Bengaluru-Varanasi IndiGo Flight Makes Emergency Landing at Hyderabad Airport - Sakshi
Sakshi News home page

సాంకేతిక సమస్య!.. శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Apr 4 2023 7:13 AM | Updated on Apr 4 2023 12:07 PM

IndiGo Flight Makes Emergency Landing at Shamshabad Airport - Sakshi

రన్‌ అయిన కాసేపటికే విమానం హఠాత్తుగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి.. 

సాక్షి, హైదరాబాద్‌:  ఇండిగో విమానం ఒకటి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యింది. బెంగళూరు నుంచి వారణాసి మధ్య 6E897 నెంబరు ఇండిగో విమానం మంగళవారం ఉదయం 5గం.10ని. టేకాఫ్‌ అయ్యింది. అయితే.. సాంకేతిక సమస్యల తలెత్తడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు.  

ఉదయం 6గం. 16ని. హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం హఠాత్తుగా ల్యాండ్‌ అయ్యింది. సాంకేతిక సమస్యలు ఏర్పడటం వల్ల ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement