక్కింది. విమానం ఆకాశంలో ప్రయాణిస్తుండగా.. ఎలోమ్ తన సీటు నుంచి లేచి వెళ్లి ఎగ్జిట్ డోర్‌ను తదేకంగా చూస్తూ నిలబడింది. ఆమెను గమనించిన విమాన సిబ్బంది ఒకరు సీట్లో కూర్చోవాలని సూచించారు. అప్పుడు ఆమె తాను కిటికీ నుంచి బయటకు చూస్తానని చెప్పింది. అందుకు సిబ్బంది అంగీకరించలేదు. వెంటనే ఆమె వారిని నెట్టుకుంటూ వెళ్లి.. ఎగ్జిట్ డోర్ హ్యాండిల్ పట్టుకుని తెరిచేందుకు ప్రయత్నించింది. ‘దేవుడు నన్ను ఒహియో రమ్మన్నాడు. విమానం డోర్ తీయమని దేవుడే చెప్పాడు’ అంటూ గట్టిగా అరస్తూ హల్చల్ చేసింది. దాంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎలోమ్‌ను అడ్డుకునేందుకు తోటి ప్రయాణికుడొకరు ప్రయత్నించగా.. అతడిని ఆమె కొరికి గాయపర్చింది. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని అర్కన్సాస్‌లోని బిల్ అండ్ హిల్లరీ క్లింటన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎయిర్‌పోర్టు పోలీసులు ఎలోమ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అయితే తాను భర్తకు చెప్పకుండానే ఒహియోకు బయల్దేరినట్లు ఎలోమ్ పోలీసులు విచారణలో చెప్పింది. ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా లేనట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఐదుగురితో ప్రేమ.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన బాయ్‌ఫ్రెండ్.. కానీ! -
షాకింగ్ ఘటన: విమానం గాల్లో ఉండగానే కుప్పకూలిన మహిళ ఆ తర్వాత...
మనం రైళ్లలోనూ, బస్సుల్లోనూ వెళ్లినప్పుడూ ఎవరైనా అనారోగ్యంతోనో లేక అనుకోకుండా అపస్మారక స్థతిలోకి వెళ్లితే... బస్సు అయితే గనుక సమీపంలోని ఆస్పత్రి వద్ద ఆపడం చేస్తారు. అదే రైలు అయితే వెంటనే సమీపంలోనే రైల్వే ఆస్పత్రికి ఇన్ఫాం చేసి అంబులెన్స్‌లో తీసుకువెళ్తారు. మరీ విమానంలో అదీ కూడా గాల్లో ఎగురుతూ ఉండగా అంటే ఊహించడానికే భయంగా అనిపిస్తుంది. అచ్చం అలాంటి ఘటనే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. న్యూఢిల్లీ నుంచి పాట్నా బయలు దేరుతున్న ఇండిగో విమానంలో 59 ఏళ్ల సుమన్ అగర్వాల్ అనే మహిళ అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో తన సీటులోనే కుప్పకూలిపోయింది. దీంతో విమానాన్ని వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేయాలని పైలెట్లు నిర్ణయించుకున్నారు. కానీ ముందు ఆమెకు ప్రాథమిక చికిత్స అందిచాల్సి ఉంటుంది. దీంతో పైలెట్లు వెంటనే పాట్నా ఎయిర్ కంట్రోల్‌కి కూడా సమాచారం అందించారు. ఇంతలో నలుగురు వైద్యులు, నర్సులు సదరు మహిళను రక్షించడానికి హుటాహుటినా ఆమె వద్దకు వచ్చారు. ఆమె రక్తపోటు రికార్డు కాకపోవడం, పల్స్ కూడా కనిపించపోవడంతో ఒకింత టెన్షన్ పడ్డారు వైద్యులు. ముందుగా పేషెంట్‌కి ఆక్సిజన్ అందించారు. తదనంతరం కాన్యూలా అనే పరికరాన్ని నోటి గుండా ఆహార గొట్టంలోకి పెట్టారు. ఇది ఆస్పత్రిలోనే సాధ్యం కానీ విమానంలో ఈ పరికరాన్ని పెట్టడం అత్యంత సవాలుతో కూడిన పని అయినప్పటికీ ఆ పరికరాన్ని ఆమె శ్వాసనాళ్వ వద్దకు పెట్టి దానిగుండా డెక్సోనా, డెరిఫిలిన్ల వంటి మందులను వేయడమే గాక తక్షణమే శక్తి వచ్చే గ్లూకోజ్ వాటర్‌ను కూడా ఇచ్చారు. దీంతో ఆమె స్ప్రుహలోకి వచ్చింది. ఆ తర్వాత విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ నిమిత్తం దాదాపు 7.45కు పాట్నా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సిన విమానాన్ని సుమారు 25 నిమిషాల ముందు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. తదనంతరం ఆమెను అంబులెన్స్‌లో పరాస్ హెచ్ఎంఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ భర్త ప్రమోద్ అగర్వాల్ ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. (చదవండి: ఈ రెస్టారెంట్ బిల్ చూస్తే....వాట్? అని నోరెళ్లబెడతారు!) -
ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం!
కోల్‌కతా: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురైన క్రమంలో విమానాన్ని కోల్‌కతాకు మళ్లించినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. విమానంలో మొత్తం 159 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. ‘కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఓ ప్రయాణికుడు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బుధవారం సాయంత్రం 4.50 గంటల నుంచి 6.50 గంటల పాటు సుమారు 159 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో నిరీక్షించాల్సి వచ్చింది. ఆ తర్వాత విమానం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ’ అని తెలిపారు కోల్‌కతా విమానాశ్రయ అధికారులు. ఇదీ చదవండి: ‘2020లో సీట్లు తక్కువొచ్చినా సీఎం పదవి’.. బీజేపీ విమర్శలపై నితీశ్ క్లారిటీ -
హైదరాబాద్ విమానం పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఏం జరిగింది?
ఇస్లామాబాద్: భారత్‌కు చెందిన 12 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ చార్టర్ ఫ్లైట్ పాకిస్థాన్, కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఆ విమానం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కరాచీలో దిగినట్లు అంతర్జాతీయ మీడియాలు వెల్లడించాయి. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే 12 మంది ప్రయాణికులను మరో ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. అయితే, కరాచీలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు గల కారణాలు తెలియరాలేదు. విమానం ల్యాండింగ్‌ను భారత పౌర విమానయాన సంస్థ(సీఏఏ) ధ్రువీకరించింది. అంతర్జాతీయ ఛార్టర్ ఫ్లైట్ భారత్ నుంచే వెళ్లిందని, ఆ తర్వాత సంబంధాలు తెగిపోయినట్లు పేర్కొంది. గత నెలలో సాంకేతిక సమస్యలతో రెండు విమానాలు కరాచీలో దిగిన తర్వాత ఈ ఛార్టర్ విమానం ల్యాండింగ్ అయింది. అంతకు ముందు స్పైస్‌జెట్ ఢిల్లీ-దుబాయ్ విమానం జులై 5న కరాచీకి మళ్లించారు. అలాగే.. షార్జా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మరో విమానం జులై 17న కరాచీలో దిగింది. ఇదీ చదవండి: భారత్ హెచ్చరికలు బేఖాతరు.. శ్రీలంక చేరిన చైనా ‘స్పై షిప్’ -
ఎమర్జెన్సీ ల్యాండింగ్ టైంలో అనూహ్య ఘటన!... దూకేశాడా? పడిపోయాడా!
న్యూయార్క్: యూఎస్‌లోని నార్త్ కరోలినాలో ఒక విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో కో పైలెట్ కిందపడి మృతి చెందాడు. ఐతే అతను విమానం అత్యవసర ల్యాండింగ్ టైంలో దూకేశాడా? లేక ప్రమాదవశాత్తు పడిపోయాడా అనేది తెలియరాలేదు. ఒకవేళ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో పారాచూట్ లేకుండా ఎలా దూకేశాడు అంటూ అధికారులు పలు అనుమానాలు లేవనెత్తారు. మృతి చెందిన సదరు కోపైలెట్ 23 ఏళ్ల చార్లెస్ హ్యూ క్రూక్స్‌గా గుర్తించారు అధికారులు. అతడి మృతదేహం విమానాశ్రయానికి దక్షిణంగా సుమారు 48 కిలోమీటర్లు దూరంలో లభించిందని అధికారులు తెలిపారు. అంతేకాదు విమానంలో మరో పైలెట్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ, నేషనల్ సేఫ్టి బోర్డు ఈ ఘటనకు గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రమాదానికి ముందు విమానం కుడివైపు ఉన్న చక్రం కోల్పోవడంతో పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాయం కోరినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: సముద్రంలో తెల్లటి చుక్కల్లా....జెల్లీ ఫిష్ సముహం) -
కాలిన వాసనతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 48 గంటల్లో నాలుగోది!
ఢిల్లీ: కాలికట్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు అధికారులు. విమానం క్యాబిన్‌తో పాటు ప్రయాణికులు ఏదో కాలిపోతున్నట్లు వస్తున్న వాసనను గుర్తించారు. దీంతో బీ737-800 ఎయిర్‌క్రాఫ్ట్ వీటీ-ఏక్స్ఎక్స్ అనే విమానాన్ని అత్యవసరంగా మస్కట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. మరోవైపు.. మస్కట్‌లో విమానం ల్యాండింగ్ చేసిన తర్వాత పరిశీలించగా.. ఎలాంటి మంటలు, పొగ, లీకేజీలు కనిపించలేదని అధికారులు తెలిపారు. 'కాలిన వాసన వచ్చిన నేపథ్యంలో విమానాన్ని క్షణ్నంగా పరిశీలించాం. రెండు ఇంజిన్లతో పాటు ఏపీయూ యూనిట్‌లోనూ ఎలాంటి మంటలు, పొగ, కనిపించలేదు. ఇంధనం, ఆయిల్, హైడ్రోజన్ లీకైనట్లు సైతం కనిపించలేదు.' అని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రన్ వేపై విమానాన్ని అన్ని విధాల పరీక్షించినట్లు చెప్పారు. 48 గంటల్లో నాలుగో సంఘటన.. సాంకేతిక సమస్యలతో విమానాన్ని దారి మళ్లించటం ఒకే రోజులో ఇది రెండో సంఘటన కావటం గమనార్హం. అయితే.. 48 గంటల్లో ఇది నాలుగో సంఘటన. ఆదివారం ఉదయం ఓ ఇండిగో విమానాన్ని అత్యవసరంగా పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. యూఏఈలోని షార్జా నుంచి హైదరాబాద్ రావాల్సిన ఈ విమానంలో మార్గ మధ్యలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా కరాచీలో దించారు. భారత్‌కు చెందిన ఓ విమానం పాక్‌లో ల్యాండ్ కావడం గడిచిన రెండు వారాల్లో ఇది రెండోసారి. జులై 16న ఎథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అడిస్ అబాబా నుంచి బ్యాంకాక్‌కు వెళ్తుండగా.. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. జులై 15న శ్రీలంకకు చెందిన విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా దించాల్సి వచ్చింది. ఇదీ చూడండి: Indigo Flight Emergency Landing: కరాచీ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ -
షార్జా నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానం.. కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
కరాచీ: షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఎమర్జెన్సీగా ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. విమానంలోని ప్రయాణికులందరినీ మరో విమానంలో తరలించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసింది. 'షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం 6E-1406ను కరాచీ వైపు మళ్లించాం. సాంకేతిక సమస్య తలెత్తిందని గుర్తించి పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానంలోని ప్రయాణికులను కరాచీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మరో విమానాన్ని పంపిస్తాం.' అని ఇండిగో ప్రకటనలో తెలిపింది. రెండు వారాల వ్యవధిలోనే భారత్‌కు చెందిన రెండు విమానాలు కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ కావడం గమనార్హం. జులై5న న్యూఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం కూడా సాంకేతిక సమస్య వల్ల కరాచీలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. కొన్ని గంటల పాటు అక్కడే ఉంది. -
కరాచీలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
శ్రీలంక విమానంలో సాంకేతిక లోపం: చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, చెన్నై: శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నై నుంచి కొలంబోకు బయలు దేరిన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో ఈ రోజు (జూలై 15) ఉదయం చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణీకులు అంతా క్షేమంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. కొలంబో-చెన్నై విమానం (UL121)లో లోపాన్ని గుర్తించిన వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం ఇచ్చారు. దీంతో అత్యవసర ప్రోటోకాల్ ప్రకారం రన్‌వే వద్ద విమానాన్ని ల్యాండ్ చేశారని చెన్నై విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వల్ల చెన్నై నుంచి వచ్చే ఏ ఇతర సర్వీసులపై ఎలాంటి ప్రభావం పడలేదని వెల్లడించాయి. కాగా ద్వీప దేశం శ్రీలంక ఆర్థిక రాజకీయ సంక్షభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశ ఆర్థిక మాంద్యంపై సామూహిక నిరసనల మధ్య శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశంవిడిచిపోవంతో మరింత తీవ్ర గందర గోళ పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. -
నడి రోడ్డు పై ల్యాండ్ అయిన విమానం: వీడియో వైరల్
ఇటీవల కాలంలో పైలెట్లు విమానాలను దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిన లేక ఏదైన ప్రమాద సంభవిస్తుందన్న అనుమానం వచ్చినా పైలెట్లు విమానాన్ని అత్యవసరంగా సురకక్షితమైన ప్రదేశంలో దించేస్తారు. అచ్చం అలానే ఇక్కడొక పైలెట్ కూడా విమానాన్ని అత్యవసర ల్యాండిగ్ చేశాడు గానీ, అదీ కూడా రద్దీగా ఉండే హైవే పై ల్యాండ్ చేయడం విశేషం. వివరాల్లోకెళ్తే...యూఎస్‌లోని నార్త్ కరోలినాలో వాహనాల రద్దీ మధ్య ఒక విమానం ల్యాండ్ అయ్యింది. విన్సెంట్ ఫ్రేజర్ అనే పైలెట్ తన మామతో కలిసి స్వైన్ కౌంటీలోని ఫోంటాన్ లేక్ నుంచి సింగిల్ ఇంజన్ విమానాన్ని నడుపుతున్నాడు. ఐతే అకస్మాత్తుగా ఇంజన్ పనిచేయడం మానేయడం మొదలైంది. దీంతో అతను సమీపంలోని హైవే పై సురకక్షితంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఫ్రేజర్ గతేడాదే పైలెట్‌గా లైసెన్సు పొందాడు. ఫ్లోరిడాకు చెందిన మెరైన్ అనుభవజ్ఞుడు, కానీ అతనికి 100 గంటలకు పైగా విమానన్ని నడపగల అనుభవం మాత్రం లేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. WATCH: New video shows a plane making an emergency landing on a Swain County highway Sunday morning. Hear from the pilot tonight on @WLOS_13 at 5 & 6! Video courtesy of Vincent Fraser. pic.twitter.com/hcxOGUUGgP — Andrew James (@AndrewJamesNews) July 7, 2022 (చదవండి: నాలాగే ఒంటరిగా ఉండండి!... అంటూ పిలుపునిచ్చిన మంత్రి!) -
స్పైస్‌జెట్‌కు ఏమైంది?.. రాడార్ సమస్యతో వెనక్కి వచ్చిన కార్గో విమానం
కోల్‌కతా: గతకొన్ని రోజులుగా విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఘటనలతో.. స్పైస్‌జెట్‌కు ఏమైంది అనే ప్రశ్నలు ప్రతిఒక్కరిలోనూ లేవనెత్తుతున్నాయి. గడిచిన మూడు వారాల వ్యవధిలో 8 స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు వెలుగు చూశాయి. ఒక్క మంగళవారం రోజే రెండు విమానల్లో భద్రత సమస్యలు ఏర్పడి అత్యవసర ల్యాండింగ్ చేయగా.. తాజాగా కల్‌కతా నుంచి చైనా బయలుదేరిన స్పైస్‌జెట్ కార్గో విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. స్పైస్‌జెట్ బోయింగ్ 737 కార్గో విమానం జూలై అయిదో తేదీన కోల్‌కతా నుంచి ఛాంగ్‌క్వింగ్ వెళ్లాల్సి ఉంది. కోల్‌కతా నుంచి టేకాఫ్ అయిన తరువాత విమనాంలో వాతావరణ రాడార్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి కోల్‌కతాకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కతాలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. చదవండి: ముంబైలో మరో స్పైస్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. గత 17 రోజుల్లో ఏడు ఘటనలు కాగా ఈ ఘటన కంటే ముందు ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని దారి మళ్లించి కరాచి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. స్పైస్‌జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతోనే కరాచికి మళ్లించారు. అంతేగాక గుజరాత్‌లోని కాండ్లా నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ పగలడంతో ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. -
ముంబైలో మరో స్పైస్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. గత 17 రోజుల్లో ఏడు ఘటనలు
ముంబై: ఇటీవల స్పైస్ జెట్ విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. గత 17 రోజుల్లో స్పైస్ జెట్‌లో భద్రత సమస్యల కారణంగా ఆరు ఘటనలు చోటుచేసుకోగా తాజాగా గుజరాత్‌లోని కాండ్లా నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం మంగళవారం ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ పగలడంతో ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ‘గుజరాత్‌లోని కాండ్లా నుంచి SG 3324ను నడుపుతున్న స్పైస్ జెట్ Q400 విమానం గాల్లో విహారం చేస్తున్న సమయంలో P2 వైపు విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ పగిలింది. విమానం సురక్షితంగా ముంబయిలో ల్యాండ్ అయింది' అని స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు. కాగా ఒకే రోజు స్సైస్‌జెడ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వడం ఇది రెండో ఘటన. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లే మరో స్సైస్‌జెట్ విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడింది. ఇంధన సూచిక సరిగా పనిచేయకపోవడంతో కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. చదవండి: స్పైస్ జెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్ On 5th July, 2022, SpiceJet Q400 aircraft was operating SG 3324 (Kandla - Mumbai). During cruise at FL230, P2 side windshield outer pane cracked. Pressurization was observed to be normal. The aircraft landed safely in Mumbai: SpiceJet Spokesperson pic.twitter.com/DYypQXmTyk — ANI (@ANI) July 5, 2022 -
క్యాబిన్లో పొగలు: స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి,ఢిల్లీ: ప్రైవేటురంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో పొగలు అలుముకోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే సిబ్బంది వెంటనే అప్రమత్త మయ్యారు. తక్షణమే విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. #WATCH | A SpiceJet aircraft operating from Delhi to Jabalpur returned safely to the Delhi airport today morning after the crew noticed smoke in the cabin while passing 5000ft; passengers safely disembarked: SpiceJet Spokesperson pic.twitter.com/R1LwAVO4Mk — ANI (@ANI) July 2, 2022 ఢిల్లీ నుంచి జబల్పూర్కు వెళుతున్న విమానంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లోకి ఎగిరి, సుమారు 5వేల అడుగుల ఎత్తుకు చేరిన తరువాత క్యాబిన్లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీన్ని గమనించిన పైలట్లు, సిబ్బంది వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు. దీంతో ప్రమాదం తప్పింది. ప్రయాణీ కులందరూ సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. SpiceJet: On July 2 @flyspicejet Q400 aircraft was operating SG-2962 (Delhi-Jabalpur). While passing 5000ft, the crew noticed smoke in the cabin. The pilots decided to return back to Delhi. Aircraft landed safely & passengers were safely disembarked. pic.twitter.com/N6cu7kFj0e — Poulomi Saha (@PoulomiMSaha) July 2, 2022 -
సముద్రంలో ఓఎన్జీసీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి,ముంబై: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ)కి చెందిన హెలికాప్టర్ ముంబైలోని అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. 9 మంది వ్యక్తులతో ప్రయాణిస్తున్న (ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు) హెలికాప్టర్లో లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చిందని ఓఎన్జీసీ ట్వీట్ చేసింది. అయితే సాగర్ కిరణ్ రెస్క్యూ బోటు ద్వారా ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలతో బయటపడగా, మిగిలిన వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. #Helicopter carrying 7 passengers & 2 pilots makes emergency landing in #Arabian Sea near #ONGC rig Sagar Kiran in #Mumbai High. Four rescued. Rescue operations in full swing. @HardeepSPuri @Rameswar_Teli @PetroleumMin — Oil and Natural Gas Corporation Limited (ONGC) (@ONGC_) June 28, 2022 ముంబైలో సాగర్ కిరణ్ వద్ద రిగ్ సమీపంలో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లతో కూడిన హెలికాప్టర్ అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని కంపెనీ ఒక ట్వీట్లో తెలిపింది. ఇప్పటి వరకు నలుగర్ని రక్షించామని ట్వీట్ చేసింది. ఆ తరువాత రెస్క్యూ బోట్ మరో ఇద్దరిని రక్షించారు. రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా ఇంటర్నేషనల్ సేఫ్టీ నెట్‌ను యాక్టివేట్ చేశామని, ఇండియన్ నేవీ, ఓఎన్జీసీ సమన్వయంతో పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. మరో నౌక ముంబై నుంచి సహాయక చర్యల్లో నిమగ్నమైందన్నారు. -
త్వరలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు పూర్తి
సింగరాయకొండ: వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ల నిర్మాణాలను త్వరలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నట్టు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు. జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ వద్ద, బాపట్ల జిల్లాలోని కొరిశపాడు–రేణంగివరం మధ్యలో ఏర్పాటు చేసిన విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్లను జాతీయ రహదారి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. సింగరాయకొండ వద్ద పరిశీలన సందర్భంగా మాగుంట మాట్లాడుతూ విమానాల ల్యాండింగ్ ప్రాజెక్టులు దేశంలో 13 మంజూరు కాగా, వాటిలో ప్రకాశం జిల్లా పరిధిలో ఒకటి, బాపట్ల జిల్లా పరిధిలో మరొకటి ఉన్నాయని, ప్రస్తుతం ఈ రెండూ చివరి దశలో ఉన్నాయన్నారు. సింగరాయకొండ వద్ద గల ప్రాజెక్టుకు అదనంగా 8.50 ఎకరాల స్థల సేకరణ చేయాల్సి ఉందని, అదనంగా సిమెంటు రోడ్లు నిర్మించాల్సి ఉందని ఎంపీ మాగుంట తెలిపారు. అందుకు రూ.40 కోట్ల అదనపు బడ్జెట్ అవసరమన్నారు. నిధుల మంజూరుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్టు చెప్పారు. ప్రధాని కార్యాలయం నుంచి అందిన ఆదేశాల ప్రకారం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టేందుకు ఎయిర్‌ఫోర్స్, జాతీయ రహదారి అధికారులు, పైలెట్లు వచ్చినట్టు తెలిపారు. సింగరాయకొండ ప్రాజెక్టు నిర్మాణంలో మలుపులుండటంతో ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, అయితే ఈ ప్రాజెక్టు వెనక్కి పోకుండా పూర్తి చేసేందుకు జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ కొన్ని సూచనలు చేశారని, అందుకు ఎయిర్‌ఫోర్స్ అథారిటీ అధికారులు కూడా ఆమోదం తెలిపారని మాగుంట వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్ అథారిటీకి చెందిన వీఎం రెడ్డి, అశోక్‌బాబు, ఆర్ఎస్ చౌదరి, వినోద్‌వాన్యా, ఆదిత్యదేశ్, జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ గోవర్దన్, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
చావు నుంచి త్రుటిలో తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్
ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రెవిస్ హెడ్, అతని భార్య జెస్సికా డేవిస్ తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో చావు అంచుల దాకా వెళ్లి వచ్చారు. కాగా ట్రెవిస్ హెడ్ భార్య ఆరు నెలల గర్భవతి. హాలిడే వెకేషన్‌ను ఎంజాయ్ చేయడానికి ట్రెవిస్ హెడ్.. జెస్సీకా డేవిస్‌తో కలిసి మాల్దీవ్స్ వెళ్లాడు. అక్కడ సరదాగా గడిపిన వీరిద్దరు ఆదివారం ఆస్ట్రేలియాకు తిరుగుపయనమయ్యారు. ఇంకో 45 నిమిషాల్లో గమనం చేరుకుంటుదన్న దశలో ఫ్లైట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని భావించాడు. అయితే మొదటి ప్రయత్నంలో ఫ్లైట్‌ను ల్యాండింగ్ చేయడంలో విఫలమయ్యాడు. రెండో ప్రయత్నంలో ల్యాండింగ్ చేసినప్పటికీ స్లిడ్ అయిన ఫ్లైట్ పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయింది. అయితే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని ట్రెవిస్ హెడ్ భార్య జెస్సీకా డేవిస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ''హాలిడే వెకేషన్‌ను సరదాగా గడిపాం. ఆస్ట్రేలియాకు తిరుగపయనమవ్వడానికి మాల్దీవ్స్‌లో ఫ్లైట్ ఎక్కాం. గంట ప్రయాణంలో 30 నిమిషాలు పూర్తైన తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. దేవుని దయవల్ల మాకు ఏం కాలేదు. నా బిడ్డ ఈ లోకాన్ని చూడకుండానే చనిపోతానేమోనని అనిపించింది. ఆ తర్వాత నాలుగు గంటల పాటు రెస్క్యూ ప్లేన్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత మాల్దీవ్స్ రాజధాని మాలీలో మాకు వసతి ఏర్పాటు చేసి మరో ఫ్లైట్‌లో ఆస్ట్రేలియాకు తీసుకొచ్చారు.'' అని చెప్పుకొచ్చింది. ఇక ట్రెవిస్ హెడ్ ఆస్ట్రేలియా తరపున 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆసీస్ తరపున 26 టెస్టులు, 45 వన్డేలు, 17 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: Yuvraj SIngh: కొందరు పగబట్టారు.. అందుకే టీమిండియా కెప్టెన్ కాలేకపోయా! -
ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం.. పాకిస్తాన్లో అత్యవసర ల్యాండింగ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ నుంచి దోహాకు బయలుదేరిన ఖతార్ ఎయిర్వేస్ విమానం అత్యవసరంగా పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యింది. ఖతార్ ఎయిర్వేస్ క్యూఆర్-579 విమానంలో పొగలు రావడంతో కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి దోహాకు బయలుదేరిన ఖతార్ ఎయిర్వేస్ క్యూఆర్-579 విమానం కార్గో విభాగం నుంచి పొగలు వచ్చాయి. దీంతో విమానాన్ని అత్యవసరంగా పాకిస్తానలోని కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, సోమవారం తెల్లవారుజామున 3.20కి ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం ఉదయం 5.30 గంటలకు కరాచీలో ల్యాండ్ అయింది. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే విమానంలో ప్రయాణిస్తున్న 283 మందిని మరో విమానంలో దోహాకు తరలించినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. విమానంలో పొగలు రావడంపై సదరు ఖతార్ ఎయిర్వేస్ సంస్థ స్పందించింది. ఈ సమస్య తలెత్తడంపై దర్యాప్తు చేపట్టినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌తో మిగతా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. -
నా డ్యూటీ ముగిసింది!..ఎమర్జెన్సీ ల్యాడింగ్ తర్వాత పైలెట్ ఝలక్
విమానాలను వాతావరణ పరిస్థితుల రీత్యా లేక సాంకేతిక లోపం కారణంగానో ఒక్కోసారి అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వారికి హోటల్ వసతి కూడా ఏర్పాటు చేయడమో లేక మరో విమానంలో పంపించడమో జరుగుతుంది. అయితే ఇక్కడోక పైలెట్ మాత్రం అత్యవసర ల్యాండిగ్ తర్వాత తన డ్యూటీ ముగిసిందంటూ ...విమానాన్ని కొనసాగించాడానికి నిరాకరించాడు. అసలు విషయంలోకెళ్తే...రియాద్ నుండి ఇస్లామాబాద్‌కు వెళ్లాల్సిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) ప్రతికూల వాతావరణం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ మేరకు ఎయిర్‌లైన్స్ సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత పైలెట్ తన షిఫ్ట్ అయిపోయిందని చెప్పి విమానాన్ని కొనసాగించడానికి నిరాకరించాడు. అంతే ప్రయాణికులు ఆగ్రహంతో నిరసనలు చేయడం ప్రారంభించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ మేరకు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు దమ్మామ్ విమానాశ్రయ భద్రతాధికారులను రంగంలోకి దిగింది. ఈ మేరకు చిక్కుకుపోయిన ప్రయాణీకులకు పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌కు చేరేవరకు హోటల్లోనే వసతి కల్పించారు. అయితే విమాన భద్రత దృష్ట్యా పైలెట్ విశ్రాంతి తీసుకోవాలని, పైగా ప్రయాణికులందరూ ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకునేంతవరకు వారికి హోటళ్లలో అన్నిరకాల వసతులు ఏర్పాటు చేశాం అని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మీడియాకి తెలిపారు. (చదవండి: ఆ వ్యక్తి 67 ఏళ్లుగా స్నానమే చేయలేదట!. అతని ఆహారం ఏమిటో తెలుసా?) -
‘గో ఫస్ట్’ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
నాగ్‌పూర్: బెంగళూరు నుంచి పట్నాకు శనివారం ఉదయం బయలుదేరిన విమానం ఇంజిన్‌లో లోపం తలెత్తడంతో నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. గో ఫస్ట్ విమానయాన సంస్థకు చెందిన ఆ విమానంలోని మొత్తం 139 ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ‘గో ఫస్ట్ విమానం ఇంజిన్ ఒకదానిలో లోపం తలెత్తినట్లు గమనించిన పైలట్ వెంటనే నాగ్‌పూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను సంప్రదించాడు. పరిస్థితి వివరించి, అధికారుల సాయం కోరాడు’ అని నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ అబిడ్ రుహి తెలిపారు. ల్యాండ్ అయ్యాక ప్రయాణికులను మధ్యాహ్నం మరో విమానంలో గమ్య స్థానాలకు చేర్చారు. -
రహదారులే రన్వేలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానం జాతీయ రహదారిపై అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం రాజస్తాన్‌లోని బర్మేర్ జిల్లాలో జాతీయ రహదారి–925ఏపై సిద్ధం చేసిన సట్టా–గాంధవ్ స్ట్రెచ్‌ను కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఐఏఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అభివృద్ధి చేసిన మొట్టమొదటి రహదారి ఇదే. యుద్ధ విమానాలను అత్యవసర పరిస్థితుల్లో క్షేమంగా నేలపైకి దించడానికి వీలుగా కొన్ని జాతీయ రహదారుల్లో మార్పులు చేస్తున్నట్లు కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. సట్టా–గాంధవ్ స్ట్రెచ్‌ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) 19 నెలల్లో అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్నా«థ్‌సింగ్, గజేంద్రసింగ్ షెకావత్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్ఎస్ బదౌరియాలతో కూడిన సి–130జే యుద్ధ విమానం ఈ స్ట్రెచ్‌పై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. వాయుసేన ఈ డ్రిల్‌ను చేపట్టింది. అనంతరం సుఖోయ్–30ఎంకేఐ ఫైటర్ జెట్, ఏఎన్–32 మిలటరీ రవాణా విమానం, ఎంఐ–17వీ5 హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు మార్గాల్లో.. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఈ తరహా స్ట్రెచ్ నిర్మించడం ద్వారా దేశ ఐక్యత, వైవిధ్యం, సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ఎంత ఖర్చయినా వెనకాడం అనే సందేశాన్ని ఇచ్చినట్లు అయ్యిందని రక్షణ మంత్రి రాజ్నా«థ్ అన్నారు. ఎన్నో హెలిప్యాడ్ల నిర్మాణంలో జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. రోడ్లపై అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం యుద్ధ సమయాల్లోనే కాకుండా విపత్తుల సమయంలోనూ ఉపకరిస్తుందని తెలిపారు. రక్షణపరమైన మౌలిక సదుపాయాల బలోపేతంలో ఇదొక ముఖ్యమైన అడుగు అని అభివర్ణించారు. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... సైన్యానికి జాతీయ రహదారులు సైతం ఉపకరించడం దేశాన్ని మరింత సురక్షితం చేస్తుందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు–ఒంగోలు, ఒంగోలు–చిలకలూరిపేట మార్గాలను ఈ దిశగా అభివృద్ధి చేయనున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో కొరిశపాడు ఫ్లైఓవర్ నుంచి రేణంగివరం ఫ్లైఓవర్ వరకు రన్‌వే నిర్మాణంలో ఉంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం సట్టా–గాంధవ్ మార్గంతోపాటు గగారియా–బఖాసర్ మార్గాన్ని రూ.765.52 కోట్లతో అభివృద్ధి చేశారు. అత్యవసర సమయాల్లోనే విమానాల ల్యాండింగ్ కోసం ఉపయోగిస్తారు. దీంతోపాటు కుందన్‌పురా, సింఘానియా, బఖాసర్‌లో మూడు హెలిప్యాడ్లను నిర్మించారు. తొలిసారిగా 2017 అక్టోబర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్లు, రవాణా విమానాలను ప్రయోగాత్మకంగా లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ మార్గంపై అత్యవసర ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికవాయ జంక్షన్ వద్ద సిద్ధమవుతున్న రన్‌వే -
దారి మళ్లిన లంకేయుల విమానం.. భారత్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
న్యూఢిల్లీ: శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయానిస్తున్న ప్రత్యేక విమానం భారత్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ముగించుకుని స్వదేశానికి బయల్దేరిన లంక జట్టు.. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారు ప్రయానిస్తున్న విమానాన్ని ఇంధన సమస్య తలెత్తడంతో హఠాత్తుగా భారత్‌లో దించాల్సి వచ్చింది. దీంతో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఆందోళన చెందారు. ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్ మైక్ ఆర్థర్ వెల్లడించారు. విమానం భారత్‌లో ల్యాండ్ కాగానే ఫోన్ ఆన్ చేశానని, ఇంగ్లండ్ ఆపరేషన్స్ మేనేజర్ వేన్ బెంట్లీ నుంచి తనకు కొన్ని సందేశాలు వచ్చాయని, పరిస్థితి గురించి అతను అందులో వివరించాడని మైక్ పేర్కొన్నారు. కాగా, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీసు కోసం ఇంగ్లండ్‌లో పర్యటించిన లంక జట్టు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓటమి పాలై ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న ఆతిధ్య ఇంగ్లండ్ జట్టు, వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని లంక జట్టును క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్ ముగిసిన అనంతరం లంక జట్టు స్వదేశానికి బయల్దేరింది. ఈ క్రమంలోనే వారు ప్రయానిస్తున్న విమానం అనూహ్యంగా భారత్‌లో ల్యాండైంది. ఇదిలా ఉంటే, ఈ నెల 13 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉంది. ఇటీవల ఇంగ్లండ్ క్రికెటర్లు కరోనా బారిన పడటంతో, లంక క్రికెటర్లు కూడా ఐసోలేషన్‌లోని వెళ్లాల్సి వస్తుంది. దీంతో భారత్‌తో సిరీస్ షెడ్యూల్ మారే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 13న జరుగనుండగా..జులై 16న రెండో వన్డే, 18న మూడో వన్డే జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా. -
గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, కృష్ణా జిల్లా: ఇండిగో విమానంలో ఓ మహిళ అస్వస్థతకు గురవడంతో గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర లాండింగ్ చేశారు. బెంగుళూరు నుండి బాగ్ డోగ్ర వెళ్లే విమానంలో మహిళా ప్రయాణికురాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానాశ్రయం నుండి అంబులెన్స్ సాయంతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చదవండి: కరోనా కట్టడి చర్యలపై దుష్ఫ్రచారం.. ఏపీ సర్కార్ సీరియస్ రూ.కోట్ల ఆస్తులు ఉన్నా.. అనాథే..! -
టైర్ ఊడినా విమానం క్షేమంగా దిగింది!
-
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తప్పిన ప్రమాదం
కేరళ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కాలికట్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కార్గో కంపార్ట్మెంట్లో ఫైర్ హెచ్చరిక రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమాన ఫైలట్ విమానాన్ని కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా అధికారులు ప్రకటించారు. విమానంలో 17మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులకు, సిబ్బందికి ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ( చదవండి: విమానంలో బిత్తిరి చర్య.. బట్టలిప్పి మరీ రచ్చ ) An Air India Express flight made an emergency landing at Kozhikode, Kerala following fire warning in Cargo compartment. pic.twitter.com/1kqcR3YNio — ANI (@ANI) April 9, 2021 -
వైరల్: విమానంలో పిల్లి రచ్చ.. పైలట్‌పై దాడి
ఓ పిల్లి విమానంలోకి ఎలా చొరబడిందో తెలియదు గానీ రచ్చ రచ్చ చేసింది. ఏకంగా కాక్‌పిట్‌లో దూరి పైలట్‌పైనే దాడి చేసి ముప్పుతిప్పలు పెట్టింది. ఆ పిల్లి చూపించిన నరకానికి ఏం చోయాలో తెలియగా చివరికి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విచిత్ర సంఘటన బుధవారం సూడాన్ జరిగింది. సుడాన్ రాజధాని ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఖతార్ రాజధాని దోహాకు వెళ్లవలసిన ఈ విమానం షెడ్యూల్ ప్రకారమే బయలుదేరింది. కానీ విమానం టేకాఫ్ అయిన అరగంటకే ఓ పిల్లి హడావిడి చేసింది. స్టొవవే ఫిలైన్ జాతికి చెందిన ఈ పిల్లి విమానంలోకి ఎలా వచ్చిందో తెలియదు గానీ కాక్‌పిట్‌లో పైలెట్, సిబ్బందిపై దాడి చేసింది. దాన్ని పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాకపోవడంతో విమానం యూటర్న్ తీసుకొని సుడాన్ రాజధాని నగరమైన ఖార్టూమ్‌లోనే మరలా దిగాల్సి వచ్చింది. అయితే ఇందులోని ప్రయాణికులంతా సురక్షింతంగానే ఉన్నారు. ఇంతకీ విమానంలోకి పిల్లి ఎలా ప్రవేశించిందో ఇప్పటికీ అధికారులకు అంతుపట్టడం లేదు. ఒకవేళ ఫ్లైట్‌ను ముందురోజు రాత్రి విమానాశ్రయంలో ఉంచినప్పుడు చొరబడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ విమానం ప్రయాణానికి ముందు రోజు రాత్రి అదే విమానాశ్రయంలో ఒక హ్యాంగర్ దగ్గర హాల్ట్‌లో ఉంది. ఇలా ఆగి ఉన్న సమయంలో ఈ పిల్లి విమానంలోకి వెళ్లి ఉంటుందని, లేదా లేదంటే ఇంజనీరింగ్ చెక్ చేసేటప్పుడో ఈ పిల్లి ఎవ్వరి కంటా పడకుండా ఆన్ బోర్డ్లోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఓ జంతువు కారణంగా మధ్య గాలి గందరగోళానికి ఒక దొంగ జంతువు కారణం కావడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా అహ్మదాబాద్ నుండి జైపూర్‌కు ప్రయాణించాల్సిన గో ఎయిర్ విమానంలోకి రెండు పావురాలు ప్రవేశించాయి. వీటి కారణంగా విమానం సుమారు 30 నిమిషాలు ఆలస్యం అయ్యింది. చదవండి: ‘నేనేం పిల్లిని కాను’: జూమ్ యాప్‌లో ఫన్నీ ఘటన మొబైల్లో మంత్రాలు.. ఆలయంలో పెళ్లి -
అత్యవసర మళ్లింపు.. ఫలితం లేకపోయింది: ఇండిగో
న్యూఢిల్లీ: షార్జా నుంచి లక్నోకు వెళుతున్న ఇండిగో ఎయిర్‌లైన్ విమానాన్ని అత్యవసర పరిస్థితుల నిమిత్తం కరాచీకి మళ్లీంచారు. ఫైట్ 6E 1412 మంగళవారం షార్జా నుంచి లక్కోకు బయలుదేరింది. ఈ క్రమంలో ఓ ప్యాసింజర్ అస్వస్థతకు గురికావడంతో అత్యవసర వైద్య పరీక్షల నిమిత్తం ప్లైట్‌ను కరాచీకి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికి ఫలితం లేకపోయిందని, అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు ఎయిర్‌పోర్టు వైద్యులు ధృవీకరించారని ఇండిగో ఎయిర్‌లైన్ సంస్థ వెల్లడిచింది. అయితే ప్యాసింజర్ వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. -
విమానంలో భారీగా మంటలు.. వీడియో వైరల్
వాషింగ్టన్ : అమెరికాలో త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఇంజిన్‌లో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. విమానం నుంచి శకలాలు విరిగి నేలపైన పడ్డాయి. అయితే అప్రమత్తమైన పైలట్లు ఫ్లైట్‌ను సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోయింగ్ 777-200 విమానం 231 మంది ప్రయాణికులు, 10మంది సిబ్బందితో హోనొలులు బయలుదేరింది. ఈ క్రమంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. విమానంలో మంటలు చెలరేగి శకలాలు విరిగిపడ్డాయి. బ్రూమ్‌ఫీల్డ్, కొలరాడోలోని పలు నివాస ప్రాంతాల్లో ఇంజిన్ కౌలింగ్, టర్ఫ్ ఫీల్డ్‌లోని భాగాలను అధికారులు గుర్తించారు. అలాగే విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరస్‌లా మారింది. విమానంలో మంటల ఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ స్పందించింది. విమాన సిబ్బంది చొరవతో ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొంది. ‘ డెన్వర్ విమానాశ్రయం నుంచి యూనైటెడ్ ఫ్లైట్ 328 విమానం టేకాప్ అయిన కొద్ది నిమిషాలకే ఇంజన్లో మంటలు చెలరేగాయి. పైలట్లు అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు.కారణాలు తెలుసుకునేందు ఎఫ్ఏఏ(FAA), ఎన్టీఎస్బీ(NTSB)తో విచారణ జరిపిస్తున్నాం’అని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ట్వీట్ చేసింది. -
లవర్ మీద కోపం ఉంటే ఇలా చేస్తారా?
బీజింగ్ : విమానంలో ప్రయాణిస్తున్న 29 ఏళ్ల మహిళ మద్యం మత్తులో విమానం కిటికీని పగలకొట్టడంతో పైలట్ అత్యవసరంగా విమానం ల్యాండ్ చేసిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వారం కిందట చోటుచోసుకోగా తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. లూంగ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 8528 నార్త్ వెస్ట్రన్ చైనా ప్రావిన్స్‌లోని జీనింగ్ నుంచి ఈస్ట్ చైనాలోని యాన్చెంగ్కు బయలుదేరింది. చైనాకు చెందిన ఎంఎస్ లీ పూటుగా మద్యం తాగి విమానంలో ఎక్కి కూర్చుంది. కొద్దిసేపటి తరువాత పక్కనే ఉన్న కిటికీపై అదే పనిగా పంచ్‌ల వర్షం కురిపించింది. దీంతో అక్కడున్న తోటి ప్రయాణికులు ఆమెను వారించేందుకు యత్నించగా వారిని నెట్టివేస్తూ మరీ కిటికీ అద్దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించింది. విమానంలో ఉన్న సిబ్బంది ఆమెను సీటు నుంచి బలవంతంగా లేపడానికి యత్నించడం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. ఈ విషయం పైలట్‌కు చేరవేయడంతో అతను ఉన్నపళంగా సెంట్రల్ చైనా ఫ్రావిన్సులోని జిన్జెంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండిగ్ చేశాడు.సిబ్బంది సమాచారంతో అప్పటికే అక్కడికి చేరుకున్నఎయిర్‌పోర్ట్ అధికారులు ఎంఎస్ లీని జెంజోహు పోలీసులకు అప్పగించారు.(కరోనా: మగవాళ్లలోనే ఎందుకు మరణాలు ఎక్కువ?) తన బాయ్‌ఫ్రెండ్ మీద ఉన్న కోపంతో విమానంలోని కిటికీని బద్దలు కొట్టడానికి ప్రయత్నించిందని పోలీసులు పేర్కొన్నారు. విమానం ఎక్కడానికి ముందే బోర్డింగ్ సమయంలో 250 మి.లీ కలిగిన రెండు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసిందని తెలిపారు. చైనీస్ గ్రేయిన్ ఆల్కాహాల్ అయిన బైజీహులో 35-60 శాతం మద్యం ఉంటుంది. లవర్ తనను మోసం చేశాడనే అసహనంతోనే లీ కిటికీని పగలగొట్టడానికి యత్నించిందని పేర్కొన్నారు. పబ్లిక్ ప్లేస్‌లో ఇష్యూ చేసిన కారణంతో లీపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆమెను ఎంతకాలం రిమాండ్‌లో ఉంచాలి, విమానానికి జరిగిన నష్టానికి జరిమానా విధించాలా వద్దా అనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లీ చేసిన తప్పుకు చైనా సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు ఆమె పాస్‌పోర్టును రద్దు చేసి బ్లాక్ లిస్ట్‌లో చేర్చే అంశంపై కూడా ఎలాంటి స్పష్టత రాలేదు.(24 గంటల్లో 10,667 కేసులు.. 380 మరణాలు) -
ఎ- 320 ఎయిర్ ఏషియా విమానానికి తప్పిన ముప్పు
-
ఎయిర్ ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: జైపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ఎ-320 విమానం పైలట్ ఒక ఇంజిన్‌లో ఫ్యూయల్ లీకేజీని గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా దానిని నిలిపివేసి.. ఒకే ఇంజిన్‌పై రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో 76 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎ-320 విమానంలో సాంకేతిక లోపంపై స్పందించిన ఏయిర్ ఏషియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు సహకరిస్తామని తెలిపింది. పైలట్ల చాకచక్యంతో ప్రమాదం తప్పిందని పేర్కొంది. -
కరాచీ విమాన ప్రమాదంపై కొత్త అనుమానాలు
కరాచీ: పాకిస్తాన్లో విమానం కూలి 97 మంది మరణించిన ఘటనపై జరిగిన ప్రాథమిక విచారణలో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. విమానం మొదటిసారి ల్యాండింగ్ ప్రయత్నం చేయగా అది విఫలమైంది. ఆ విషయాన్ని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు చెప్పలేదు. ల్యాండింగ్ ప్రయత్నంలో విఫలమైతే జరిగిన ప్రమాదం వల్ల ఇంజిన్లు, ఇతర విభాగాలు దెబ్బ తిని ఉండవచ్చని.. ఇలా జరిగితే వెంటనే ఎమర్జెన్సీ అలారం యాక్టివేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఆ విమానంలో ఆ అలారం యాక్టివేట్ కాలేదు. ల్యాండిగ్ విఫలమైనపుడు 3,000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాల్సిందిగా ట్రాఫిక్ కంట్రోలర్ చెప్పినా పైలట్లు 1,800 అడుగుల ఎత్తు వరకు మాత్రమే విమానాన్ని తీసుకెళ్లగలిగారు. విమానంలోని బ్లాక్ బాక్సును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఐఏఎఫ్ హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
చండీగఢ్ : భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాఫ్టర్ శుక్రవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండయింది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన ఐఏఎఫ్ హెలికాఫ్టర్ సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని అధికారులు వెల్లడించారు. హెలికాఫ్టర్ కంట్రోల్ ప్యానెల్స్‌లో హెచ్చరిక సంకేతాలు రావడంతో ముందుజాగ్రత్త చర్యగా హోషియార్పూర్ గ్రామంలో ల్యాండయిందని భారత వైమానిక దళం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనలో పైలట్లు, ఇతర సిబ్బంది క్షేమంగా బయటపడ్డారని ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఎయిర్‌ఫోర్స్ వర్గాలు పేర్కొన్నాయి. హెలికాఫ్టర్‌ను పరిశీలించిన అనంతరం దాన్ని తిరిగి ఎయిర్‌బేస్‌కు తరలిస్తామని ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. కాగా వైమానిక దళానికి చెందిన చీతా హెలికాఫ్టర్ సైతం గురువారం ఘజియాబాద్ ఎయిర్‌బేస్ నుంచి చండీగఢ్ వెళుతూ సాంకేతిక సమస్యలతో ఇదే ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. చదవండి : కూలిన విమానం; రెండు ఐఏఎఫ్ హెలికాప్టర్లతో... -
తప్పిన ప్రమాదం, విమానంలో మంత్రి
సాక్షి, కోల్‌కతా: కోల్‌కతా నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్ మంత్రి అరూప్ బిస్వాస్‌తో సహా 171 మంది ప్రయాణికులతో బాగ్డోగ్రాకు బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం టేకాఫ్ అయిన వెంటనే అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు సహా, విమాన సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. టేకాఫ్ అయిన వెంటనే వడగండ్ల వర్షం కురవడంతో పైలట్ అప్రమత్తమై తిరిగి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పిందని విమానయాన సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. విండ్‌షీల్డ్‌కు నష్టం వాటిల్లిందనే అనుమానంతో పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ప్రయాణీకుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ విమానయాన సంస్థ ముఖ్య భద్రతా అధికారి క్షమాపణలు చెప్పారు. -
కోల్‌కతాలో అత్యవసరంగా దిగిన విమానం
కోల్‌కతా: ముంబై నుంచి గువాహటి వెళ్తున్న స్పైస్ జెట్ విమానాన్ని కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రమంలో అత్యవసరంగా కిందికి దించారు. ఇంధనం లీక్ అవుతున్నట్లు పైలట్ అనుమానించి బుధవారం ఉదయం కోల్‌కతా విమానాశ్రమం అధికారులకు సమాచారం ఇవ్వడంతో అత్యవసరంగా కిందకు దించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ విమానం విమానాశ్రమంలోనే ఉందని, చివరి నివేదిక వచ్చే వరకు విమానం అధికారిక నిర్వహణలోనే ఉంటుందని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. విమానంలోని 180 మంది ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై కోల్‌కతా విమానాశ్రయం డైరెక్టర్ కౌశిక్ భట్టచార్య మాట్లాడుతూ.. ‘ఈ స్పైస్ జెట్ విమాన పైలెట్ ఇంధనం లీకేజీ అవుతున్నట్లు అనుమానంగా ఉందని.. విమానాన్ని అత్యవసరంగా దించాలనుకుంటున్నట్టు కోల్‌కతా ఏటీసీకి ఈ ఉదయం 8:45 గంటలకు సమాచారం అందించాడు. దీంతో 8:58కి విమానాన్ని కోల్‌కతా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతించాం. ఇంధన లీకేజీతో విమానాలను నిలిపివేసిన సంఘటనలు చాలా అరుదుగా జరిగాయి. దీనిపై సివిల్ ఏవియేషన్ సిబ్బందికి సమాచారం అందిచాము. వారు ప్రయాణీకులందరినీ సురక్షితంగా దించేశారు. ప్రస్తుతం విమానం నిర్వహణలో ఉంద’ని వెల్లడించారు. -
జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్
-
పొలాల్లో జెట్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, అనంతపురం: సాంకేతిక లోపం కారణంగా ఓ జెట్ విమానం అనంతపురం జిల్లాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సోమవారం ఉదయం బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర గ్రామ సమీపంలోని పొలాల్లో జెట్ ఫ్లయిట్ ఎమర్జెన్సీ ల్యాండైంది. అయితే అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారు. ఈ విమానం మైసూర్ నుంచి బళ్లారిలోని జిందాల్ ఫ్యాక్టరీకి వెళుతుండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్మీ చేతక్ హెలికాఫ్టర్ ఎమెర్జేన్సీ ల్యాండింగ్
-
విమానానికి తప్పిన ప్రమాదం, షాకైన స్థానికులు
సాక్షి, కోలకతా: గో ఎయిర్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ద సమయానికే సాంకేతిక లోపం తలెత్తడంతో గువహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బర్దోయి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే విమానంలో ఉన్న మొత్తం 157 మంది సురక్షితంగా బయటపడ్డారు. గోవహతి-కోల్‌కతా గోఎయిర్ జి 8546 విమానం ఉదయం 11:15 గంటలకు గువహతి విమానాశ్రయం నుండి బయలుదేరింది. వెంటనే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఈ సందర్భంగా భారీ శబ్దం వినపడిందని విమానాశ్రయంలోఉన్నవారు చెప్పారు. లోహపు ముక్కలను కనుగొన్నామని స్థానికులు తెలిపారు. విమానం క్రాష్ అయినట్టుగా పెద్ద శబ్దం వినగానే తాను షాక్ అయ్యానని స్థానికుడు ఒకరు తెలిపారు. -
మంత్రి ప్రయాణిస్తున్న విమానంలో మంటలు : తప్పిన ప్రమాదం
సాక్షి, పనాజి : ఇండిగో విమానానికి మరోసారి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. 180మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానంలో అకస్మాత్తుగా మంటలు వ్యాంపించాయి. దీంతో ప్రయాణీకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే వెంటనే అప్రమత్తమైన పైలట్, విమానాన్ని తిరిగి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో గోవా పర్యావరణ మంత్రి నీలేశ్ కాబ్రాల్ కూడా ఉన్నారు. గోవా దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గోవా నుంచి ఢిల్లీ బయలుదేరిన పదిహేను నిమిషాల తరువాత ఇంజీన్‌లో మంటలంటుకున్నాయని మంత్రి నీలేశ్ తెలిపారు. పైలట్ వెంటనే ఎడమ ఇంజీన్ ఆపివేసి తమను తిరిగి గోవాకు ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారని తెలిపారు. తనతో సహా మిగిలిన 180 మంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అధికారిక సమావేశానికి దేశ రాజధాని ఢిల్లీకి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు మంత్రి చెప్పారు. -
ఇమ్రాన్ ఖాన్ విమానంలో కలకలం
న్యూయార్క్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రయాణిస్తున్న విమానం అమెరికాలో అత్యవసరంగా కిందకు దిగింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని శనివారం న్యూయార్క్‌లో అత్యవసరంగా కిందకు దించాల్సి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ ప్రతినిధులు బృందం అమెరికా పర్యటన ముగించుకుని పాకిస్తాన్‌కు తిరిగి వెళుతుండగా విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకోవడంతో న్యూయార్క్‌కు మళ్లించినట్టు జీయో టీవీ వెల్లడించింది. విమానంలోని వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపింది. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. విమానాన్ని బాగు చేసేంత వరకు ఇమ్రాన్ ఖాన్ ఆయన బృందం న్యూయార్క్‌లోనే బస చేయనుంది. ఇమ్రాన్ ఖాన్ వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి భారత్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (చదవండి: కశ్మీర్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ బెదిరింపులు) -
శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్ : దుబాయ్ నుంచి మనీలా వెళుతున్న సీబు పసిఫిక్ ఎయిర్‌లైన్స్ విమానం శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మనీలాకు చెందిన సెరిదా అనే ప్రయాణికురాలికి ఆకస్మాత్తుగా పురుటి నొప్పులు రావడంతో విమానాన్ని ఏటీసీ అనుమతితో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శంషాబాద్ నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
భయానక అనుభవం; హారర్ మూవీలా..
లండన్ : కాసేపట్లో హాయిగా గమ్య స్థానానికి చేరుకోవచ్చు అనుకున్న ప్రయాణికులకు విమానంలో భయానక అనుభవం ఎదురైంది. విమానం మొత్తం దట్టమైన పొగతో నిండిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు బిగపట్టుకుని కూర్చున్నారు. అయితే సిబ్బంది అప్రమత్తతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ఫ్లైట్ బీఏ422లో చోటుచేసుకుంది. వివరాలు... 175 మంది ప్రయాణికులతో బ్రిటీష్ ఎయిర్వేస్ విమానం లండన్ నుంచి స్పెయిన్ బయల్దేరింది. ఈ క్రమంలో ల్యాండ్ అవడానికి కొన్ని నిమిషాల ముందు సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం మొత్తం పొగలు వ్యాపించాయి. దీంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. ఈ క్రమంలో వెంటనే విమానం దిగిపోవాల్సిందిగా సిబ్బంది ప్రయాణికులకు సూచించారు. దీంతో వారంతా పరుగులు పెట్టడంతో తోపులాట జరిగింది. అక్కడికి చేరుకున్న ఎమర్జెన్సీ విభాగం సిబ్బంది వారిని సురక్షితంగా బయటకు పంపివేశారు. కాగా హారర్ మూవీని తలపించిన అనుభవం అంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలను లూసీ బ్రౌన్ అనే నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన బ్రిటీష్ ఎయిర్వేస్ ప్రతినిధి.. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందని.. అయితే వారిని భద్రంగా గమ్యస్థానానికి చేర్చగలిగామన్నారు. తోపులాటలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని..వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. -
తప్పిన ప్రమాదం; విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
సాక్షి, తిరుపతి : ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో స్పైస్‌జెట్ విమానం అత్యవరసంగా ల్యాండ్ అయింది. పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన రేణిగుంట విమానాశ్రయంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్లు సాంకేతిక సమస్యను గుర్తించి వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఊహించని పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విమానంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఉన్నట్టు సమాచారం. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి స్పైస్ జెట్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తోంది. ట్రాక్టర్ సహాయంతో విమానాన్ని రన్‌వే నుంచి పక్కకు తరలించారు. -
విమానానికి బాంబు బెదిరింపు!
లండన్/ముంబై: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం నెవార్క్ సిటీకి వెళ్లడానికి గురువారం ఉదయం ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ191 భద్రతా కారణాలతో లండన్‌లో ల్యాండయ్యింది. విమానంలో బాంబు ఉన్నట్లు హెచ్చరికలు రావడంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని దారి మళ్లించి లండన్‌లోని స్టాన్స్టెడ్ ఎయిర్‌పోర్ట్‌లో దించారు. బ్రిటన్ యుద్ధ విమానాలు రక్షణగా ఉండి ఏఐ191ను విమానాశ్రయానికి తీసుకొచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.50 గంటలకు (భారత కాలమానంలో మధ్యాహ్నం 3.20 గంటలకు) ఏఐ–191 విమానం లండన్‌లో దిగింది. ఆ సమయంలో స్టాన్స్టెడ్ విమానాశ్రయాన్ని కొద్దిసేపు మూసివేశారు. ఏఐ–191 నుంచి మొత్తం 327 మంది ప్రయాణికులను కిందకు దింపారు. విమానంలో బాంబులు ఏవీ దొరకక పోవడంతో ఆ బెదిరింపులు నకిలీవని తేలింది. గాలిలోనే పేలిపోతుందంటూ ఈమెయిల్ విమానం బయలుదేరిన అనంతరం ముంబై విమానాశ్రయ అధికారులకు ఓ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. సెర్గీ సెలిజ్‌నెవ్, నటాలియా ఝ్మురినా అనే వ్యక్తులు ఈమెయిల్ పంపుతూ, ముంబై నుంచి నెవార్క్ వెళ్తున్న విమానం గాలిలోనే పేలిపోతుందని బెదిరించారు. దాంతోపాటు లుఫ్తాన్సా విమానయాన సంస్థకు చెందిన ముంబై–మ్యూనిక్, స్విస్ ఎయిర్‌కు చెందిన ముంబై–జ్యూరిక్ విమానాలూ ఇలా గాల్లో పేలతాయని గురువారం ఉదయం 10.30 గంటలకు ఆ ఈ–మెయిల్ వచ్చింది. అయితే ముంబై–మ్యూనిక్, ముంబై–జ్యూరిక్ విమానాలు అప్పటికే వాటి గమ్యస్థానాలకు చేరుకున్నాయి. ఎయిరిండియా విమానం లగేజీల్లో శక్తిమంతమైన బాంబు పెట్టామనీ, విమానం గాలిలో ఉండగా అది పేలుతుందని ఈమెయిల్లో దుండగులు బెదిరించారు. -
స్పైస్‌జెట్ విమానానికి తప్పిన ప్రమాదం
జైపూర్ : రాజస్థాన్‌లో స్పైస్‌జెట్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. 189 మంది ప్రయాణికులతో వెళుతున్న దుబాయ్-జైపూర్ స్పైస్ జెట్ 58 విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. బయలుదేరిన కొద్దిసేపటికే లోపాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. టేక్ ఆఫ్ తీసుకున్నకొద్ది సేపటికే విమానానికి చెందిన ఒక టైర్ పేలిపోవడంతో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే విమాన సిబ్బందితోపాటు ప్రయాణీకులందరూ క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం జైపూర్ విమానాశ్రయంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు నిపుణుల బృందం పరిశీలిస్తోంది. Rajasthan: Emergency landing of SpiceJet Dubai-Jaipur SG 58 flight with 189 passengers took place at Jaipur airport at 9:03 am today after one of the tires of the aircraft burst. Passengers safely evacuated. pic.twitter.com/H7WE9Yxroy — ANI (@ANI) June 12, 2019 -
విమానంలో వ్యక్తి మృతి..
అబుదాబి : విమానంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కలకలం రేపింది. దీంతో ఢిల్లీ నుంచి మిలాన్ వెళ్తున్న విమానం అత్యవసరంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ల్యాండ్ అయ్యింది. మృతుడు కైలాష్ చంద్ర షైనీ(52) రాజస్తాన్‌కు చెందిన వాడని ఖలీల్ టైమ్స్ వెల్లడించింది. అతడు తన కొడుకు హీరా లాల్‌తో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాడని పేర్కొంది. ఈ విషయాన్ని ఇండియన్ ఎంబసీ ధ్రువీకరించింది. కాగా ఈ విషయం గురించి ఇండియన్ ఎంబసీ కౌన్సిలర్ రాజమురుగన్ మాట్లాడుతూ.. అలీటాలియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో కైలాష్ సోమవారం రాత్రి మరణించాడని పేర్కొన్నారు. ఈ కారణంగా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందని, అతడి శవాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఇతిహాద్ విమానంలో బాడీని బుధవారం భారత్‌కు పంపిస్తామని వెల్లడించారు. ఇదొక దురదృష్టకర ఘటన అని విచారం వ్యక్తం చేశారు. -
పారిస్ టూ ముంబై మధ్యలో ఇరాన్..
న్యూఢిల్లీ : పారిస్ నుంచి ముంబై బయలుదేరిన ఎయిర్ ఫ్రాన్స్ సబ్సిడరీకి చెందిన ఎయిర్‌బస్ ఏ 340 దుబాయ్ వెళుతూ ఇరాన్లో గంటల కొద్దీ నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలతో విమానం ఇరాన్ నగరం ఇస్ఫహాన్‌లో ల్యాండయింది. ప్రయాణీకులు అందరూ క్షేమంగానే ఉన్నారని, అధికారులు వారికి అవసరమైన ఏర్పాట్లు చేశారని ఇరాన్ వార్తాసంస్థ పేర్కొంది. విమానాన్ని స్ధానిక మెయింటెనెన్స్ బృందం చెక్ చేసిందని గురువారం దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుందని ఎయిర్ ఫ్రాన్స్ వెల్లడించింది. దుబాయ్ నుంచి ఇతర ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాల్లో ప్రయాణీకులను ముంబై చేరవేస్తామని తెలిపింది. కాగా గత ఏడాది డిసెంబర్లో సైతం నార్వేకు చెందిన ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ దుబాయ్ నుంచి ఓస్లో వెళుతూ ఇరాన్లో అత్యవసరంగా ల్యాండయింది. -
సీఎం విమానం అత్యవసర ల్యాండింగ్..!
సాక్షి, చైన్నై : తమిళనాడు సీఎం పళని స్వామి ప్రయాణిస్తున్న విమానాన్ని టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అత్యవసర ల్యాండింగ్ చేశారు. కన్యాకుమారిలో జరుగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతోనే అత్యవసర ల్యాండింగ్ చేసినట్టు తెలిసింది. మరో విమానంలో సీఎం మధురై పయనమయ్యారు. (నేడు నగరానికి ప్రధాని మోదీ) (చదవండి : తమిళనాట చేతులు కలిపిన బీజేపీ, ఏఐఏడీఎంకే) -
ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
సాక్షి, కోలకతా: ఇండిగో ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం మరోసారి ప్రమాదంలో పడింది. ఇండిగో నియోఎయిర్ బస్-300విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో కోలకతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. జైపూర్‌నుంచి కోలకతా బయలుదేరిన ఇండిగో విమానంలో ఆకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బందికి కాసేపు గందరలోళానికి లోనయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి తరలించారు. కాక్‌పిట్‌లో పొగలను గమనించిన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారని ఎయిర్‌లైన్స్ వివరించింది. 136 మంది ప్రయాణికులు క్షేమమని వెల్లడించింది. IndiGo flight 6E-237 operating on Jaipur-Kolkata route made an emergency landing due to suspected smoke in the cabin on December 10. All passengers and crew safe. pic.twitter.com/std4XqdbW9 — Debanish Achom (@journeybasket) December 11, 2018 -
చెన్నైలో విమానం అత్యవసర ల్యాండింగ్
చెన్నై: రాజమండ్రి నుంచి ఆదివారం చెన్నై బయలుదేరిన ఇండిగో 6ఈ7123 విమానం ఇంజిన్ విఫలమవడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గాలిలో ఎగురుతుండగానే ఒక ఇంజిన్‌లో ఆయిల్ లీకై అది పనిచేయకుండా పోయిందనీ, దీంతో విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా దించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. ప్రయాణికులంతా క్షేమమేనన్నారు. ఆయిల్ లీక్ అయినా పైలట్ నేరుగా విమానాన్ని దించకుండా కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టారని అధికారి ఆరోపించారు. -
రష్యా రాకెట్ అత్యవసర ల్యాండింగ్
మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి రష్యా ప్రయోగించిన సూయిజ్ రాకెట్‌కు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. గురువారం కజకిస్తాన్‌లోని బైకనూర్ కేంద్రం నుంచి బయల్దేరిన కాసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రాకెట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న వ్యోమగాములు నిక్ హేగ్(అమెరికా), అలెస్కీ ఒవ్చినిన్(రష్యా)లు క్షేమంగా ఉన్నట్లు రష్యా స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. ‘ప్రయోగంలో తొలి దశ పూర్తయ్యాక బూస్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. క్షణాల్లో స్పందించిన ఎమర్జెన్సీ రెస్క్యూ బృందం చాకచక్యంగా వ్యవహరించి రాకెట్‌ను సురక్షితంగా నేలకు దించారు’ అని తెలిపింది. జెజ్కాజ్‌గన్ పట్టణంలో రాకెట్ అత్యవసరంగా ల్యాండ్ అయిందని, వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, కంట్రోల్ రూంలోని రెస్క్యూ బృందంతో వారు మాట్లాడుతున్నారని నాసా అధికారి ఒకరు తెలిపారు. శిక్షణలోనూ వారు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారని, రాకెట్ అసాధారణ వేగంతో నేలకు దిగుతున్నప్పుడు అధిక గురుత్వాకర్షణ శక్తికి లోనైనా తట్టుకున్నారని వెల్లడించారు. ప్రయోగం ప్రారంభమైన 2 నిమిషాల్లోనే సమస్య తలెత్తిందని, అప్పటికి తామింకా సీటు బెల్టును పూర్తిగా పెట్టుకోలేదని వ్యోమగామి ఒవ్చినిన్ అన్నట్లు ఓ వీడియో బహిర్గతమైంది. -
ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి,హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ నుంచి గోవాకు వెళుతున్న ఇండిగో విమానం మంగళవారం ఉదయం టేకాఫ్ అయిన 20 నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పూనుకున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణీకులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఆ సమయంలో ఇండిగో విమానంలో 146 మంది ప్రయాణీకులున్నారని అధికారులు తెలిపారు. కాగా ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆదివారం పలు ఎయిర్‌పోర్ట్‌ల్లో ఇండిగో సిస్టమ్స్ అనూహ్యంగా డౌన్ కావడంతో గంటన్నర పాటు ఇండిగో విమానాల సేవలు నిలిచిపోయాయి. -
సౌదీ విమానానికి తప్పిన ముప్పు
శంషాబాద్: సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి మంగళవారం పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియా వెళ్తున్న ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ పక్షిని ఢీకొట్టింది. ఈ విషయం గమనించిన పైలట్లు వెంటనే చాకచక్యంగా ల్యాండింగ్ చేశారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో 70 మంది ప్రయాణం చేస్తున్నారు. -
కుప్పకూలిన విమానం
డ్యురాంగో: భారీ వడగళ్ల వానకు ఉత్తర మెక్సికోలో ఏరోమెక్సికోకు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. డ్యురాంగో నుంచి మెక్సికోకు వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వడగళ్ల వానలో విమానం చిక్కుకుంది. దీంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించడంతో విమానం కుప్పకూలింది. వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 99 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఇద్దరు విమాన సిబ్బంది కలిపి మొత్తం 103 మంది అందులో ఉన్నారు. వారిలో 97 మందికి గాయాలయ్యాయి. పైలట్లు ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం విశేషం. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. విమాన సిబ్బంది ఎంతో చాకచక్యంగా, నేర్పరితనంతో విమానాన్ని భారీ ప్రమాదం నుంచి తప్పించారని ఎయిర్‌లైన్స్ డైరెక్టర్ జనరల్ ఆండ్రెస్ కొనేసా అభినందించారు. విమానం భద్రతా ప్రమాణాల వల్లే.. ఏరోమెక్సికో విమాన ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడానికి కారణం దాన్ని తయారుచేసిన విధానం, భద్రతా ప్రమాణాల వల్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. విమానం లోపలి భాగాలు మంటలు అంటుకుని కాలిపోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందని, ఎలాంటి హానికరమైన వాయువులు విడుదల కాకపోవడం వల్లే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. -
విమానం అత్యవసర ల్యాండింగ్.. అయినా దక్కని పసివాడి ప్రాణం
హైదరాబాద్: నాలుగు నెలల చిన్నారి అస్వస్థతకు గురవ్వడంతో పట్నా వెళ్లే ఇండిగో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అయినప్పటికీ ఆ పసివాడి ప్రాణం మాత్రం దక్కలేదు. బిహార్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సందీప్‌కుమార్ తన భార్య పునీత్ శర్మతో కలసి బెంగళూరులో నివాసముంటున్నాడు. మంగళవారం ఉదయం పునీత్ శర్మ తన నాలుగు నెలల కుమారుడు స్పర్శ్‌తో కలసి బెంగళూరు నుంచి ఇండిగో 6ఈ837 విమానంలో పట్నాకు బయలుదేరింది. ప్రయాణంలో స్పర్శ్ శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందికి గురికావడంతో ఆమె విమాన సిబ్బంది దృష్టికి తీసుకువచ్చింది. దీంతో పైలెట్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. వెంటనే చిన్నారిని ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. పునీత్‌శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి,పట్నా: ఎయిరిండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. విమానానికి అకస్మాత్తుగా పక్షి అంతరాయం కల్పించడంతో అత్యవసరం లాండ్ చేయాల్సి వచ్చింది. పట్నా ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ఈ సంఘటన చోటు చేసుసుకుంది. ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకుని సురక్షితంగా విమానం కిందికి దిగడంతో ప్రయాణీకులు, సిబ్బంది భారీ ఊరట చెందారు. దాదాపు 124 మంది ప్రయాణికులతో పట్నా - ఢిల్లీ ఎయిరిండియా విమానం ఈ భారీ ప్రమాదంనుంచి తప్పించుకుంది. కాగా కేవలం ఒక చిన్న పక్షి ఢీ కొనడం వలన పెద్ద పెద్ద విమానాలు కూలిపోయిన ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
శంషాబాద్: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి ఈ విమానం వెళ్లాల్సి ఉంది. ఉదయం 6.25 గంటలకు టేకాఫ్ తీసుకున్న విమానం.. గాలిలోకి ఎగిరిన 15 నిమిషాలకే సాంకేతిక లోపంతో తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానంలో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. 11 గంటలు కావొస్తున్నా.. ఇప్పటివరకు విమానాశ్రయంలో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో గమ్యానికి ఎలా చేరుకోవాల తెలియక ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. -
ఆమె చేసిన పనితో గుండెలు గుభేల్; వైరల్
లాస్ఏంజెల్స్: ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సిన విమానం ఒక్కసారిగా రద్దీ రోడ్డు మీదికి దూసుకొచ్చేసరికి జనం భీతిల్లిపోయారు. రోడ్డు నిండా కార్లు.. ఇరువైపులా కరెంటు తీగలు.. ఏ కొంచెం అటుఇటైనా పర్యవసానం తీవ్రంగా ఉండేది. వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పినా ఆ పైలట్ చేసిన పనికి వాహనదారుల గుండెలు గుభేల్మన్నాయి. అమెరికాలో అత్యంత జనసమ్మర్థం గల రెండో అతిపెద్ద నగరం లాస్ఏంజెల్స్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటన తాలూకు వీడియోలూ వైరల్ అయ్యాయి. అరుదైన ఎమర్జెన్సీ ల్యాండింగ్: సెస్నా 172 రకానికి చెందిన తేలికపాటి విమానం జాన్ వెయిన్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే ఇంజన్లో లోపం తలెత్తింది. ఎయిర్‌పోర్టుకు తిరిగెళదామని పైలట్ అనుకునేలోపే మొత్తానికే పనిచేయడం ఆగిపోయింది. క్రాష్ ల్యాండింగ్ తప్పదనుకున్నా.. చివరి ప్రయత్నంగా హంటింగ్టన్ బీచ్ రోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నించిందామె. వెంట్రుకవాసిలో కార్లను, కరెంటు తీగల్ని దాటుకుంటూ మొత్తానికి సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో మహిళా పైలట్ ఒక్కరే ఉన్నారని, ఈ ఘటనలో రోడ్డుపై ఉన్నవారిలో ఏ ఒక్కరూ గాయపడలేదని, విమాన సర్వీసులకు కూడా ఆటంకం కలుగలేదని ఎల్ఏపీడీ, ఏవియేషన్ అధికారులు తెలిపారు. అయితే జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండైన హంటిగ్టన్ రోడ్డును కొద్ది గంటలపాటు మూసేశారు. ఇది అత్యంత అరుదైన ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని, పైలట్ అద్భుతం సృష్టించారని కొందరు ఏవియేషన్ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆ మహిళా పైలట్ ఎవరన్న విషయాన్ని మాత్రం అధికారులు గోప్యంగా ఉంచారు. ఆమె ఆరెంజ్ కంట్రీ ఫ్లైట్ క్లబ్లో శిక్షణ పొందుతున్నారని, సదరు విమానం జేజీ క్యాపిటల్ హోల్డింగ్స్ సంస్థకు చెందినదని తెలిసింది. -
ఆమె చేసిన పనితో గుండెలు గుభేల్
-
రాహుల్ గాంధీకి మోదీ ఫోన్
బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. గురువారం రాహుల్ గాంధీ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు రాహుల్ ఓ విమానంలో బయలుదేరారు. ఉదయం 10.45 గంటలకు విమానంలోని ఆటోపైలెట్ మోడ్ ఒక్కసారిగా ఆగింది. దీంతో విమానం ఒక్కసారిగా గాల్లో పక్కకు ఒరిగిపోయి వేగంగా కిందకు జారిపోయింది. వెంటనే స్పందించిన పైలెట్ విమానాన్ని మాన్యువల్ మోడ్‌లోకి తీసుకొచ్చి హుబ్బలి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదం అనంతరం రాహుల్‌కు మొట్టమొదటగా ఫోన్ చేసింది ప్రధాని నరేంద్ర మోదీనేనని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తీరు, రాహుల్ బాగోగుల గురించి ఆరా తీశారని సమాచారం. రాహుల్‌కు జరిగిన ప్రమాద విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకోలేదనడానికి ప్రధాని స్వయంగా రాహుల్‌కు ఫోన్ చేయడమే నిదర్శనమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏవియేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. రాహుల్‌కు ఎస్పీజీ కమాండోస్‌తో హై లెవల్ సెక్యూరిటీ కల్పిస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ ఘటన వెనుక కుట్ర దాగిఉండొచ్చని కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై రాహుల్ అనుచరుడు కౌశల్ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కర్ణాటక డీజీపీ నీల్మణి ఎన్.రాజుకు లేఖ రాశారు. -
‘రాహుల్‌ను చంపేందుకు కుట్ర!’
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. గురువారం పెను ప్రమాదం నుంచి రాహుల్ తృటిలో బయటపడిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం గురువారం ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఆయన బయలుదేరగా.. హఠాత్తుగా సమస్య తలెత్తింది. అయితే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి హెబ్బలి విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆటోపైలెట్ మోడ్ ఒక్కసారిగా ఆగిపోవటంతో విమానం ఒక్కసారిగా గాల్లో పక్కకు ఒరిగిపోయింది. ఆపై వేగంగా విమానం కిందకు జారిపోతుండటంతో పైలెట్ అప్రమత్తమై ఎయిర్‌క్రాఫ్ట్‌ను మ్యానువల్ మోడ్‌లోకి తెచ్చి ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. బలమైన గాలులు వీయటంతో ఈ సమస్య తలెత్తిందని ఓవైపు అధికారులు చెబుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ‘ప్రమాద సమయంలో వాతావరణం సాధారణంగా ఉంది. ఇలా ఖచ్ఛితంగా సాంకేతిక సమస్యే. ఘటనపై మాకు అనుమానాలు ఉన్నాయి. పైగా సమస్య ఏంటన్నది పైలెట్లు కూడా వివరించలేకపోతున్నారు’ అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పోలీసు ఫిర్యాదు.. కాగా, ఘటనపై కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాహుల్ అనుచరుడు కౌశల్ విద్యార్థి.. కర్ణాటక డీజీపీ నీల్మణి ఎన్ రాజుకు ఓ లేఖ రాశారు. అంతేకాదు ఘటనపై పారదర్శకమైన దర్యాప్తు చేపట్టాలంటూ డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు ఆయన ఇంకో లేఖ రాశారు. Complaint to the DG&IG of Police, Karnataka, regarding the serious malfunction of the aircraft carrying Congress President @RahulGandhi pic.twitter.com/P3RJwkWOMR — Congress (@INCIndia) 26 April 2018 -
ఇంజన్ ఫెయిల్ : తప్పిన విమాన ప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ: ఓ అంతర్జాతీయ విమానంలో శనివారం ఆకస్మాత్తుగా సాంకేతిక సమస్య రావడం ఆందోళన కలిగించింది. అధికారుల అప్రతమత్తతో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రష్యాకు చెందిన విమానం అత్యవసరంగా లాండ్ అయింది. 344మంది ప్రయాణీకులతో వియత్నాం నుంచి రష్యాకు వెళుతున్న రష్యన్ విమానం అత్యవసరంగా దిగిందని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. అధికారులు అనుమతి మేరకు పూర్తి అత్యవసర ప్రోటోకాల్‌తో సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. వియత్నాంలోని ఫు క్వాక్ నుంచి రష్యాలోని నాల్గవ అతిపెద్ద నగరం యెకాటెరిన్ బర్గ్‌కు వెళుతున్న విమానం ఏబీజీ 8722 లో సాకేంతిక సమస్య రావడంతో అత్యవసరంగా దిగేందుకు ఢిల్లీ విమానాశ్రయం అధికారుల అనుమతిని కోరింది. దీంతో విమానాశ్రయ అధికారుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎనిమిది అగ్నిమాపక ఇంజీన్లు, అత్యవసర సేవల నిమిత్తం అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ఎట్టకేలకు విమానం రన్‌వే నెం.11పై సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు, సిబ్బంది, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. -
మరోసారి ఇండిగోకు తప్పిన ప్రమాదం
-
మరోసారి ఇండిగోకు తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : ఇండిగో విమానానికి మరోసారి ప్రమాదం పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 15 నిమిషాలపాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. అయితే సమస్యను పసిగట్టిన ఫైలెట్ ఎమర్జెన్సీ ల్యాండిగ్‌కు అనుమతి తీసుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే ల్యాండిగ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు. గత కొంతకాలంగా ఇండిగో ఫ్లైట్లు సాంకేతిక సమస్యలతో సతమతమౌతున్నాయి. సరిగ్గా రెండు రోజల క్రితమే శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే ఇదే కంపెనీకి చెందిన విమానం టైర్లు సైతం పేలిపోయాయి. అదృష్టవశాత్తూ పెనుప్రమాదం తప్పింది. వారిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు. ఈ సంఘటన మరిచిపోక ముందే ఇండిగోకే చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వీటిలో ప్రయాణించాలంటే ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. ప్రాణానికి భరోసా లేదంటూ వాపోతున్నారు. -
ప్రాణభయంతో విమానం రెక్కలోంచి దూకేశారు
డల్లాస్ : ప్రాణ భయంతో విమానం రెక్కలోంచి ప్రయాణికులు దూకేసిన ఘటన అల్బుకర్క్యూ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్(మెక్సికో)లో చోటు చేసుకుంది. పెద్ద శబ్దంతో విమానం ల్యాండ్ కాగా.. పేలిపోతుందన్న భయంతో ప్రయాణికులు ఈ పనికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. సౌత్ వెస్ట్ ఎయిర్వేస్కు చెందిన విమానం ఆదివారం రాత్రి ప్రయాణికులతో ఫోయెనిక్స్(అరిజోనా) నుంచి లవ్ ఫీల్డ్(డల్లాస్)కు బయలుదేరింది. అయితే కాసేపటికే క్యాబిన్లో ఏదో వాసన వస్తున్న విషయాన్ని గమనించిన సిబ్బంది విషయాన్ని పైలెట్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంతలో వేడి ఎక్కువగా ఉందంటూ ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. క్యాబిన్లో పొగలు రావటం ప్రారంభం కాగా.. ప్రమాద సంకేతాలు కనిపించటంతో పైలెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్‌కు సిద్ధమయ్యాడు. అల్బుకర్క్యూ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణికులంతా బయటకు వస్తున్న క్రమంలో.. ఇద్దరు ప్రయాణికులు మాత్రం విమానం రెక్క వద్ద ఉన్న ఎమర్జెన్సీ డోర్ నుంచి రన్‌వే పైకి దూకేశారు. అది గమనించిన ఓ ప్రయాణికుడు వారిద్దరూ అలా దూకటాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సుమారు 8 అడుగుల ఎత్తు నుంచి దూకటంతో వారికి గాయాలైనట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ వేరే విమానంలో తరలించిన ఎయిర్వేస్.. గాయపడిన వాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. A flight to remember. Something I hope I never experience again. You see these things in movies and never expect it to happen to you! Most importantly everyone is safe but man what a scare! @CNN @NBCDFW @CBS @wfaa @PhilthaThrill pic.twitter.com/BvwAqqIOZC — Brandon Cox (@brandoncox91) 12 March 2018 -
శంషాబాద్ ఎయిర్పోర్ట్ ; తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : అత్యవసరంగా ల్యాండై, ఇంధనాన్ని నింపుకొని తిరిగి బయలుదేరిన ఆ విమానం ఈ పాటికి పెను ప్రమాదంలో చిక్కుకొనిఉండేది. శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తతతో ఆ ముప్పుతప్పినట్లైంది. అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. చౌకవిమానయాన సంస్థ సిటీలింక్కు చెందిన విమానం ఒకటి ఆదివారం ఉదయం జెడ్డా(సౌదీ అరేబియా) నుంచి జకార్తా(ఇండోనేషియా)కు బయలుదేరింది. అయితే, మార్గం మధ్యలోనే ఇంధనం నిండుకోవడంతో పైలట్ దాన్ని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అప్పటింకే సిద్ధంగా ఉన్న ఎయిర్‌పోర్టు సిబ్బంది.. సిటీలింక్ విమానంలో ఇంధనాన్ని నింపారు. ఇక అది టేకాఫ్ కోసం రన్‌వేపైకి కూడా వెళ్లింది. అంతలోనే ఇంధనం లీకవుతున్నట్లు సిబ్బంది గుర్తించారు. అంతే, క్షణం ఆలస్యం కాకుండా విమానాన్ని నిలిపేయాలని పైలట్‌కు ఆదేశాలు వెళ్లాయి. కలకలం : ఎండకు సైతం భగభగమండే గుణమున్న విమాన ఇంధనం.. రన్‌వేపై ధారలా కారిపోవడంతో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో కలకలం చెలరేగింది. తక్షణమే ఫైరింజన్లను రప్పించి, రన్‌వే మొత్తాన్ని శుభ్రంగా కడిగేశారు. సాకేతిక నిపుణులు విమానంలో లీకేజీ లోపాన్ని సరిచేశారు. ఒకవేళ ఆ విమానం టేకాఫై ఉంటేగనుక పెనుప్రమాదమే జరిగి ఉండేదని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు. -
హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్: 13 మంది మృతి
మెక్సికో సిటీ: భూకంపం వచ్చిన ప్రాంతంలో పర్యటించేందుకు మెక్సికో హోంమంత్రి హెలికాప్టర్లో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలున్నారు. శుక్రవారం మెక్సికో హోం మంత్రి అల్ఫోన్సో నవరెట్, ఓక్సాక స్టేట్ గవర్నర్ అలెజాండ్రో మురాత్లు సైనిక హెలికాప్టర్లో వెళ్తుండగా దాన్ని అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో హెలికాప్టర్ దిగిన ప్రాంతంలో ఉన్న 12 మంది అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మంత్రి, గవర్నర్లు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. -
అట్లాంటిక్‌పై భయానక ప్రయాణం
ప్యారిస్ : వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం.. అందులో వందల మంది ప్రయాణికులు.. అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రయాణం.. హఠాత్తుగా ఇంజిన్ ఫెయిల్.. ఒక్కసారిగా ప్రయాణికులు పరిస్థితి ఊహించుకోండి.. అందులో మీరుంటే? ఇది ఇంకా భయానకం. సరిగ్గా ఇటువంటి ప్రయాణమే ఎయిర్ ఫ్రాన్స్-380 ప్రయాణికులకు ఎదురైంది. ప్యారిస్ నుంచి లండన్ మీదుగా.. లాస్ ఎంజెల్స్‌కు వెళుతోంది. సరిగ్గా లండన్ హీత్రూ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకుని... అట్లాంటిక్ మీదుగా లాస్ ఎంజిల్స్‌కు వెళుతోంది. అప్పుడు ఫ్లయిట్ భూమికి 35 వేల అడుగుల ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తోంది. ఇంతలో ఒక పక్షి.. అంతే వేగంగా వచ్చి ఫ్లయింట్ ఇంజిన్‌ను ఢీ కొట్టింది. ఒక్కసారిగా విమానం కుదుపుకు గురయింది.. ప్రయాణికుల్లో కలవరం మొదలైంది. పక్షి ఢీ కొట్టిన కొన్ని క్షణాలకూ ఇంజిన్ పై భాగం మొత్తం డ్యామేజ్ అయింది.. ఏం జరుగుతుందో గుర్తించే లోపే.. అందకీ అర్థమయింది. ప్రమాదాన్ని అంచనా వేసిన పైలెట్ ఫ్లయిట్‌ని కెనడాలోని గూస్ బే ఎయిర్‌పోర్టుకు మళ్లించాడు.. అయితే అంత దూరం ప్రయాణించదనుకుని.. దగ్గర్లోని గడ్డి మీద అత్యంత సురక్షితంగా ఎయిర్ ఫ్రాన్స్‌ని ల్యాండ్ చేశాడు. పక్షి ఢీ కొట్టిన తరువాత ఇంజిన్ ఫొటోలు, ల్యాండింగ్ సమయంలో.. అక్కడే ఉన్న ఒక వ్యక్తి తీసిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్‌గా మారాయి. -
అట్లాంటిక్‌పై భయానక ప్రయాణం
-
విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్: తిరుపతికి వెళ్తున్న స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎస్జీ 1094 విమానాన్ని గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఉదయం 9.35 గంటలకు శంషాబాద్ నుంచి టేకాఫ్ తీసుకున్న కాసేపటికి విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. పది నిమిషాల వ్యవధిలోనే సమస్యను గుర్తించిన పైలట్ అప్రమత్తమై శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. అధికారుల సూచనలతో 9.50 గంటలకు విమానాన్ని తిరిగి శంషాబాద్లోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో మొత్తం 170 మంది ప్రయాణికులున్నారు. సాంకేతిక సమస్యను సవరించిన అనంతరం 11.30 గంటలకు తిరుపతికి విమానం బయలుదేరింది. -
ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, విశాఖ : విశాఖపట్నం విమానాశ్రయంలో బుధవారం ఉదయం ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విశాఖ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఈ విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. కాగా ఫ్లయిట్ టేకాఫ్ సమయంలో ఓ పక్షి విమానం రెక్కల్లో ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని గమనించిన పైలట్ అప్రమత్తమై వెంటనే విమానాన్ని తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా దించివేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఖతార్ ఫ్లయిట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానం శనివారం ఉదయం అత్యవసరంగా ల్యాండ్ అయింది. దోహా నుంచి బాలీ వెళ్లాల్సిన ఈ విమానం కో పైలట్ టీనూ ఆమ్రేకు అస్వస్థతకు గురి కావడంతో దారి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం అస్వస్థతకు గురైన కో పైలట్‌ను విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం టీనూ ఆమ్రేను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు సమాచారం. కో పైలట్ యూరప్‌లోని రోమని దేశస్తుడని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. కాగా ఖతార్ విమానంలో 277 మంది ప్రయాణికులు ఉన్నారు. -
కేంద్రమంత్రికి తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
ఈటానగర్: కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకి పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించివేశారు. వాతావరణం సహకరించకపోవడంతో అప్రమత్తమైన పైలట్ ఓ చిన్న ప్రాంతంలో దానిని ఉన్నపలంగా దింపేశారు. హెలికాప్టర్ సిబ్బందితోపాటు ఏడుగురు ప్రయాణీకులు, కేంద్రమంత్రి రిజిజు ఎంఐ 17 హెలికాప్టర్లో గువాహటి నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని జైరో ప్రాంతానికి బయల్దేరారు. అయితే, పెద్ద మొత్తంలో పొగలుకమ్ముకోవడంతోపాటు వర్షం తాకిడి ఎక్కువైన నేపథ్యంలో ఇంకాస్త ముందుకు వెళితే ప్రమాదం అని గుర్తించిన పైలట్ ఈటానగర్‌లోని ఓ చిన్న బీడు భూముల్లో నిలిపారు. ‘సురక్షితంగా దిగాను నేను చాలా అదృష్టవంతుడ్ని. ఈ సందర్భంగా ఎంతో అనుభవం ఉన్న బీఎస్ఎఫ్ పైలట్లకు నేను ధన్యవాదాలు చెబుతున్నాను’ అని ఆయన పీటీఐకి చెప్పారు. -
శంషాబాద్ నుంచి వెళ్లిన కాసేపటికే పక్షికి ఢీ
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా): హాంకాంగ్ విమానానికి పెనుముప్పు తప్పింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నుంచి హాంకాంగ్‌కు చెందిన విమానం బయలుదేరిన కాసేపటికే ఓ పక్షిని ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ తిరిగి వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దించాడు. ఆదివారం వేకువ జామున ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ వివరాల ప్రకారం ఆదివారం వేకువజామున 2.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హాంకాంగ్ బయలుదేరిన కేత్వే ఫసిపిక్ ఎయిర్‌లైన్స్ విమానం బయల్దేరింది. 35 నిమిషాల తర్వాత ఓ పక్షిని ఢీకొట్టింది. దాంతో పైలట్ విమానాన్ని వెనక్కి మళ్ళించి శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. పక్షి ఢీకొట్టిన విషయం తెలిసి విమానంలోని ప్రయాణీకులంతా వణికి పోయారు. ఈ విమానంలో 244 మంది ప్రయాణికులు ఉండగా చివరకు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం విమానాన్ని ల్యాండ్ చేసి వారందరినీ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్‌కు తరలించి విమానాన్ని తనిఖీ చేస్తున్నారు. -
ఇండిగో విమానం పక్షిని ఢీ కొట్టడంతో..
రాయ్‌పుర్ : రాయ్‌పుర్ నుంచి ఆదివారం కోల్‌కతా వేళ్లాల్సిన ఇండిగో విమానానికి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. విమానం గాల్లోకి ఎగిరే సమయంలో పక్షిని ఢీకొట్టడంతో రాయ్‌పుర్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు అందరూ క్షేమంగా దిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యూఎస్ మిలటరీ విమానం అత్యవసర ల్యాండింగ్
జకర్తా: అమెరికా మిలటరీకి చెందిన విమానాన్ని ఇండోనేసియాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శనివారం ఇండోనేసియా ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి ఈ విషయాన్ని చెప్పారు. శుక్రవారం అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన బోయింగ్ 707 విమానంలోని నాలుగు ఇంజిన్లలో ఒకటి ఫెయిలైందని, ల్యాండింగ్ చేసుకోవడానికి అనుమతివ్వాలని వారు కోరగా, తాము అంగీకరించామని ఇండోనేసియా ఎయిర్ వైస్ మార్షల్ జెమీ త్రిసోంజయ చెప్పారు. ఏసెహ్ ప్రావిన్స్‌లోని బండా ఏసెహ్ విమానాశ్రయంలో రన్ వే పక్కన అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలను మోహరించామని, యూఎస్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. హిందూ మహాసముద్రంలోని డీగో గార్కియా మిలటరీ బేస్ నుంచి జపాన్‌లోని హానెడా విమానాశ్రయానికి 20 మంది అమెరికా మిలటరీ అధికారులను విమానంలో తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విమానంలోని ఇంజిన్ ఫెయిల్ కావడానికి గల కారణాలు తెలియరాలేదు. -
ట్రూజెట్ విమానం అత్యవసర ల్యాండింగ్
విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ట్రూజెట్ విమానం అత్యవసరరంగా ల్యాండింగ్ అయింది. టేకాఫ్ అయిన పది నిముషాల లోపే విమానం ఇంజన్ నుంచి పొగలు రావడంతో అత్యవసరంగా ల్యాండిగ్ చేశారు. సాంకేతిక నిపుణులు పరిశీలించిన తర్వాత సమస్య ఏమిటో తెలుస్తుందని పైలెట్లు చెప్పారు. -
విమానంలో గుండెపోటు.. మహిళ మృతి
జైపూర్: విమానంలో గుండెపోటుకు గురైన మహిళా ప్రయాణికురాలు అనూహ్యంగా కన్నుమూసింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయం నుంచి శనివారం ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఒకటి ఢిల్లీకి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. తన భర్తతో ప్రయాణిస్తోన్న సీమా అనే మహిళా ప్రయాణికురాలికి గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన పైలట్లు.. ఫ్లైట్‌ను రాజస్థాన్‌లోని సంగనీర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న పోర్టు సిబ్బంది.. బాధిత మహిళను ఆసుపత్రికి తరలించారని, అయితే చికిత్స అందేలోపే ఆమె కన్నుమూసిందని సంగనీర్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఆర్.ఎస్.బల్హారా మీడియాకు చెప్పారు. ఈ ఘటన అనంతరం విమానాన్ని తనిఖీచేసి ఢిల్లీకి పంపించామని పేర్కొన్నారు. -
గాల్లో ఫైటింగ్.. విమానం ఎమర్జెన్సీ లాండింగ్
-
గాల్లో ఫైటింగ్.. విమానం ఎమర్జెన్సీ లాండింగ్
బీరూట్ నుంచి లండన్ వెళ్తున్న విమానాన్ని దారిమధ్యలో ఇస్తాంబుల్‌లో అత్యవసరంగా దించేయాల్సి వచ్చింది. భూమికి 30వేల అడుగుల ఎత్తున గాల్లో ఉండగా.. విమానంలో ఇద్దరు ప్రయాణికులు కొట్టుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇద్దరి మధ్య కొట్లాటను ఆపేందుకు కేబిన్ సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొట్లాటకు దిగిన పెద్దాయన సిబ్బందిలో ఒకరిని తోసేసి, మరొకరి మీద పిడిగుద్దులు కురిపించారు. దాంతో ప్రయాణికుల్లో ఉన్న ఓ యువకుడు సిబ్బందికి సాయం చేయడానికి ముందుకెళ్లారు. ఇదంతా వీడియోలో రికార్డయింది. కొద్ది నిమిషాల తర్వాత ఆ పెద్దాయన నెమ్మదించినా, మళ్లీ రెండు నిమిషాలు గడిచాయో లేదో.. స్టివార్డెస్ మీద మండిపడ్డారు. దాంతో అంతకుముందు ఆయనతో గొడవపడ్డ వ్యక్తి మళ్లీ ఆయన మీదకు వెళ్లాడు. సిబ్బంది ఇద్దరినీ వెంటనే విడదీశారు. ఇక ఈ గొడవ సర్దుమణిగే అవకాశం లేదని భావించిన కెప్టెన్.. వెంటనే అనుమతి తీసుకుని, సమీపంలో ఉన్న ఇస్తాంబుల్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అక్కడ విమానం ఆగగానే నలుగురు భద్రతాసిబ్బంది వచ్చి, గొడవపడ్డ పెద్దాయనను లాక్కెళ్లారు. పెద్దాయన తన భార్యతో పాటు మరో ప్రయాణికుడిపై అరుస్తూ గొడవకు దిగారని విమానంలో ప్రయాణించిన మరోవ్యక్తి చెప్పారు. ఒక ఫ్లైట్ అటెండెంట్ ఆయనను ఆపడానికి ప్రయత్నిస్తే పెద్దాయన బలంగా తోసేశారని, మరో అటెండెంట్ వస్తే ఆమె ముఖం మీద కొట్టారని, ఆ తర్వాత ఓ యువకుడు వచ్చి విడదీశారని తెలిపారు. ఇతర ప్రయాణికులు కూడా ఆయనను ఆపిన తర్వాత పెద్దాయన అందరినీ తినేసేలా చూశాడని, పావుగంట తర్వాత అంతా నెమ్మదించింది అనుకుంటే ఆయన మళ్లీ గొడవ మొదలుపెట్టారని వివరించారు. -
స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు
న్యూఢిల్లీ: స్పైస్ జెట్ విమానానికి శుక్రవారం భారీ ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లిన స్పైస్ జెట్ ఫ్లైట్ 136కు హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కారణంగా సమస్య తలెత్తింది. దీంతో.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సిబ్బంది చాకచక్యంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై స్పందించిన స్పైస్‌జెట్ సంస్థ.. హైడ్రాలిక్ ఫ్లూయిడ్‌ను కోల్పోవడం మూలంగా విమానానికి ల్యాండింగ్ సమస్య తలెత్తిందని వెల్లడించింది. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని పేర్కొంది. -
చెన్నైకి బదులు శంషాబాద్‌లో
శంషాబాద్: వర్దా తుపాను ప్రభావంతో చెన్నైలో వాతావరణం అస్తవ్యస్థంగా మారడంతో ఓమన్ ఎయిర్వేస్(డబ్ల్యూవై 251) విమానం సోమవారం ఉదయం అత్యవసరంగా శంషాబాద్‌లో ల్యాండ్ అయింది. మస్కట్ నుంచి చెన్నై వెళ్లాల్సిన వివానం అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో.. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని అధికారులు వెల్లడించారు. -
కౌలాలంపూర్ విమానం అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్ వెళ్లాల్సిన విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే తిరిగి ల్యాండ్ అయింది. సోమవారం ఉదయం విమానం బయలుదేరిన 15 నిమిషాల అనంతరం గాలిలో చక్కర్లు కొట్టి తిరిగి రన్‌వేపైకి చేరింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఇలా జరిగిందని అధికారులు అంటున్నారు. విమానంలో 148 మంది ప్రయాణికులతో సహా ఆరుగురు సిబ్బంది ఉన్నారు. చెన్నైలో వాతావరణం బాగోక.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఒమన్ ఎయిర్ వేస్ (WY 251) విమానం అత్యవసరంగా ల్యాండయింది. మస్కట్ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఈ విమానాన్ని.. చెన్నైలో వాతావరణం అనుకూలించకపోవడంతో శంషబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. -
జెట్‌లైట్ విమానానికి తప్పిన ముప్పు
-
జెట్‌లైట్ విమానానికి తప్పిన ముప్పు
శంషాబాద్: కోల్‌కతా నుంచి బెంగళూరు వెళుతున్న జెట్‌లైట్ విమానానికి ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శనివారం సాయంత్రం 134 మంది ప్రయాణికులతో కోల్‌కతా నుంచి బయలుదేరిన ఎస్24364 విమానం హైడ్రాలిక్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్.. వెంటనే శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారమిచ్చారు. ఏటీసీ అనుమతితో రాత్రి 8.30 గంటలకు శంషాబాద్ విమానాశ్ర యంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ల్యాండింగ్ సమయంలో విమానం టైరు పేలడంతో అప్రమత్తమైన ఏటీసీ అధికారులు 20 నిమిషాలపాటు రన్‌వేను బ్లాక్ చేశారు. రాత్రి 9.30 గంటలకు రన్‌వేను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు విమానాశ్రయవర్గాలు వెల్లడించాయి. -
విమాన ప్రయాణికుడికి గుండెపోటు..
-ఎమర్జెన్సీ ల్యాండింగ్ హైదరాబాద్ ప్రయాణికుడికి గుండెపోటు రావటంతో శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఓ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ఇండిగో విమాన ప్రయాణికుడికి ప్రయాణంలో ఉండగానే గుండెపోటు వచ్చింది. అత్యవసర చికిత్స అవసరం కావటంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పెలైట్ ల్యాండ్ చేశారు. వెంటనే ప్రయాణికుడిని దగ్గరల్లోని అపొలో ఆస్పత్రికి తరలించారు. -
విమానాన్ని అత్యవసరంగా దించినా..
విమానంలో వెళ్తున్న ఓ చిన్నారి ఆరోగ్యం ఉన్నట్టుండి విషమించింది. దాంతో విమానాన్ని అత్యవసరంగా మధ్యలోనే దించేశారు. అయినా కూడా ఆ చిన్నారి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. కోల్‌కతా నుంచి బెంగళూరుకు వెళ్తున్న 6ఇ 202 ఇండిగో విమానాన్ని మధ్యలో రాయ్‌పూర్‌లోనే అత్యవసరంగా దించారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి గుండెజబ్బుతో బాధపడుతోంది. ఆమెను చికిత్స కోసం బెంగళూరు తీసుకెళ్తున్నారు. దారిలోనే ఆమె ఆరోగ్యం విషమించింది. దాంతోవెంటనే చికిత్స అందించేందుకు వీలుగా విమానాన్ని దారి మళ్లించి రాయ్‌పూర్‌లో దించారు. ఇందుకోసం ముందుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో మాట్లాడి ఏర్పాట్లు కూడా చేశారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా.. చిన్నారి ప్రాణాలు మాత్రం నిలబడలేదు. దాంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ల్యాండవుతూ.. అదుపుతప్పడంతో!
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 ఫైటర్ జెట్ విమానం మరోసారి ప్రమాదానికి గురయింది. మంగళవారం శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో మిగ్-21 అత్యవసరంగా ల్యాండ్ అవుతుండగా.. ఒక్కసారిగా అదుపుతప్పి.. 200 మీటర్ల ఎత్తునుంచి పడిపోయింది. అయినా అదృష్టవశాత్తు ఎవరికీ ఏ గాయాలు కాలేదు. జెట్ ఫైలట్ సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే, మిగ్-21 ఎత్తులోనుంచి పడటం వల్ల రన్‌వే ధ్వంసమైంది. దీంతో శ్రీనగర్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే విమానాలను వెంటనే నిలిపివేశారు. ’ఫైటర్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు పైలట్ గుర్తించడంతో శ్రీనగర్ విమానాశ్రయంలో అత్యవసరంగా దీనిని ల్యాండ్ చేశారు. దీనివల్ల జెట్ విమానం టైర్లు కాలి బూడిదైపోయాయి. అయితే సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల విమానానికి ఏమీ కాలేదు.’ అని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి తగలబడుతున్న టైర్లను ఆర్పివేయడంతో విమానానికి మంటలు అంటుకోలేదు. -
విమానంలో పొగలు.. అత్యవసర ల్యాండింగ్
అది 223 మంది ప్రయాణికులతో వెళ్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానం. ఉన్నట్టుండి అందులోంచి పొగలు వచ్చాయి. దాంతో విమానాన్ని వెనక్కి తిప్పి, అత్యవసరంగా దించాల్సి వచ్చింది. ఇంతకీ ఆ పొగలు ఎక్కడి నుంచి వచ్చాయంటే.. కాఫీ మిషన్ నుంచి!! అవును, అది బాగా వేడెక్కడంతో దాంట్లోంచి పొగలు వచ్చాయి. పైగా ఆ మిషన్‌ను ఎవరూ ఆపలేకపోయారు. అందుకే విమానాన్ని దించాల్సి వచ్చింది. వర్జీనియాలోని వాషింగ్టన్ డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మ్యునిక్ బయల్దేరిన ఎ330-300 విమానం సిడ్నీకి నైరుతి దిశగా 70 మైళ్ల దూరంలో ఉండగా విమానంలో ఏదో కాలుతున్న వాసన వచ్చినట్లు ఓ ప్రయాణికుడు సిబ్బందికి తెలిపారు. దాంతో వాళ్లు వెంటనే గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దాంతో విమానాన్ని తక్షణం బోస్టన్ వైపు తిప్పి, 70 నిమిషాల తర్వాత దాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తర్వాత పొగ ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తే.. కాఫీ మిషన్ కారణంగా అని తెలిసింది. విమానాన్ని 16 గంటల పాటు బోస్టన్‌లోనే ఉంచేసి, క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత 18 గంటలు ఆలస్యంగా మ్యునిక్ తీసుకెళ్లారు. -
హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
నాగావ్: గౌహతి నుంచి ఈటానగర్ కు బయలు దేరిన ఎమ్ ఐ 17 హెలికాప్టర్ అత్యవసరంగా అసోంలోని నాగావ్ లో ల్యాండ్ అయ్యింది. హెలికాప్టర్ నుంచి ఇంధనం లీకవుతుండటం పైలట్ గుర్తించిడమే ఇందుకు కారణం. ఇందులో ఇద్దరు ప్రయాణీకులతో పాటు ఆరుగురు స్కైవన్ ఎయిర్ వేస్ కు చెందిన సిబ్బంది ఉన్నారు. స్కైవన్ ఎయిర్ వేస్ సంస్థ గౌహతి నుంచి ఈటానగర్ కు 290 కి.మీ మేర సర్వీసును అందిస్తుంది. 2011 ఏప్రిల్ లో ఎమ్ ఐ-17 హెలికాప్టర్ తవాంగ్ లో ప్రమాదానికి గురైంది. ఇందులో 17 మంది మృత్యువాతపడ్డారు. అప్పటి నుంచి ప్రయాణీకులను తరలింరాదని ఈ సర్వీసులపై డీజీసీఏ నిషేధం విధించింది. అరుణాచల్ ప్రదేశ్ దివంగత సీఎం దోర్జీ ఖండూ సైతం చాపర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆ రాష్ట్రంలో వాతావరణం ఆకాశ ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు చెబుతున్నారు. -
విమానం గాల్లో ఉండగా మిరాకిల్
దుబాయ్: అది సెబు పసిఫిక్ ఎయిర్ ఫ్లైట్. ఈ నెల(ఆగస్టు) 14న దుబాయ్ నుంచి మనీలాకు బయల్దేరింది. అందులో ఓ గర్భిణీ స్త్రీ, ఆమె తల్లి వెళ్లారు. అలా విమానం టేకాఫ్ తీసుకొని మధ్యలోకి వెళ్లగానే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. దీంతో తోటి ప్రయాణికులు అప్రమత్తమవడంతోపాటు విమానంలోనే సిబ్బందికి ఈ విషయం చేరవేయడంతో మెడికల్ అసిస్టెంట్స్ వచ్చారు. ప్లైట్ మధ్యలో దించే పరిస్థితి లేదు. మరోపక్క పురిటినొప్పులు ఎక్కువై ఆ బాధతో అరుస్తుండగా ఆమెను సీట్లో నుంచి కొంచెం విశాలమైన చోటుకి తీసుకెళ్లి అక్కడ ఏర్పాట్లు పూర్తి చేస్తుండగానే ఓ పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. అక్కడే ఓ టబ్ నిండా మినరల్ వాటర్ నింపి ఆ నీటితో పసిబిడ్డను శుభ్రం చేశారు. అనంతరం తల్లికి స్నానం చేయించారు. ఆ తర్వాత ఆమె తన ముద్దులపాపను చేతుల్లోకి తీసుకొని ఏం చక్కా ఎప్పటిలాగే తన సీట్లో కూర్చుంది. అలా నిమిషాల్లోనే విమానంలో ఇద్దరుగా వచ్చినవారు ముగ్గురయ్యారు. ఆ ప్రయాణికురాలు తల్లిగా ఆమెకు తల్లిగా ఉన్న పెద్దావిడ బామ్మగా మారింది. ఇదంతా పక్క సీట్లో కూర్చుని గమనించిన ఓ ప్రయాణికురాలు తన ఫేస్ బుక్ లో ఆ మాతృమూర్తి ఫొటోతో సహా పోస్ట్ చేసింది. ఇది నిజంగా ఓ మిరాకిల్ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు.. ఈ పాప జన్మించే సమయంలో విమానం భారత దేశ గగనతలంలో ఉంది. అప్పుడే జన్మించిన బిడ్డ రక్షణ చర్యలకోసం విమానాన్ని అత్యవసరంగా ఢిల్లీలో కూడా దించారు. అలా 8 గంటల్లో ముగియాల్సిన ప్రయాణం 18 గంటలు పట్టింది. అయినప్పటికీ ఏ ఒక్క ప్యాసింజర్ కూడా ప్రశ్నించలేదంట. మరో ఆశ్చర్యం ఏంటంటే భారత భూభాగంలో జన్మించిన ఈ బిడ్డకు టెక్నికల్ గా భారత పౌరసత్వం వస్తుందట. అయితే, విమానంలోగానీ, నౌకలోగాని జన్మించిన బిడ్డకు అవి ఏ దేశానికి చెందినవి అవుతాయో ఆ దేశాల పౌరసత్వాలే వస్తాయని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. -
విమానంలో ఐసీస్ అనుకూల నినాదాలు
ముంబై: దుబాయ్ నుంచి కొచ్చి వెళుతున్న ఇండిగో విమానంలో గురువారం ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని దారి మళ్లించి ముంబైలో దించారు. ప్రయాణికుల్లో కొందరు ఐసీస్‌కు అనుకూలంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానంలో మొత్తం 89 మంది ప్రయాణికులు ఉన్నారు. నినాదాలు చేసిన ప్రయాణికులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో రెండు గంటలు ఆలస్యంగా విమానం కొచ్చి బయలుదేరింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.